ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్స్ లో స్పిరిట్(స్పిరిట్)ఒకటి. ప్రెజెంట్ హైదరాబాద్ లో వేసిన భారీ పోలీస్ స్టేషన్ సెట్ లో కథకి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా స్పిరిట్ కి సంబంధించి ప్రభాస్(ప్రభాస్)ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ ఏకంగా 60 రోజుల నాన్-స్టాప్ షెడ్యూల్ కేటాయించినట్లు సమాచారం. దీంతో బాహుబలి తర్వాత ప్రభాస్ ఎక్కువ రోజులు డేట్స్ కేటాయించిన మూవీ స్పిరిట్ అని చెప్పవచ్చు. ఈ లాంగ్ షెడ్యూల్లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు, హీరో క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేసే సీన్లని చిత్రీకరించనున్నారు.
సందీప్ రెడ్డి వంగా(సందీప్ రెడ్డి వంగా)స్టైల్లోనే చాలా రాండ్ రాక్‌గా ఉండబోతోందని, అందుకే ఎక్కడా గ్యాప్ లేకుండా ఈ భారీ షెడ్యూల్‌ని పూర్తి చేయాలని భావిస్తోంది. స్పిరిట్ దాదాపు 8 భాషల్లో విడుదల. ఇందులో విలన్ పాత్ర కోసం కూడా ఒక భారీ బాలీవుడ్ స్టార్‌ను ఇంటర్నేషనల్ యాక్టర్‌ను రూపొందించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్న వార్తలు వస్తున్నాయి. టీజర్ లేదా గ్లింప్స్ వచ్చే ముహూర్తం కోసం ఫ్యాన్స్ అయితే ఎంతో ఆశతో ఉన్నారు.
ఇది కూడా చదవండి: leela mahal: ఏకైక సింగిల్ స్క్రీన్ లీలా మహల్ రీ ఎంట్రీ.. 75 ఏళ్ల చరిత్ర తన సొంతం
ప్రభాస్ అంకితభావం, సందీప్ రెడ్డి వంగ విజన్ తోడైతే ‘స్పిరిట్’ ఇండియన్ సినిమా దగ్గర సరికొత్త ప్రభంజనం సృష్టిస్తుందనడంలో సందేహం లేదు. 60 రోజుల ఈ మెగా షెడ్యూల్ పూర్తయితే సినిమా మేజర్ పార్ట్ కాంప్లీట్ అయినట్లే అని తెలుస్తోంది. మార్చి 5 2027 న రిలీజ్ కానున్న స్పిరిట్ లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తుండగా త్రిప్తి డిమ్రి హీరోయిన్.

