డిసెంబర్ 4, 2025 3:17PMన పోస్ట్ చేయబడింది

భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభం. ఈ సమ్మిట్‌కు హాజరయ్యే ప్రపంచ ప్రతినిధులను మన భిన్న సాంస్కృతిక, కళారూపాలతో ఆహ్వానించారు. ఈవేడుకల్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహిత కీరవాణి తన అద్బుతమైన సంగీత కచేరితో హాజరుకానున్నారు. కీరవాణి 90 నిమిషాల పాటు ప్రత్యేక సంగీత కచేరిని నిర్వహిస్తారు.
ప్రముఖ వీణా విద్యాంసురాలు పి.జయలక్ష్మీ వీణా కార్యక్రమం, కళా కృష్ణ ఆధ్వర్యంలో పేరణి నాట్యం ప్రదర్శనకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రముఖ ఇంద్రజాల మాంత్రికుడు సామల వేణు తన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. వీటితో తెలంగాణ సంప్రదాయ కళా రూపాలు సందడి చేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర సంస్కృతి కళలను ప్రతిభించేలా కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడి, ఒగ్గు డోలు, మహిళల డప్పులు, పేరణి నృత్యం, బోనాల కోలాటం వంటి ప్రజా కళారూపాలను ఆహ్వానించారు. డిసెంబర్ 10 నుంచి 13 తేదీ వరకు ఈ వేడుకలను ప్రజలందరూ చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నాలుగు రోజులు పాటు జరిగే కార్యక్రమాల్లో రోజంతా సాంస్కృతిక కళారూపాలతో మ్యూజికల్ ఆర్కెస్ట్రా నిర్వహించారు.
