Home క్రైమ్ DJ శబ్ద కాలుష్యం : డిజె సౌండ్ మోత. ఎగిరిపడిన షాపులో ఐటమ్స్.. – Andhra Waves

DJ శబ్ద కాలుష్యం : డిజె సౌండ్ మోత. ఎగిరిపడిన షాపులో ఐటమ్స్.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


DJ Noise Pollution : ఒకప్పుడు చావైనా.. పెళ్లయినా.. మరే వేడుకైనా సరే డప్పు చప్పుళ్ళు ఉండేవి. అవి చెవులకు వినసొంపుగా ఉండేవి. కళాకారులు లయబద్ధంగా డప్పులు కొడుతుంటే ఊపు వచ్చేది. ముసలి వాళ్లు కూడా కాళ్లు కదిపేవారు. ఇక యువకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సంస్కృతి మనదేశంలో ప్రతి గ్రామంలో ఉండేది. వేడుకల సమయంలో.. ఇతర విషాదాలు చోటు చేసుకున్నప్పుడు కచ్చితంగా డప్పు చప్పుళ్లు ఉండేవి. సందర్భానికి తగ్గట్టుగా కళాకారులు డప్పులను […]

DJ Noise Pollution : ఒకప్పుడు చావైనా.. పెళ్లయినా.. మరే వేడుకైనా సరే డప్పు చప్పుళ్ళు ఉండేవి. అవి చెవులకు వినసొంపుగా ఉండేవి. కళాకారులు లయబద్ధంగా డప్పులు కొడుతుంటే ఊపు వచ్చేది. ముసలి వాళ్లు కూడా కాళ్లు కదిపేవారు. ఇక యువకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అలాంటి సంస్కృతి మనదేశంలో ప్రతి గ్రామంలో ఉండేది. వేడుకల సమయంలో.. ఇతర విషాదాలు చోటు చేసుకున్నప్పుడు కచ్చితంగా డప్పు చప్పుళ్లు ఉండేవి. సందర్భానికి తగ్గట్టుగా కళాకారులు డప్పులను వాయించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఒకప్పుడు పబ్బు.. క్లబ్బులకు మాత్రమే పరిమితమైన డీజే మారుమూల గ్రామాలకు వచ్చేసింది. దీంతో డప్పులు కొట్టే కళాకారులకు ఉపాధి లేకుండా పోయింది. డీజే వల్ల శబ్దం తీవ్రత పెరిగింది. వేడుకతో సంబంధం లేకుండా డీజేలు ఉపయోగించడం పరిపాటిగా మారిపోయింది. వీటి శబ్దం వల్ల చెవులు హోరెత్తిపోతున్నాయి. అంతేకాదు కొంతమంది గుండెపోటు మరణాలకు కూడా కారణమవుతున్నారు.

2018లో తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో ఓ వివాహ వేడుకలో డీజే ఉపయోగించారు. ఆ శబ్దం తీవ్రతకు పెళ్లి కుమార్తె గుండెపోటుకు గురై అక్కడికక్కడే కన్ను మూసింది. శబ్దం తీవ్రత వల్ల ఆమె హృదయ స్పందన ఒక్కసారిగా ఆగిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు. చివరికి ప్రభుత్వం డీజే పై నిషేధం విధించింది.. ఉపయోగిస్తూనే ఉన్నారు.

డీజే శబ్దం తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుందో చెప్పే సంఘటన ఇది. డిజె సౌండ్ వల్ల మెడికల్ షాప్ లో మందు డబ్బాలు వాటంతట అవే కింద పడిపోయాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక వివాహ వేడుకలో డీజేను ఏర్పాటు చేశారు. వాటి వల్ల విపరీతంగా శబ్దాలు వచ్చాయి. ఆ షాపు ఓనర్ నిర్వాహకులతో అనేక సందర్భాల్లో ఉపయోగించారు.. తీవ్రంగా హెచ్చరించినట్లు.. కాళ్లు పట్టుకొని ప్రధే పడకుండా పోయింది. దీంతో అతడు అలానే ఉండిపోయాడు. కానీ ఆ నిర్వాహకులు మాత్రం అలానే సౌండ్ పెట్టుకొని పిచ్చిపిచ్చిగా డాన్సులు వేశారు. ఆ సౌండ్ తీవ్రత వల్ల షాప్ లో ఉన్న వస్తువులు కింద పడిపోయాయి. అయితే డీజే వల్ల సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుందని.. కొన్ని సందర్భాల్లో గుండెపోటు కూడా వస్తుందని వైద్యులు చెబుతున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird