Home Latest News నెల్లూరు టీడీపీలో వర్గ విభేదాలు.. బీద రవిచంద్రపై మంత్రి ఆనం ఆగ్రహం.! | ఆనం రామనారాయణ రెడ్డి | బీద రవిచంద్ర | గుండి రాకేష్ | నెల్లూరు టీడీపీ | నెల్లూరు రాజకీయం | టీడీపీ అంతర్గత విభేదాలు | టీడీపీ గ్రూపు రాజకీయాలు | ZPTC అభ్యర్థులు | ZPTC బి-ఫారమ్‌లు | వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి | పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి | వంటేరు వేణుగోపాల్ రెడ్డి | ఆత్మకూరు రాజకీయం – Andhra Waves

నెల్లూరు టీడీపీలో వర్గ విభేదాలు.. బీద రవిచంద్రపై మంత్రి ఆనం ఆగ్రహం.! | ఆనం రామనారాయణ రెడ్డి | బీద రవిచంద్ర | గుండి రాకేష్ | నెల్లూరు టీడీపీ | నెల్లూరు రాజకీయం | టీడీపీ అంతర్గత విభేదాలు | టీడీపీ గ్రూపు రాజకీయాలు | ZPTC అభ్యర్థులు | ZPTC బి-ఫారమ్‌లు | వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి | పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి | వంటేరు వేణుగోపాల్ రెడ్డి | ఆత్మకూరు రాజకీయం – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, జిల్లా టీడీపీ అబ్జర్వర్ గుండి రాకేష్ వ్యవహారంపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. తన నియోజకవర్గంలో పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న వారికి ఇస్తూ, తనకు తెలియకుండానే జెడ్పీటీసీ అభ్యర్థులకు బీరాలు ఎలా అందజేస్తారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లా టీడీపీలో జరుగుతున్న జెడ్పీటీసీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసే కార్యక్రమంలో ఈ వివాదం చోటుచేసుకున్నట్లు ప్రచారం. తన నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి సూచనల మేరకు అభ్యర్థులకు బీఫారాలు ఎలా ఇస్తారని మంత్రి ఆనం ప్రశ్నించారు. అలాంటి వ్యక్తులను పార్టీ కార్యాలయానికి ఎలా రానిస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు.

‘ఇన్ని జరుగుతున్నా తలవంచుకుని పోతున్నా.. తల ఎత్తితే మీరు రాజకీయాలు చేయలేరు’ అంటూ మంత్రి ఆనం వ్యాఖ్యానించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఈ వ్యాఖ్యలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

జిల్లా రాజకీయాల్లో వర్గపోరుకు కారణం ఎవరు.?

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆయన దృష్టి సారించాలని మంత్రి ఆనం సూచించినట్లు సమాచారం. రాజకీయ వ్యవహారాలపై అవగాహన ఉన్న చంద్రమోహన్‌రెడ్డి వంటి నేతల నుంచి నేర్చుకోవలంటూ హితవు పలికినట్లు ప్రచారం జరుగుతోంది.

పరిషత్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ టీడీపీలో విభేదాలు తలెత్తినట్లు ఇప్పటికే జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని అభ్యర్థిగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సూచించగా, బీద రవిచంద్ర మాత్రం వంటేరు వేణుగోపాల్‌రెడ్డికి మద్దతు తెలిపినట్లు ప్రచారం సాగింది. చివరకు వేమిరెడ్డి సూచించిన పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డే జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా నిలిచినట్లు సమాచారం.

ఈ పరిణామాలు సద్దుమణగకముందే జెడ్పీటీసీ బీ ఫారాల పంపిణీ అంశం మరోసారి పార్టీలో చర్చకు దారితీసినట్లు తెలుస్తోంది. ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కన్నబాబుకు బీద రవిచంద్ర ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే, మంత్రి ఆనం దృష్టికి తీసుకురాకుండానే జెడ్పీటీసీ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

టీడీపీకి నష్టం తప్పదా.?

జిల్లాలో పార్టీ వ్యవహారాలు, అభ్యర్థుల ఎంపికలో లోపాలు, నేతల మధ్య విభేదాలు టీడీపీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ నాయకత్వం వర్గ నష్టాలను నియంత్రించకపోతే భవిష్యత్తులో రాజకీయంగా జరుగుతున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే, ఈ వివాదానికి సంబంధించిన అధికారిక స్పందనలు వెలువడాల్సి ఉంది.కాగా, జిల్లా టీడీపీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు.

[ Anam Ramanarayana Reddy, Beeda Ravichandra, Gundi Rakesh, Nellore TDP, Nellore Politics, TDP Internal Disputes, TDP Group Politics, ZPTC Candidates, ZPTC B-Forms, Vemireddy Prabhakar Reddy, Polamreddy Srinivasulu Reddy, Vanteru Venugopal Reddy, Atmakur Politics, Andhra Pradesh Politics ]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird