Home సినిమా హీరోయిన్ కేవలం ‘అందాల బొమ్మేనా’? – iDreamPost – Andhra Waves

హీరోయిన్ కేవలం ‘అందాల బొమ్మేనా’? – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
హీరోయిన్ కేవలం 'అందాల బొమ్మేనా'? - iDreamPost


టాలీవుడ్ సినిమాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. టెక్నాలజీ మారింది, మేకింగ్ స్టైల్ మారింది. కానీ ఇప్పటికీ మారకుండా అలాగే ఉండిపోయింది ఏంటంటే… మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలపై విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సౌత్ సినిమాల్లో హీరోయిన్ల క్యారెక్టర్లపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి. దక్షిణాదిలో హీరోయిన్లంటే స్కిన్ షోకే పరిమితం చేస్తున్నారనే అర్థం వచ్చేలా ఆమె మాట్లాడే ఇండస్ట్రీలో మళ్లీ పాత చర్చ మొదలైంది. నిజంగానే మన దర్శకులు హీరోయిన్లను ‘గ్లామర్ డాల్స్’గానే చూస్తున్నారా? కథల్లో వారికి సరైన ప్రాధాన్యత దక్కడం లేదా? అంటే మెజారిటీ ప్రేక్షకుల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది.

పాటలు, ఫ్లర్టింగ్‌ కోసమేనా?

ఓ పెద్ద హీరో సినిమా వస్తోందంటే చాలు… అందులో హీరోయిన్ పాత్ర ఎలా ఉంటుందో థియేటర్‌కు వెళ్లే ముందే అందరికీ ఓ ఐడియా వచ్చేస్తుంది. హీరో హీరోయిన్ వెంటపడటం, కాసేపు ఆటపట్టించడం, మధ్యలో మూడు నాలుగు రొమాంటిక్ డ్యూయెట్లు వేయడం, చివర్లో విలన్ ఎత్తుకెళ్తే హీరో వచ్చి కాపాడటం… కొన్నేళ్లుగా ఇదే రొటీన్ ఫార్ములా నడుస్తోంది. కథలో అసలు హీరోయిన్ ఉందా లేదా అన్నట్టుగా పాత్రలు రాస్తున్నారు తప్ప, సినిమా కీలక మలుపు తిప్పే బలం ఉన్న పాత్రలు స్టార్ హీరోల సినిమాల్లో దాదాపు కనిపించడం లేదనే విమర్శలు వచ్చాయి.

అసలు బలమైన పాత్రలే రాలేదా

టాలీవుడ్ చరిత్ర చూస్తే ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని అంటున్నారు. అలనాటి సావిత్రి, జమున, వాణిశ్రీల కాలంలో హీరోలతో సమానంగా హీరోయిన్ల పాత్రలకు ప్రాణం ఉంటుందని చెబుతున్నారు. ఆ తర్వాత విజయశాంతి అయితే ఏకంగా స్టార్ హీరోలకు పోటీగా నిలబడి సినిమాలు నడిపించారు. రీసెంట్ టైమ్స్‌లో కూడా అనుష్క ‘అరుంధతి’, కీర్తి సురేష్ ‘మహానటి’, సమంత ‘ఓ బేబీ’, ‘మా ఇంటి బంగారం’ లాంటి సినిమాలు లేడీ ఓరియెంటెడ్ కథలైనా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’లో శివగామి, దేవసేన పాత్రలను ప్రేక్షకులు ఎంతగా ఓన్ చేసుకున్నారో చూశాం.

అంటే మన దగ్గర టాలెంటెడ్ నటిమణులు ఉన్నారు, వాళ్లను ఆదరించే ఆడియన్స్ ఉన్నారు. కానీ నార్మల్ కమర్షియల్ సినిమాలకు వచ్చేసరికి రచయితలు, దర్శకులు హీరోయిన్ల పాత్రలపై పెద్దగా ఫోకస్ చేయడం లేదనే విమర్శలు బలంగా ఉన్నాయి. హీరో ఇమేజ్, ఫైట్లు, ఎలివేషన్ల మీదే దృష్టి పెడుతూ హీరోయిన్ రోల్‌ను జస్ట్ స్క్రీన్‌ను అందంగా చూపించే ఆప్షన్‌గానే వదిలేస్తున్నారని అంటున్నారు.

జాన్వీ కామెంట్స్ కొందరికి ఇబ్బందిగా అనిపించినా, అందులో వాస్తవం లేకపోలేదనేది చాలామంది సినీ ప్రేమికుల మాట. రీసెంట్‌గా రిలీజ్ అయిన కొన్ని పెద్ద చిత్రాల విషయంలోనూ హీరోయిన్ రోల్స్‌పై ఇదే చర్చ జరిగిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ మార్కెట్ పెరిగినట్లే కథల్లో కూడా మార్పు రావాలని, హీరోయిన్ అంటే కేవలం డ్యూయెట్లకే పరిమితం కాకుండా కథను ముందుకు నడిపించే క్యారెక్టర్లు రావాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird