Home సినిమా 854 కోట్లు వసూలు చేసిన గొర్రెల మంద డిటెక్టివ్ కామెడీ.. అసలు మిస్ అవ్వకండి – Andhra Waves

854 కోట్లు వసూలు చేసిన గొర్రెల మంద డిటెక్టివ్ కామెడీ.. అసలు మిస్ అవ్వకండి – Andhra Waves

by
0 comments
854 కోట్లు వసూలు చేసిన గొర్రెల మంద డిటెక్టివ్ కామెడీ.. అసలు మిస్ అవ్వకండి


కొన్ని చిత్రాలని చూడాలంటే పెట్టి పుట్టాలి. అలాంటి ఒక చిత్రమే ది షీప్ డిటెక్టివ్స్. హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక విచిత్రమైన, అత్యంత వినూత్నమైన క్రైమ్ కామెడీగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ థియేటర్లకి రప్పిస్తున్న ఆ సినిమా పేరే ‘ది షీప్ డిటెక్టివ్స్’. లియోనీ స్వాన్ రాసిన ‘త్రీ బ్యాగ్స్ ఫుల్’ అనే ప్రసిద్ధ నవల ఆధారంగా, ప్రముఖ దర్శకుడు కైల్ బాల్డా తెరకెక్కించిన ఈ చిత్రం హాలీవుడ్ క్లాసిక్ ‘బేబ్’, మైండ్ బ్లోయింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘నైవ్స్ అవుట్’ కలయికలా సాగుతుంది.

ప్రముఖ అమెజాన్ MGM స్టూడియోస్ సుమారు $75 మిలియన్ల భారీ బడ్జెట్‌తో, అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 620 కోట్లకు పైగా ఖర్చుతో ఈ విజువల్ వండర్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.మనుషులను బురిడీ కొట్టించే గొర్రెల మంద.. బాక్సాఫీస్ వద్ద ‘ది షీప్ డిటెక్టివ్స్’ సెన్సేషన్! మే 8న చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ కేవలం కొద్ది రోజుల్లోనే రికార్డు స్థాయిలో 90 మిలియన్ డాలర్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే 854 కోట్లుపై మాటే.

ఈ సినిమా కథాంశం చాలా విచిత్రంగా, అత్యంత సరదాగా సాగుతుంది. ఒక అందమైన పల్లెటూరి వాతావరణంలో జార్జ్ అనే ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. హాలీవుడ్ స్టార్ హీరో హ్యూ జాక్‌మన్ ఈ జార్జ్ క్యారక్టర్ ని అద్భుతంగా పోషించాడు. జార్జ్‌కి తన మందలోని గొర్రెలంటే ప్రాణం. అతను ప్రతిరోజూ రాత్రి పూట ఆ గొర్రెల పోటీ ఒకచోట కూర్చోబెట్టి, తనకు ఇష్టమైన వివిధ డిటెక్టివ్ నవలలు, ఉత్కంఠభరితమైన క్రైమ్ స్టోరీలను పెద్దగా చదివి వినిపించేవాడు. పాపం, ఆ అమాయక గొర్రెల కాపరికి అస్సలు తెలియని విషయం ఏంటంటే, తన మందలోని గొర్రెలన్నీ సాధారణమైనవి కావు, అవి అత్యంత తెలివైనవి! జార్జ్ చదివే ప్రతి క్రైమ్ కథలోని ప్రతీ ముక్క, ప్రతీ లాజిక్ ఆ గొర్రెలకు స్పష్టంగా అర్థమయ్యేది. అలా ప్రతిరోజూ రాత్రిళ్లు క్రైమ్ నవలలు వింటూ, ఆ గొర్రెల మంద అంతా మనుషుల కంటే షార్ప్ గా ఆలోచించే పెద్ద పెద్ద డిటెక్టివ్ మైండ్స్ లా తయారవుతాయి.

కథలో అసలైన మలుపు ఇక్కడే వస్తుంది. ఒకరోజు హఠాత్తుగా జార్జ్ తన సొంత పొలంలోనే అత్యంత అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపిస్తాడు. అక్కడికి వచ్చిన స్థానిక పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి, అదొక సాధారణ ప్రమాదం అని తేల్చి చెప్పి కేసును క్లోజ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ తమ యజమాని ఎవరో పక్కా ప్లాన్ ప్రకారం, అత్యంత ప్లాన్డ్‌గా మర్డర్ చేసిన తెలివైన గొర్రెలకు వెంటనే అర్థమవుతుంది. తమను ప్రాణంగా చూసుకున్న యజమాని జార్జ్ మరణానికి ఎలాగైనా న్యాయం చేయాలి, ఆ హంతకాన్ని తామే పట్టుకోవాలని ఆ గొర్రెలన్నీ కలిసి ఒక పటిష్టమైన డిటెక్టివ్ టీమ్‌గా ఏర్పడతాయి. అప్పటివరకు తాము విన్న డిటెక్టివ్ కథల నాలెడ్జ్ ఉండగా, ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్‌ను ఉపయోగించి కేసు విచారణను స్వయంగా మొదలుపెడతాయి. అప్పటివరకు పచ్చటి మైదానాలకే పరిమితమైన ఆ గొర్రెలు, క్లూస్ వెతుక్కుంటూ మొదటిసారి మనుషుల ప్రపంచంలోకి, సిటీలోకి అడుగుపెట్టిన హంగామా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.

ఇది కూడా చదవండి: పెద్ది: పెద్ది ఓటీటీ డీల్ రికార్డు అమౌంట్!

టెక్నికల్ గా ఈ సినిమా హాలీవుడ్‌లో సరికొత్త మైలురాయిగా నిలిచింది. ఇందులో గొర్రెల క్యారక్టర్ లని, వాటి హావభావాలని సృష్టించడానికి ఉపయోగించిన హై-ఎండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ , విజువల్ ఎఫెక్ట్స్ అత్యంత సహజంగా ప్రేక్షకులను కట్టిపడేశాయి. రాబోయే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో ఈ చిత్రం ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఖచ్చితంగా నామినేషన్ దక్కుతుందని సినీ విశ్లేషకులు బలంగా ఉన్నారు. ప్రముఖ అంతర్జాతీయ రివ్యూ వెబ్‌సైట్ రోటెన్ టొమాటోస్‌లో ఈ చిత్రం ఏకంగా 95% రేటింగ్ లభించింది. ఇది హ్యూ జాక్‌మన్ కెరీర్‌లోనే అత్యధిక రేటింగ్ సాధించిన సినిమాగా నిలవడం విశేషం. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ క్రైమ్ కామెడీ మిస్టరీ ఎంటర్టైనర్, తన థియేకల్ రన్ ముగిసిన తర్వాత ప్రముఖ ఓటీ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలో డిజిటల్ స్ట్రీమింగ్. థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో ఈ విజువల్ ఫీస్ట్‌ను అస్సలు మిస్ అవ్వకండి!

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird