Home సినిమా జయసూర్యలా అభిషేక్‌ను వాడుకుంటే? – iDreamPost – Andhra Waves

జయసూర్యలా అభిషేక్‌ను వాడుకుంటే? – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
జయసూర్యలా అభిషేక్‌ను వాడుకుంటే? - iDreamPost


పవర్ ప్లే.. ఒకరకంగా మ్యాచ్‌ను డిసైడ్ చేసేంత పవర్ ఉన్న పార్ట్. టీ20ల్లో మొదటి 6 ఓవర్లు, వెన్డేల్లో మొదటి 15 ఓవర్ల పవర్ ప్లేగా నిలిచింది. ఈ సమయంలో ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. థర్టీ యార్డ్ సర్కిల్ బయట కేవలం ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు. థర్టీ యార్డ్ సర్కిల్ పై నుంచి బాల్ కొట్టే ఎబిలిటీ ఉంటే.. పవర్ ప్లేలో కావాల్సినన్ని పరుగులు పిండుకోవచ్చు. అందుకే దాదాపు అన్నీ టీమ్స్‌లో అగ్రేసివ్‌గా ఆడే ప్లేయర్‌లు ఓపెనర్‌లుగా వస్తుంటారు.. పవర్ ప్లేను యూటిలైజ్ చేశారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారూ అనే డౌట్ వస్తుందా? దానికో కారణం ఉందీ, అలాగే చిన్న ఆశ కూడా ఉంది. అదేంటంటే.. వచ్చే ఏడాది జరగనున్న 2027 వన్డే వరల్డ్ కప్ అతను గెలవాలని కోరుకుంటున్నారు కదా.. అందుకోసమే ఇదంతా.

ప్రస్తుతం భారత టీ20 టీమ్‌లో అభిషేక్ శర్మ ఎలాంటి బ్యాటింగ్ చేస్తున్నాడో చూస్తున్నాను. విధ్వంసం, భయంకరం.. వంటి పదాలు కూడా చిన్నబోతున్నాయి అభిషేక్ బాదుడు. 5 ఓవర్లలో 100, 6 ఓవర్ల పవర్ ప్లే పూర్తి అయ్యేసరికి 118. ఇది మామూలు కొట్టుడు కాదు. ప్రపంచ రికార్డు బద్దలైంది. దీనికి కారణం అభిషేక్ అగ్రేసివ్ బ్యాటింగ్, వైభవ్ సపోర్ట్‌తో పాటు మరో ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఉంది. అదే పవర్ ప్లే. దీన్ని అద్బుతంగా యుటిలైజ్ చేయడంలో అభిషేక్ తోపు. అది చాలా కాలంగా చూస్తూ వస్తున్నాం. ఐపీఎల్, టీ20 ఇంటర్నేషనల్ అయినా క్రికెట్ అయినా పవర్ ప్లేలో వీరబాదుడికి అభిషేక్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. మ్యాచ్‌ ఎటు వెళ్తుందో పవర్ ప్లేలో డిసైడ్ చేసి పడేస్తున్నాడు.

ఇప్పుడీ అద్భుతమైన టాలెంట్‌ను అద్భుతమైన వన్డే వరల్డ్ కప్ 2027 కోసం ఎందుకు వాడుకోవద్దు అనే డౌట్ సగటు క్రికెట్ అభిమానికి వస్తోంది. వన్ ఫార్మెట్‌లో కూడా ఇలాంటి ఇంటెంట్‌తో పవర్ ప్లేలో బ్యాటింగ్ చేయగలిగితే.. అద్భుతంగా ప్లస్ అవుతుంది. అయితే అల్రెడీ వేడుకలకు గుడ్డల్లో శుభమన్ గిల్, రోహిత్ శర్మ వంటి అద్భుతమైన ఓపెనర్లు ఉన్నా.. అభిషేక్‌ను కూడా ఏదో విధంగా వాడుకుంటే బెటర్. 1996లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌ను ఒకసారి గుర్తు చేసుకుంటే.. శ్రీలంక జట్టు మొత్తం అద్భుతంగా ఆడి ఛాంపియన్ అయినా.. అప్పటి యంగ్ ఓపెనర్ సనత్ జయసూర్య పాత్ర చాలా ఉంది. ఓపెనర్ అనే పదానికి అప్పటి వరకు ఉన్న డెఫినేషన్ మార్చేశాడు. పవర్ ప్లేలో రొమేష్‌తో కలిసి స్టార్ట్ చేసి.. తన అగ్రేసివ్ బ్యాటింగ్‌తో పవర్ ప్లేలో భారీగా పరుగులు చేశాడు. అది లంకకు కొండంత బలాన్ని ఇచ్చింది.

ఒక ఓపెనర్ పవర్ ప్లేను సరిగ్గా వాడుకోగలిగితే రిజల్ట్ ఇంత అద్భుతంగా ఉంటుందా అని ప్రపంచ నివ్వెర పోయింది. ఇప్పుడు మనం కూడా అసలు 2027 వరల్డ్ వరల్డ్ కప్ ప్లాన్స్‌లో ఎక్కడా లేని అభిషేక్ శర్మను తీసుకొచ్చారు.. అతనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి.. పవర్ ప్లేలో కుమ్మేయమని చెప్తే నెక్ట్స్ లెవెల్ స్ట్రాటజీ అవుతుంది. పైగా జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ఎక్స్పీరియన్స్ ఎలానో ఉంది. కాస్త అటు ఇటూ అయినా వాళ్లు పరిస్థితి నిలబెట్టుకుంటారు. కానీ అభిషేక్ 15 ఓవర్ల పవర్ ప్లేలో నిలబడినా చాలు.. మరింత చేయాల్సిన స్కోర్ సగం వచ్చేసినట్టే. అంతలా ఇంప్యాక్ట్ చూపించే ప్లేయర్ అతను. శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లో బ్యాటింగ్ ఆర్డర్ ప్యాక్ అయినట్లు కనిపిస్తున్నా.. గిల్‌ను ఫోర్త్ ప్లేస్‌లో ఆడించి, అభిషేక్, రోహిత్‌తో ఓపెనింగ్ చేస్తే.. భయంకరమైన ఓపెనింగ్ జోడీ అవుతుంది. ఇదంతా కానీ పని అనిపించినా.. వన్ పర్సంట్ ఛాన్స్ ఉన్నా.. హెడ్ కోచ్ గంభీర్ మాత్రం అభిషేక్ వైపే మొగ్గుచూపుతాడు. చూద్దాం.. ఇంకా వరల్డ్ కప్‌కు చాలా టైం ఉంది. ఏదైనా జరగొచ్చు. అయితే ఎంత టీ20 స్పెషలిస్ట్ అయినా కూడా అభిషేక్‌ను టీమ్ నుండి ఎక్కువ కాలం దూరం అయితే పెట్టలేరు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రచయిత అవతార్

సయ్యద్ నాగ్ పాషా

నా పేరు సయ్యద్‌ నాగ్‌పాషా. iDreamPost.comలో చీఫ్ సబ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. 2023 నుంచి ఐడ్రీమ్‌తో నా ప్రయాణం మొదలైంది. ఇక్కడ డెస్క్ వర్క్‌తో పాటు రాజకీయ, జాతీయ, అంతర్జాతీయ, హెల్త్, లైఫ్ స్టైల్, క్రికెట్‌కు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటాను. అలాగే పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్ కంటెంట్ కూడా రాస్తుంటాను. జర్నలిజం వృతిలోకి 2018లో వచ్చాను. నాకు జర్నలిజంలో 9 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. 2017లో సాక్షి జర్నలిజం స్కూల్ నుంచి ఈ జర్నీ మొదలైంది. ఆ తర్వాత సాక్షి వెబ్‌సైట్‌, ఖమ్మం యూనిట్‌ ఆఫీస్‌, సుమన్‌ టీవీ, టీవీ9 డిజిటల్‌లో సేవలు అందించాను.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird