Home Latest News ట్రినిడాడ్ సింహం, హిందూ నాయకుడు.. భదాసే సగన్ మరాజ్ | ది లయన్ ఆఫ్ ట్రినిడాడ్ | హిందూనాయకుడు | భదసే | సాగన్ – Andhra Waves

ట్రినిడాడ్ సింహం, హిందూ నాయకుడు.. భదాసే సగన్ మరాజ్ | ది లయన్ ఆఫ్ ట్రినిడాడ్ | హిందూనాయకుడు | భదసే | సాగన్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


కరీబియన్ దేశం ట్రినిడాడ్‌లో 2022లో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి . ఈ ఘటనతో అక్కడ హిందూ సంఘాల ప్రజలు భయాందోళనకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితి కరేబియన్ దేశాల్లో ఎన్నో దశాబ్దాల నుంచి ఉంది. వలసవాద ట్రినిడాడ్‌లో హిందువుల అణచివేతను సమర్ధంగా ఎదుర్కొని నిలబడ్డ భదాసే సగన్ మరాజ్. అణచివేతకు ఉన్న హిందూ వలస వాదులకు ఆయన అండగా నిలవడంతో అక్కడి పెత్తందారులు అతనికి భయపడ్డారు. భదాసే పుట్టే నాటికి 1800ల మధ్యలో, బ్రిటిష్ సామ్రాజ్యం బానిసత్వాన్ని రద్దు చేసిన తర్వాత కూడా, కరేబియన్ దేశాల్లోని చక్కెర తోటల కోసం అక్కడికి వలస వచ్చిన వారికి శ్రమశక్తి అవసరం. ఆ భారతీయులను ముఖ్యంగా ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌గా పిలవబడుతున్న భోజ్రి మాట్లాడే ప్రాంతాల వారిని అక్కడికి తరలించి పనుల్లో నియమించారు. వారిని ఓడల్లోకి ఎక్కించి, వేల మైళ్ల దూరంలోకి తీసుకువెళ్లారు. తరతరాలుగా, ఆ సమాజం ప్రార్థనలు, పండుగలు, కథల మీద ఆధారపడిన, కఠినమైన పరిస్థితులలో భాష మరియు ఆచారాల శకలాలను కాపాడుకుంటూ మనుగడ సాగించింది. భదాసే పుట్టేనాటికి, ట్రినిడాలోని హిందూ సమాజం ఒక శతాబ్దపు ఒప్పంద బానిసత్వాన్ని తట్టుకుని నిలబడింది. కానీ అభివృద్ధి చెందలేదు. వారికి పాఠశాలల ప్రవేశం దాదాపుగా లేదు, అర్థవంతమైన చట్టపరమైన రక్షణలు లేవు, రాజకీయ ఉనికి అసలే లేదు.

గ్రామ విషాదం నుండి పారిశ్రామిక మేధస్సు వరకు

భదాసే 1920 ఫిబ్రవరి 29న ట్రినిడాడ్ చక్కెర పరిశ్రమకు కేంద్రమైన కరోని గ్రామంలో జన్మించారు. అతని తండ్రి, మాథ్యూ మహారాజ్, గ్రామ పెద్ద, కర్రసాములో ఆరితేరినవాడు. అతని అధికారం ఎంత స్పష్టంగా ఉండేదంటే.. స్థానిక నియమాలను సరిగ్గా రూపొందించి, అమలు చేసేవాడు కూడా అతనే. ఆ బలప్రదర్శన అతన్ని కాపాడలేకపోయింది. 1933లో, భదాసేకు కేవలం పదమూడేళ్ల వయసులో ఉన్నప్పుడు, అతని తండ్రి ఇంటి వాకిలి కింద ఉయ్యాలలో పడుకుని భగవద్గీత చదువుతుండగా, ఒక ముఠా వచ్చి అతన్ని చంపేసింది. ఆ తర్వాత కొద్దికాలానికే, వారు భదాసే మామను ఒక రాయికి కట్టి, కరోని నదిలో ముంచి హత్య చేశారు. పారిపోవాల్సి రావడంతో, ఆ బాలుడు తన అమ్మమ్మ దగ్గరికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత సంవత్సరాలలో, అతను కుస్తీ నేర్చుకుని, ఇరవై ఏళ్ల వయస్సుకే ట్రినిడాడ్‌లోనే అత్యుత్తమ కుస్తీవీరులలో ఒకడిగా ఎదిగాడు.

అతను తన తండ్రి మరణంతో కుంగి పోలేదు. వల్ల కలిగిన దుఃఖంలో మునిగిపోలేదు. ఆ చిన్ననాటి హింసే ఒక చీకటి నేపథ్యంగా మారి, హిందూ కరేబియన్ చరిత్రలోనే ఒక ఇతివృత్తంగా మారింది. 1940 ప్రారంభంలో, రెండవ ప్రపంచ యుద్ధం ప్రపంచాన్ని పునర్నిర్మిస్తున్నప్పుడు, భదాసే కరోని నది నుండి ఇసుక తవ్వడం ప్రారంభించింది, ఒక ట్రక్కు కొని, ఒక చిన్న రవాణా వ్యాపారాన్ని నిర్మించాడు. వలసరాజ్యమైన ట్రినిడాడ్‌లో వస్తువులు ఎలా రవాణా చేస్తారో, ఒప్పందాలు ఎలా కుదుర్చుకుని డబ్బు సంపాదించాలో నేర్చుకున్నాడు. యునైటెడ్ స్టేట్స్ సైన్యం వచ్చి చగురామాస్‌లో ఒక భారీ నావికా స్థావరాన్ని నిర్మించినప్పుడు, కాంట్రాక్టర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. అప్పుడే భదాసే సంస్థ ట్రినిడాడ్‌లోని అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా ఎదిగింది.

యుద్ధం ముగిసి, అమెరికన్లు తమ స్థావరాలను ఖాళీ చేసేటప్పుడు, భూదాసే అక్కడి విశాలమైన భూభాగాలను మరియు భారీ పరిమాణంలో మిగులు సరుకులను ముందు చూపుతో తక్కువ ధరకే కొనుగోలు చేసి తన వ్యాపారాన్ని విస్తరించారు, 30 ఏళ్లకే కోటీశ్వరుడయ్యాడు. 1950వ దశకానికి ముందు, ట్రినిడాడ్‌లోని హిందూ సమాజం ఒకే ఐక్య కూటమిగా లేదు. ఆ పరిస్థితి వలస రాజ్యానికి బాగా ఉపయోగపడింది. అదే సమయంలో, క్రైస్తవ మిషనరీలు ఆ ద్వీపమంతటా పాఠశాలలను స్థాపించాయి. 1952లో, భదాసే ప్రధాన హిందూ సంస్థలను ఒకే సంస్థగా విలీనం కావడానికి ఒప్పించారు. అదే సనాతన ధర్మ మహా సభ. పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించబడిన మహా సభ, ట్రినిడాడ్ హిందువులకు ఒక కేంద్రీకృత మత అధికార సంస్థగా మారింది. భూదాసే దాని మొదటి అధ్యక్షుడిగా ఎన్నికై, మరణించే వరకు ఆ పదవిలో కొనసాగారు. హిందూ సమాజానికి ఇంతకు ముందు ఎన్నడూ లేని ధైర్యం ఇచ్చి, ప్రభుత్వాన్ని కేవలం వేడుకోవడం కాకుండా, చర్చలతో సమస్యలు పరిష్కరించే స్థాయికి తీసుకెళ్లారు.

1952లో మహా సభ తన సొంత పాఠశాలలను నిర్మించి, అనుమతి పొందిన తర్వాత, భదాసే దూకుడుగా వ్యవహరించారు. 1952 – 1956 మధ్య, మహా సభ ట్రినిడాడ్ అంతటా ముప్పై ఒక్క ప్రాథమిక పాఠశాలలను నిర్మించింది. చాలా వరకు ఆయన విరాళంగా ఇచ్చిన భూమిలో నిర్మించారు. అందుబాటులో ఉన్న సామాగ్రితోనే ఆ భవనాలు త్వరగా నిర్మించారు. పట్టణ ఉన్నత వర్గాలు, వలస అధికారులు ఆ కట్టడాలను చూసి నవ్వారు. వాటిని “గోశాలలు” అని పిలిచారు. అసలు చదువుకోకపోవడం కంటే గోశాలలో చదువుకోవడం ఒక బిడ్డకు మేలు. ఆ ఒక్క వాక్యమే ఆయన మొత్తం దృక్పథాన్ని సూచిస్తుంది. ఆయన వలసవాదుల దృష్టిని ఆకట్టుకోవడానికి సంస్థలను నిర్మించలేదు. తరతరాలుగా విలువ లేకుండా బతికిన చెరకు పండించే ప్రాంతంలోని పిల్లల కోసం ఆయన వాటిని నిర్మించారు. అలాగే హిందూ వివాహాల గుర్తింపును సాధించే ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించి విజయం సాధించారు. హిందూ కుటుంబ జీవితానికి, క్రైస్తవ వివాహాలతో సమానమైన హోదా ఉండాలని ప్రభుత్వం అంగీకరించేలా ఒత్తిడి చేయబడింది.

తమ వారికి దహన సంస్కారాలు చేయాలనుకున్న అనేక హిందూ కుటుంబాలు, శశ్మాన వాటికలు లేకపోవడంతో చెత్తకుండీల వద్ద ఆ పని చేయవలసి వస్తుంది. భదాసే ఈ అవమానాన్ని కూడా సవాలుగా తీసుకుని విజయం సాధించారు. హిందూ అంత్యక్రియలను కనీస గౌరవంతో చూసేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు. శాసనసభలో హిందువులకు గొంతు లేకపోతే, వలస ప్రభుత్వం వారిని ఎప్పటికైనా అనగదొక్కుతుందని, భూదాసే 1950లోనే ట్రినిడాడ్ శాసన మండలిలో స్వతంత్ర అభ్యర్థిగా సీటు గెలుచుకున్నారు. 1953 నాటికిసొంత రాజకీయ పార్టీని స్థాపించి, హిందూ సమాజం, చెరకు కార్మికుల గొంతు మార్మోగేలా చేశారు. 1957 నాటికి, ఆఠయన డెమోక్రటిక్ లేబర్ పార్టీ అనే ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 1958 ఫెడరల్ ఎన్నికలలో, ఆ సంకీర్ణ కూటమి అధికార పార్టీని ఆరు సీట్లకు నాలుగు సీట్ల తేడాతో ఓడించడం ఆయన రాజకీయ జీవితంలో అత్యున్నత మైలురాయి.

తర్వాత ట్రినిడాడ్ స్వాతంత్ర్యం వైపు సాగుతున్న అత్యంత కీలకమైన సమయంలో భదాసే అనారోగ్యంతో మంచానికే పరిమితమవ్వడం, రాజకీయ శూన్యతను సృష్టించింది. ఆయన పార్టీ చీలిపోయింది. ఆ యూఎస్, యూకేల్లో చికిత్స పొంది కోలుకున్న భూదాసే హిందూ మహాసభకు, కార్మిక సంఘానికి నాయకత్వం వహించేందుకు తిరిగి వచ్చారు. కానీ ఇండో ట్రినిడాడియన్లు స్వతంత్ర దేశాన్ని నిర్దేశించే అవకాశం ఇప్పటికే చేజారింది.

భదాసే 21 అక్టోబర్ 1971 అక్టోబర్ 21న 51 ఏళ్ల వయస్సులో మరణించారు. ఆయన కథ జాతీయ అధికారాన్ని చేజిక్కించుకోవడం కొద్దిలో విఫలమైన నాయకుడిగా మిగిలిపోయింది. అయితే తర్వాత కాలంలో విమర్శకులు ఎగతాళి చేసిన ఆ గోశాల పాఠశాలలు, కరేబియన్‌లో అత్యంత గౌరవనీయమైన సంస్థలుగా మారాయి. ఆయన మరణానంతరం కూడా, ఆయన పోరాటం ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. చాలా సంవత్సరాలుగా, దేశ అత్యున్నత పురస్కారాన్ని ట్రినిటీ క్రాస్ అని పిలిచేవారు, ఈ పేరు క్రైస్తవ ప్రతీకలతో నిండి ఉంది. ఒక హిందూ పండితుడు మతపరమైన కారణాలతో ఆ పురస్కారాన్ని తిరస్కరించినప్పుడు.. ఆ తిరస్కరణ చర్య దేశవ్యాప్త చర్చకు దారితీసింది. దానితో ఆ పురస్కారానికి ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో అని పేరు మార్చారు. 1950లలో భదాసే చేసిన పూర్వ పోరాటాలు ఇప్పటికీ అక్కడి హిందూ సంఘాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్త హిందూ మత నాయకుడు అయిన భదాసేను అక్కడి వారు ‘బాబా’ , ‘ట్రినిడాడ్ సింహం’ అని పిలిచేవారంటే ఆయన గొప్పదనం అర్థమవుతుంది.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చితే, దయచేసి https://www.teluguone.com పోర్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. భాగస్వామ్యం చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird