Home Latest News తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్.. బాల్క సుమన్ అరెస్టుకు పోలీసుల యత్నం | తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత | బాల్క సుమన్ అరెస్ట్ | BRS పార్టీ | కేసీఆర్ | కేటీఆర్ | సీఎం రేవంత్ రెడ్డి | మంత్రి వివేక్ వెంకటస్వామి | సీఎం రేవంత్ రెడ్డి | తెలంగాణ పోలీసులు | సీపీ సజ్జనార్ | డీజీపీ సీవీ ఆనంద్ – Andhra Waves

తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్.. బాల్క సుమన్ అరెస్టుకు పోలీసుల యత్నం | తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత | బాల్క సుమన్ అరెస్ట్ | BRS పార్టీ | కేసీఆర్ | కేటీఆర్ | సీఎం రేవంత్ రెడ్డి | మంత్రి వివేక్ వెంకటస్వామి | సీఎం రేవంత్ రెడ్డి | తెలంగాణ పోలీసులు | సీపీ సజ్జనార్ | డీజీపీ సీవీ ఆనంద్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై నమోదైన కేసు నేపథ్యంలో ఆయనను విచారణకు తీసుకెళ్లేందుకు పోలీసులు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న బీఎస్ శ్రేణులు పోలీసుల చర్యలను అడ్డుకునే ప్రయత్నం చేశాయి.

టాస్క్‌ఫోర్స్, నాంపల్లి పోలీసులు తెలంగాణ భవన్‌కు చేరుకుని బాల్క సుమన్‌ను విచారణ నిమిత్తం తమ వెంట రావాలని సూచించారు. అయితే పోలీసులు భవన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “పోలీసులు గో బ్యాక్”, “ప్రభుత్వం కక్షసాధింపు ఆపాలి” అంటూ నినాదాలు చేశారు. దీంతో కొంతసేపు పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తెలంగాణ భవన పరిసరాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చుట్టూ పోలీసులు మోహరించి కార్యకర్తలను చెదరగొట్టే చర్యలు చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం. ఈ సందర్భంగా ఏసీపీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, బాల్క సుమన్‌పై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సింగరేణి సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశామని చెప్పారు. సింగరేణి సంస్థతో పాటు రైల్వేలో ధ్వంసం చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి.

“విచారణలో భాగంగా బాల్క సుమన్‌ను తీసుకెళ్లేందుకు వచ్చాం. గత మూడు రోజులుగా ఆయన ఆచూకీ స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుతం తెలంగాణాలో ఉన్న సమాచారం రావడంతో నోటీసులు అందించి విచారణకు హాజరు కావాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం” అని ఏసీపీ తెలిపారు.మరోవైపు, ఈ చర్యలను బీఆర్ఎస్ నేతలు రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తున్నారు. పార్టీ కార్యాలయానికి పోలీసులు రావడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ పరిసరాల్లో ఉద్రిక్తత కొనసాగుతుండగా, బాల్క సుమన్‌ను పోలీసులు తీసుకెళ్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird