వికారాబాద్ జిల్లా తాండూరులో షాకింగ్ ఘటన. కిడ్నాప్ కేసులో అరెస్టైన ఓ నిందితుడు పోలీస్ స్టేషన్ నుంచే పోలీసుల కళ్లుగప్పి పరారైనట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్‌నగర్‌కు చెందిన అజీమ్ (ఆసిఫ్ అలియాస్ అజిమ్) తాండూరులోని ఓ సెలూన్‌లో పని చేస్తున్నాడు. అదే ప్రాంతంలో 17 ఏళ్ల మైనర్ బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు తాండూరు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో నిందితుడిని అరెస్టు చేసి తాండూరుకు తీసుకొచ్చి రిమాండ్ ప్రక్రియ కొనసాగిస్తున్న సమయంలో అనూహ్యంగా నిందితుడు పోలీస్ స్టేషన్‌లో పరారైనట్లు సమాచారం… ఐదు రోజులుగా సీక్రెట్‌గా ఉంచిన ఈ ఘటన ఇప్పుడు బయటకు రావడంతో పోలీసులు హార్ట్‌టాపిక్‌గా మారిపోయారు.
ఈ పలు ఘటన అనుమ తులకు దారితీస్తోంది. ఇప్పటికే పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ పంపినట్లు తెలుస్తోంది. అంతర్రాష్ట్ర స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఈ ఘటనలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఆరోపణలతో ఇద్దరు పోలీసు సిబ్బందిపై వేటు పడే అవకాశం ఉంది..పోలీసులు మాత్రం అధికారికంగా ఇంకా పూర్తి వివరాలను వెల్లడించలేదు. ఈ ఘటన తాండూరు పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది
