Vidadala Rajini: ఏపీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. కొన్ని సంఘటనలు మినహా మిగిలిన ప్రాంతాలలో పోలీసులు పకడ్బందీగా వ్యవహరించారు.. ఓటర్లు తమ ఓటు హక్కును అత్యంత స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. ముఖ్యంగా రాయలసీమలోని జగన్ నాయకత్వం పులివెందుల ప్రాంతంలో కొద్దిసేపు ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగింది. జగన్ రోడ్డు మీదికి వచ్చి ధర్నా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత జగన్ తన ఓటు హక్కు వినియోగించుకోకుండానే వెళ్ళిపోయారు. జగన్ తర్వాత అదే స్థాయిలో […]
విడదల రజిని: ఏపీలో స్థానిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. కొన్ని సంఘటనలు మినహా మిగిలిన ప్రాంతాలలో పోలీసులు పకడ్బందీగా వ్యవహరించారు.. ఓటర్లు తమ ఓటు హక్కును అత్యంత స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. ముఖ్యంగా రాయలసీమలోని జగన్ నాయకత్వం పులివెందుల ప్రాంతంలో కొద్దిసేపు ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగింది. జగన్ రోడ్డు మీదికి వచ్చి ధర్నా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత జగన్ తన ఓటు హక్కు వినియోగించుకోకుండానే వెళ్ళిపోయారు.
జగన్ తర్వాత అదే స్థాయిలో తన స్వరాన్ని నిరసన స్వరం వినిపిస్తున్నారు చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజిని. పోలింగ్ ముగిసిన తర్వాత సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా అనేక కీలక విషయాలు బయటపెట్టారు. చిలకలూరిపేటలో టిడిపి నాయకులు దౌర్జన్యం చేశారట. ఓటర్లను ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోనివ్వలేదట. తీవ్రంగా ఇబ్బందులు పెట్టారట. ఒకరకంగా ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అట. చిలకలూరిపేటలో బ్లాక్ డే అట.. స్థానిక ఎన్నికల్లో టిడిపి కూటమి విర్రవీగుతోందని.. అసలు ఇది గెలుపే కాదని.. రజిని క్లారిటీ ఇచ్చారు. అందుకే చిలకలూరిపేటలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందట.. ఇతర అధికారులు టిడిపి నాయకులకు సహకరించారట.
సాక్షి రిపోర్టర్ మీద పోలీసులు దాడి చేశారట.. సాక్షి రిపోర్టర్ ఫోన్ లాక్కున్నారట. తీవ్రంగా వేధింపులకు గురి చేశారట. ఒకవేళ రజిని చెబుతున్నట్టు ఇవన్నీ నిజాలే అయితే.. తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా పోలీసులు లేదా అధికారులు ఇబ్బంది పెడితే ఓటర్లు ఊరుకోరు కదా.. ధర్నా చేస్తారు కదా.. మరి అలాంటి సంఘటనలు చిలకలూరిపేటలో జరగలేదు కదా అని టిడిపి నేతలు అంటున్నారు. అధికారం… చివరికి ఎన్ని రకాలుగా సింపతి డ్రామాలు ప్లే చేసినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో రజిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని టిడిపి నేతలు చెబుతున్నారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు రైతులను పెట్టిన ఇబ్బందులు.. క్వారీ యజమానుల దగ్గర డబ్బులు వసూలు చేశారన్నారు.. ఇతర వ్యవహారాలు అందరికీ గుర్తున్నాయని.. గతంలో విడదల రజిని తన పీఏని పోలీసులు అరెస్ట్ చేస్తుంటే ఎలాంటి డ్రామాలు ఆడింది అందరికీ తెలుసునని టీడీపీ నేతలు చెబుతున్నారు. విలేకరుల సమావేశం పెట్టినంతమాత్రాన ప్రజలకు వాస్తవాలు తెలియకుండా పోవని.. ప్రజలు అంతా గమనిస్తున్నారని టిడిపి నేతలు చెబుతున్నారు.
ఇటీవల ఓ పోలీసు అధికారితో వాగ్వాదం పెట్టుకొని.. తనే కింద పడిపోయింది.. చివరికి సింపతి డ్రామా ఆడేందుకు రజనీ ప్రయత్నించారని.. అది వర్కౌట్ కాలేదని.. అందుకే ఫ్రస్టేషన్‌లో ఏదేదో మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. 2024 లో జరిగిన ఎన్నికల్లో చిలకలూరిపేటలో ప్రజలు టిడిపికి జై కొట్టారని.. స్థానిక ఎన్నికల్లో కూడా అదే ఫలితం వస్తుందని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే రిజల్ట్ రిపీట్ అవుతుందని టిడిపి నేతలు అంటున్నారు. ఇప్పటికైనా రజిని నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు.
