ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ఉద్యోగాల కోతలు పెరుగుతున్న వేళ, దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ఉద్యోగులకు భారీగా ప్రోత్సాహకాలు అందిస్తూ వార్తల్లో నిలిచాయి. ఏఐ టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా పెరిగిన డిమాండ్ కారణంగా కంపెనీ చిప్ తయారీ విభాగం గత క్వార్టర్‌లో అద్భుతమైన లాభాలు నమోదు చేసింది. ముఖ్యంగా హై-పర్ఫార్మెన్స్ మెమరీ చిప్‌లకు భారీగా డిమాండ్ రావడంతో ఆ విభాగం ఆదాయం ఏకంగా 49 రెట్లు పెరిగినట్లు సమాచారం.
ఈ భారీ లాభాల నేపథ్యంలో చిప్ డివిజన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు భారీ బోనస్‌లు ప్రకటించేందుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఒక్కో ఉద్యోగికి సుమారు రూ.3.25 కోట్ల వరకు బోనస్ ఇవ్వడానికి కంపెనీ యూనియన్ ఆమోదం నమోదు. ఈ నిర్ణయంతో మొత్తం 78 వేల మందికి పైగా ఉద్యోగులు లబ్ధి పొందుతున్నట్లు తెలుస్తోంది.
ఏఐ రంగం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చేస్తున్న తరుణంలో, ఉద్యోగాల కోతల బదులు ఉద్యోగులను ప్రోత్సహిస్తూ శామ్సంగ్ తీసుకున్న ఈ నిర్ణయం టెక్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.
