లాలూ ఇంటి వద్ద ఆర్జేడీ కార్యకర్తలు కర్రలతో కాపలా..
బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్ , ఆయన సతీమణి రబ్రీదేవిలకు బీహార్ ప్రభుత్వం జడ్‌ప్లస్ కేటగిరీ భద్రతను ఇటీవల ఉపసంహరించుకుని, ప్రత్యేక సాయుధ పోలీసులతో భద్రత కల్పించింది. అయితే ఈ చర్యను లాలూ కుటుంబం తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. వారికి ప్రభుత్వం కేటాయించిన భద్రత వద్దంటూ ఇంటి నుంచి పోలీసులను పంపేసింది. దీంతో పాట్నాలోని 10- సర్క్యులర్ రోడ్‌లోని లాలూ నివాసం వద్ద ఆర్జేడీ కార్యకర్తలు, నేతలు కర్రలతో కాపలా కాస్తున్నారు.
ఇక, బిహార్ ప్రతిపక్ష నేత హోదాలో లాలూ తేజస్వీయాదవ్‌కు వై-ప్లాస్, అలాగే ఎంపీ మిసా భారతికి ఉన్న భద్రతను యథావిధిగా కుమారుడు బిహార్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్‌కు ప్రస్తుతం ఉన్న వై-ప్లాస్ భద్రతను తొలగించారు.. ఓ కానిస్టేబుల్‌ను కేటాయించారు. ఈ పరిణామాలపై తేజస్వీ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తనకు కల్పించిన వై-కేటగిరీ భద్రతను వెనక్కి పంపారు. పరీక్ష లాలూ కుమార్తె రోహిణి ఆచార్య నివేదించారు.
