Home Latest News పెద్దల సభకు లెక్కల మాస్టారు భాష్యం రామకృష్ణ | భాష్యం విద్యాసంస్థల చైర్మన్ | టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా | చింతకాయల విజయ్ రాజ్యసభ | భాష్యం రామకృష్ణ టీడీపీ | సానా సతీష్ బాబు ఎంపీ – Andhra Waves

పెద్దల సభకు లెక్కల మాస్టారు భాష్యం రామకృష్ణ | భాష్యం విద్యాసంస్థల చైర్మన్ | టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా | చింతకాయల విజయ్ రాజ్యసభ | భాష్యం రామకృష్ణ టీడీపీ | సానా సతీష్ బాబు ఎంపీ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌గా సుపరిచితులైన భాష్యం రామకృష్ణ.. పల్నాడు జిల్లా అమరావతి మండలం ఎనికపాడు ఆయన స్వగ్రామం. సామాన్య రైతు కుటుంబంలో భాష్యం రామారావు, పేరమ్మ దంపతులకు 1969 మార్చి 1న రామకృష్ణ జన్మించారు. బీఎస్సీ, బీడీ పూర్తి చేసి గుంటూరులోని ప్రైవేట్ స్కూలులో లెక్కల మాస్టారిగా కెరీర్ ప్రారంభించిన ఆయన 1983 గుంటూరులోనే భాష్యం విద్యాసంస్థలను స్థాపించి అంచెలంచెలుగా ఎదిగారు.

ప్రస్తుతం, తెలంగాణ, కర్ణాటకల్లోని వందకుపైగా భాష్యం ఏపీ విద్యా సంస్థలు లక్షలాది మందికి బోధన అందిస్తున్నాయి. పాఠశాల విద్యలో ప్రత్యేకమైన ముద్ర వేసిన భాష్యం రామకృష్ణ ముందు నుంచీ టీడీపీ సానుభూతిపరులు. ఆయన 2024లో గుంటూరు పార్లమెంటు ఆశించారు. ఓ దశలో ఏలూరు లోక్‌సభ స్థానం ఇచ్చినా పోటీకి సిద్ధపడ్డారు. అయితే చివరి నిమిషంలో ఆయనకు టికెట్ ఇవ్వలేకపోయారు. భవిష్యత్తులో న్యాయం అప్పుడే చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇచ్చారు.

2019, 2024 ఎన్నికల్లో రామకృష్ణ టీడీపీ తరపున పోటీలో ఉంటారని ప్రచారం జరిగినా రకరకాల సమీకరణలతో అది కార్యరూపం దాల్చలేదు. అయినా పార్టీకి అండగా ఉంటూ పలు కార్యక్రమాల్లో భాగస్వాములవుతూ వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా పార్టీ కార్యక్రమాల నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, కేరళలకు కూడా విరాళాలు అందించి బాధితులకు అండగా నిలిచారు. పార్టీని నమ్ముకుని ఇన్నేళ్లుగా అందించిన రామకృష్ణకు ఇప్పుడు టీడీపీ అధినేత సముచిత ప్రాధాన్యత ఇచ్చారు.

తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్ అంటే భాష్యం రామకృష్ణకు అపారమైన అభిమానం. చంద్రబాబు తన విద్యా సేవల్ని గుర్తించి 2014 నుంచే రాజకీయాల్లోకి రావాలని, ప్రజాసేవలో విస్తృత పాత్ర పోషించాలని ప్రోత్సహించారని రామకృష్ణ పేర్కొన్నారు. తనపై విశ్వాసం ఉంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లు తనపై పెట్టిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఒక లెక్కల మాస్టారి అంకితభావం, పట్టుదల ఆయన్ని పెద్దల సభకు పంపుతోంది

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird