తనను చూడాలని ఉందంటూ.. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. వృద్ధుడిని కలుస్తానని మాటిచ్చారు. ఈ మేరకు ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో.. ‘సత్యనారాయణ గారు.. రేపు సిద్ధాంతంలో కలుద్దాం’ అని రాసుకొచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా , పెనుగొండ మండలం కామధేనువులంకకు చెందిన వృద్ధుడు సత్యనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాలనుకుంటున్నారు.
ఆ వృద్ధుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఎంత అభిమానం ఉందో తెలిపే వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియో తాను చంద్రబాబుని ఒక్కసారి చూడాలని ఆ వృద్ధుడు ఆకాక్షించారు. ఈ నెల 9వ తేదీన సీఎం చంద్రబాబు పెనుగొండ మండలం సిద్ధాంతం వెళ్లనున్నారు. వృద్దుడి గ్రామం కామథేనువులంక అక్కడికి సమీపంలోనే ఉండటంతో చంద్రబాబును చూడాలన్న ఆయన కోరిక నేరవేరనుంది.
