భారతీయ సినీ సంగీత ప్రపంచంలో సరికొత్త సంచలనానికి తెర లేచింది. తమ ట్యూన్స్ తో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లలో పూనకాలు తెప్పించే రాక్‌స్టార్స్ అనిరుధ్ రవిచందర్, థమన్ ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడం సౌత్ అభిమానుల్లో టాక్ హాఫ్ ది డే గా మారింది.
థమన్ ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి ఎక్స్ వేదికగా ‘నన్బా ఇక మొదలెడదామా’ అంటూ అనిరుద్ కి టాగ్ చేసాడు. ఇప్పుడు ఈ పోస్ట్ నిమిషాల్లో వైరల్ గా మారడంతో ఏ మూవీకి ఇద్దరు కలిసి పని చేయబోతున్నారనే చర్చలు ఇరువురి ఫ్యాన్స్ లో మొదలయ్యాయి. కానీ సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం అనిరుద్ తో థమన్ తన అప్ కమింగ్ మూవీలో ఒక పాటని మాత్రమే పాడుకుంటున్నట్టుగా టాక్. అనిరుద్ సింగర్ గాను తన సత్తా చాటుతూ వస్తున్న విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: sri Gouri Priya: లెజండ్రీస్ ముందు కన్నీళ్లు పెట్టుకున్న శ్రీ గౌరిప్రియ.. అచ్చ తెలుగు యంగ్ హీరోయిన్
మరి ఇప్పుడు థమన్ ఏ మూవీలో అనిరుద్ చేత సాంగ్ పాడించుకుంటాడో చూడాలి. థమన్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇటీవల వెంకటేష్, త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం, మెగా 158 కి థమన్ ఎంపిక అయిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంతో పాటు థమన్ మ్యూజిక్ అందజేసే టాక్ వినపడుతుంది.
