Home Latest News ఉత్తరప్రదేశ్ మహిళ : అక్షరాలు 12 లక్షలు.. భర్తకు తెలియకుండా దాచింది.. తీరా పెట్టె తెరిచేసరికి.. – Andhra Waves

ఉత్తరప్రదేశ్ మహిళ : అక్షరాలు 12 లక్షలు.. భర్తకు తెలియకుండా దాచింది.. తీరా పెట్టె తెరిచేసరికి.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper



ఉత్తరప్రదేశ్ మహిళ : మన ఇళ్లల్లో ఆడవాళ్లు డబ్బులను పోపుల పెట్టె లోనో.. ఎవరికీ కనిపించని డబ్బాలలోనో దాస్తారు. ఇంట్లో అత్యవసర పరిస్థితుల్లో డబ్బు లేనప్పుడు వాటిని బయటికి తీస్తారు. ఎందుకంటే పొదుపు అనేది ఆడవాళ్లకు జన్మతః వచ్చిన విద్య. అందువల్లే ఆడవాళ్లు ఆర్థిక రంగ వ్యవహారాలలో మగవాళ్ళతో పోల్చి చూస్తే అత్యంత మెరుగ్గా ఉంటారు. పైగా కుటుంబానికి సంబంధించి ఏదైనా ఆర్థిక సమస్య వస్తే వెంటనే ఉపాయాలు ఆలోచించి.. వాటిని పరిష్కరిస్తూ ఉంటారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ మాత్రం పై ఉపోద్ఘాతానికి భిన్నంగా ఆలోచించింది. డబ్బును పొదుపు చేసింది. భర్తకు తెలియకుండా దాచింది. ఆమె ఒక్కటి తలిస్తే.. దైవం ఒకటి తలచింది. భర్తకు తెలియకుండా భారీగా కూడబెట్టిన ఆమె.. చివరికి తల పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అంతేకాదు భర్త దృష్టిలో ఆమె ఒక మోసం గత్తెగా నిలిచిపోయింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గొండా ప్రాంతంలో ఓ మహిళ తన భర్తకు తెలియకుండా బంగారం కొనుగోలు చేయడానికి.. డబ్బులు దాచుకోవడం మొదలుపెట్టింది. ఒకటి కాదు రెండు కాదు.. ఎన్ని సంవత్సరాలు పాటు కష్టపడి 12 లక్షలు కూడబెట్టింది. ఆ డబ్బు భర్త కంటపడకుండా ఉండేందుకు ట్రంక్ పెట్టెలో దాచింది. అయితే ఇటీవల బంగారం ధర పెరుగుతున్న నేపథ్యంలో.. తన వద్ద ఉన్న డబ్బుతో బంగారం కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. తాను దాచిన ట్రంక్ పెట్టెను బయటకి తీసింది. తాను దాచిన నగదు లెక్కపెట్టడానికి సిద్ధంగా ఉన్న ఆమెకు షాకింగ్ పరిణామం ఎదురైంది. ట్రంక్ పెట్టెలో దాచిన నగదును చూసిన ఆమెకు దిగ్భ్రాంతి కలిగింది. ఆ ట్రంక్ పెట్టెలో దాచిన నగదును ఎలుకలు కొరికాయ్. దాదాపు సగం నోట్లు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. బాగున్న నోట్లను.. చివర్లో చిరిగిన నోట్లను ఆమె సేకరించడం మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు సంచలనంగా మారాయి.

“భర్తకు తెలియకుండా డబ్బు దాచుకుంది. దాంతో బంగారం కొనుగోలు చేసింది. కానీ బంగారం కూడా కొనలేకపోయింది. ఆమె దాచుకున్న నోట్లలో కొన్ని ఎలుకలు కొరికేశాయి. ఇది ఆమెకు తీవ్ర నష్టాన్ని కలుగజేసిందని” స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఆ పెట్టెలో చిన్నపాటి కన్నం ఉండటంతో ఎలుకలు అందులోకి ప్రవేశించాయి. అందులో ఉన్న కరెన్సీ నోట్లను కొరకడం మొదలు పెట్టాయి. ఆ ఎలుకలు చేసిన విధ్వంసం వల్ల తీవ్ర నష్టం జరిగింది.. అయితే ఇందులో సగం వరకు నోట్లు దేనికి పనికిరాకుండా పోయాయని.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

హింద్ ఫస్ట్ (@hindfirst) ద్వారా భాగస్వామ్యం చేయబడిన పోస్ట్



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird