హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ పరిసర ప్రాంతాల పర్యాటకుల రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ కృత్రిమ పూల వ్యాపారం చేస్తున్న ఐదుగురు మహిళా చిన్న వ్యాపారులపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ ఘటనపై కోర్టు ఓ వినూత్న రీతిలో తీర్పు… కోర్టు ఇచ్చిన తీర్పును విని నిందితులు సైతం అవాక్కయ్యారు. అంజు సింగ్ (19), సబీ దేవి (38), మనూ దేవి (43), మనీషా (20), శకుంతల (36) ఈ ఐదుగురు మహిళలు గుల్జార్ హౌజ్ నుంచి మక్కా మసీదు మరియు చార్మినార్ వైపు వెళ్లే ప్రత్యేక పాదచారుల మార్గాన్ని ఆక్రమిస్తూ వ్యాపారం చేస్తున్నారు.
కృత్రిమ పూల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు… అయితే అక్కడ భారీగా పర్యాటకులు మరియు పాదాచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో పోలీసులు మహిళలను పలుమార్లు సూచిస్తున్నారు. అయినా కూడా ఈ మహిళలు పోలీసుల మాటలను పట్టించుకోకుండా యధావిధిగా పూల వ్యాపారం కొనసాగిస్తున్నారు. దీంతో చార్మినార్ పోలీసులు మే 23న ఈ ఐదుగురు మహిళలపై CP యాక్ట్ సెక్షన్ 66-C మరియు BNS సెక్షన్ 292 కింద కేసులు నమోదయ్యాయి.
అనంతరం పోలీసులు ఈరోజు సోమవారం ఉదయం నిందితులకు గౌరవనీయమైన 1వ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, కోర్టు ప్రతి ఒక్కరికి రూ.200 జరిమానా విధించింది. అదనంగా, 5 గంటల వరకు చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో సామాజిక సేవ చేసారు. ఈ సందర్భంగా SHO మాట్లాడుతూ చార్మినార్ పర్యాటకులు మరియు పాదచారులకు ఇబ్బంది కలిగించేలా రోడ్లను ఆక్రమించి వ్యాపారం చేస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
