Home సినిమా మెగాస్టార్ కుటుంబీకుల సినిమాలను ఆపాలని కక్ష కట్టారు.. ఆధారాలతో న’ట్టికుమార్ ఆరోపణ – Andhra Waves

మెగాస్టార్ కుటుంబీకుల సినిమాలను ఆపాలని కక్ష కట్టారు.. ఆధారాలతో న’ట్టికుమార్ ఆరోపణ – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబీకులు నటించిన సినిమాలకు రిలీజ్ సమయంలో ఏదోరకంగా అడ్డంకులు సృష్టించి ఆపాలని దిల్ రాజు, శిరీష్ లు ప్రయత్నిస్తున్నారని, ‘మన శంకర వరప్రసాద్’ రిలీజ్ సమయంలో విశాఖపట్నం ఏరియాలో ఆ సినిమాను ఆపాలని వారు కుట్రలు పన్నారని సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ ఉన్నారు. మంగళవారం విశాఖపట్నం ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో నట్టి కుమార్ మాట్లాడుతూ, విశాఖపట్నంకు చెందిన గాయత్రీ దేవి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్)ని అడ్డం పెట్టుకుని, దిల్ రాజు, శిరీష్‌లు ఆ మధ్య చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్’ విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్రలో విడుదల కాకుండా తీవ్రంగా ప్రయత్నించారు.

అందుకు సంబంధించి శిరీష్, బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) మధ్య జరిగిన ఆడియో సంభాషణను కూడా ఈరోజు బయటపెట్టడం జరిగింది. ‘మన శంకర వరప్రసాద్’ చిత్రం విశాఖపట్నం ఏరియాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో మీకు గుడ్ విల్ ఇస్తానని చెబితే… నేను, మురళీకృష్ణ వంటి కొందరం సిండికెట్‌గా రూ.5 కోట్ల 75 లక్షల రూపాయల అమౌంట్‌ను బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్)కు ఇచ్చాం. అంతకుముందు బాలకృష్ణ అఖండ-2 సినిమాకు కూడా మేము వైజాగ్ సతీష్‌కు డబ్బులు ఇచ్చాం. ఆ డబ్బులు కూడా మాకు తిరిగి కట్టలేదు. ఇక ‘మన శంకర వరప్రసాద్’ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను రూ.15 కోట్ల 60 లక్షల రూపాయలకు కొనుగోలు చేసి, కేవలం రూ. 3 కోట్ల 23 లక్షల రూపాయలు మాత్రమే నిర్మాతలకు చెల్లించి, మిగిలిన అమౌంట్ కట్టకుండా ఆ సినిమా విడుదలకు ముందు బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) చేతులెత్తేశాడు. కావాలంటే మీరు రిలీజ్ చేసుకోండి అని సతీష్ చూపించండి తప్పించుకున్నాడు. అప్పట్లో 11వ తేదీ సినిమా రిలీజ్ దగ్గరకు వచ్చింది.

మరో 8వ తేదీ నుంచి హాలిడేస్ ఉన్నాయి. విశాఖపట్నం ఏరియాకు ‘మన శంకర వరప్రసాద్’ సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోతుందన్న ఉద్దేశ్యంతో నేను, మురళీకృష్ణ కలసి అమౌంట్ రిస్క్ చేసి, అన్నపూర్ణ స్టూడియో వారి ద్వారా సినిమా ఆగకుండా రిలీజ్ జరిగింది. ఈ నేపథ్యంలో శిరీష్, వైజాగ్ సతీష్ మధ్య జరిగిన సంభాషణ ఆడియోను కూడా నేను బయట పెడుతున్నాను. మెగాస్టార్ చిరంజీవి సినిమాను ఆపడానికి దిల్ రాజు, శిరీష్, వైజాగ్ సతీష్ ఎలాంటి ప్రయత్నాలు చేశారో ఇంతకంటే అధరాలు ఇంకేమి కావాలి. ఇటీవల పెద్ది సినిమా విషయంలో కూడా తెలంగాణలో చెలరేగడం వెనుక కూడా దిల్ రాజు హస్తం ఉంది. అసలు మెగాస్టార్ కుటుంబీకుల సినిమాల రిలీజ్ సమయంలో ఏదోవిధంగా వివాదాలను తెరపైకి తీసుకుని వచ్చి, వారి సినిమాలను ఆపాలని ప్రయత్నించారు. తెలంగాణలోనే కాదు వైజాగ్, ఉత్తరాంధ్రలో కూడా దిల్ రాజు, శిరీష్ లు డిస్ట్రిబ్యూషన్ రంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని, శాసించాలని చూస్తున్నారు. కానీ వారి ఆటలు సాగనివ్వం. వైజాగ్ సతీష్ వారికి డబ్బు చెల్లించాల్సింది పోయి…తమ మీదే వైజాగ్ పోలీస్ స్పందన కార్యక్రమంలో కంప్లైంట్ ఇచ్చి, లోపల వేయించేస్తాను అని బెదిరింపులకు పూనుకుంటున్నాడు.

స్పందన నోటీసుకు ఆ తేదీన మేము తప్పకుండా హాజరై, వాస్తవాలను ఆధారాలతో సహా బయట పెడతాం. చట్టాలకు, న్యాయ విషయాలకు అతీతంగా స్పందన చర్యలు చేపడుతుందని సతీష్ భ్రమపడుతున్నాడు. అతనేదో మంచిగా వ్యాపారం చేసుకుంటాడన్న ఉద్దేశ్యంతో తాము డబ్బులు ఇవ్వడమే కాకుండా వేరే వాళ్ల చేత కూడా నేను అతనికి డబ్బులు ఇప్పించాను. వానపాములు, ఇంకా వేరే వ్యాపారాల పేర్లు చెప్పి, ఎంతోమంది దగ్గర డబ్బులు వసూలు చేసి, తిరిగి చెల్లించకుండా, జవాబు చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దాదాపు 28 కోట్ల రూపాయలు సతీష్ అందరికీ బాకీలు చేసి, చెల్లించాల్సి ఉంది. అతను బ్లాక్ మెయిలర్ అని తెలియక డబ్బులు ఇచ్చాడు, ఇంకా ఎందరో మోసపోకుండా అతని బండారం బయట పెట్టేందుకు, దిల్ రాజు, శిరీష్ లు మెగా ఫ్యామిలీ సినిమాలను అడ్డుకుంటున్న విషయాలను చెప్పేందుకే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టాను అని నట్టి కుమార్ స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird