ఐపీఎల్ 2027 వేలానికి ముందు ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి నడుస్తోంది. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ ఈ వేలంలో తన పేరును నమోదు చేసుకునే అవకాశం ఉందని సమాచారం. అయితే, అమీర్ వేలంలో పాల్గొంటాడా? అతడికి ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతి లభిస్తుందా? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్న అమీర్, యూకే ఆటగాడిగా పలు ఫ్రాంచైజీ క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నాడు. క్రిక్‌బజ్ కథనం ప్రకారం, అతను యూకే ఆటగాడిగా ఏపీఎల్ డ్రాఫ్ట్‌కు నమోదుతో పాటు, స్థానిక ఆటగాడి హోదాలో టీ20 బ్లాస్ట్, ది హండ్రెడ్ వంటి లీగుల్లో ఆడాడు.
దీంతో ఐపీఎల్ వేలంలోకి రావాలనుకుంటే, అమీర్ పౌరసత్వం, ఆటగాడిగా అర్హత వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. ఇండియా, పాకిస్థాన్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా 2008 తర్వాత పాకిస్థాన్‌ను ఐపీఎల్‌లో ఆడలేదు. అయితే, బ్రిటిష్ పౌరసత్వం పొందిన అమీర్ విషయంలో నిబంధనలు ఎలా వర్తిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. పౌరసత్వం మారినంత మాత్రాన ఐపీఎల్‌లో ఆడేందుకు ఆటోమెటిక్‌గా అనుమతి లభిస్తుందని చెప్పలేం. వేలం నమోదు, బీసీసీఐ నిబంధనలు, అవసరమైన అనుమతులపై స్పష్టత రావాల్సి ఉంటుంది.
గతంలో పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ అజహర్ మహమూద్ బ్రిటిష్ పాస్‌పోర్ట్ పొందిన తర్వాత ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గురించి ఆడాడు. ఈ నేపథ్యంలో అమీర్ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లోకి తిరిగి వస్తే విదేశీ ఆటగాడిగా పాల్గొంటానని అమీర్ గతంలో వెల్లడించినట్లు సమాచారం. మొత్తంగా, ఐపీఎల్ 2027 వేలంలో అమీర్ పేరు ఉంటుందా? ఉంటే అతడికి ఆడే అవకాశం లభిస్తుందా? అన్నది అధికారిక ప్రకటనలు, నిబంధనలు స్పష్టత తర్వాతే తేలనుంది.

