ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్జిల్లాలో ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ప్రేమికుల రోజు నాడు తన భర్తకు ప్రియుడితో కలిసి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. దాంతో ఆ భర్త ఆమె ప్రియుడ్ని నడిరోడ్డుపై చితకబాదాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. హాపూర్‌లోని మీరట్ రోడ్డులో భార్య, తన ప్రియుడితో కలిసి బైక్‌పై తిరగడం భర్త చూశాడు. వెంటనే వారిని అక్కడే ఆపాడు. దీంతో ప్రియుడు, భర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
అక్కడున్న వారు కూడా భర్తకు మద్దతుగా నిలిచారు. ఈ కోరుకునే స్థానికులు ప్రియుడిని చితకబాదారు. పక్కనున్న వారు ఈ విషయాన్ని గమనించారు.. మొబైల్‌లో రికార్డ్ చేశారు. అది కాస్త నెత్తింట చక్కర్లు కొడుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. భర్త ఆరోపణలతో ప్రియుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న వారిద్దరూ రోడ్లపై షికార్లు కొడుతూ పట్టుబడటం, భర్త చితక్కొడటం, కేసు నమోదు కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
