Home Latest News శరీరాన్నే కాదు.. బంధాన్ని డిటాక్స్ చేసుకోవడం చాలా ముఖ్యం..! | సంబంధాన్ని ఎలా డిటాక్స్ చేయాలి | మీ ప్రేమ జీవితాన్ని డిటాక్స్ చేయడానికి మరియు ఆడకుండా ఉండటానికి చిట్కాలు | మీ సంబంధాలను నిర్విషీకరణ | మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని నిర్విషీకరణ చేయడానికి మార్గాలు | టాక్సిక్ రిలేషన్షిప్స్ నుండి డిటాక్సింగ్ దశలు – Andhra Waves

శరీరాన్నే కాదు.. బంధాన్ని డిటాక్స్ చేసుకోవడం చాలా ముఖ్యం..! | సంబంధాన్ని ఎలా డిటాక్స్ చేయాలి | మీ ప్రేమ జీవితాన్ని డిటాక్స్ చేయడానికి మరియు ఆడకుండా ఉండటానికి చిట్కాలు | మీ సంబంధాలను నిర్విషీకరణ | మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని నిర్విషీకరణ చేయడానికి మార్గాలు | టాక్సిక్ రిలేషన్షిప్స్ నుండి డిటాక్సింగ్ దశలు – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


ఎలాంటి సంబంధం అయినా.. ప్రతి సంబంధంలో ఏదో ఒక రకమైన గొడవ, సంఘర్షణ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో చాలా సాధారణం. మరీ ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో గొడవలు కూడా చాలా ఉంటాయి. కానీ భార్యాభర్తల మధ్య కేవలం గొడవలు మాత్రమే ఎక్కువ ఉండి, ఇద్దరి మధ్య సరైన అవగాహన, పరస్పర గౌరవం లేకపోతే.. ఆ బంధం చాలా పెళుసుగా మారిపోయే అవకాశం ఉంటుంది. అలకలు ఇద్దరి మద్య బంధాన్ని ఎంత బలం చేస్తాయో.. అవి ఎక్కువైతే ఇద్దరినీ గొడవ పడేస్తాయి కూడా. నేటికాలంలో చాలామంది తమ బంధం గురించి ఆలోచించి బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. అలాంటి వారికోసం ఒక మంచి మార్గం ఉంది. అదే రిలేషన్షిప్ డిటాక్స్..

శరీరాన్ని డిటాక్స్ చేసుకోవడం కోసం చాలా మంది డిటాక్స్ డ్రింకులు తాగుతూ ఉంటారు. దీనివల్ల శరీరంలో విషపదార్థాలు బయటకు వెళ్లిపోయి శరీరం శుభ్రం అవుతుంది. అదేవిధంగా.. రిలేషన్ ను డిటాక్స్ చేసుకుంటే.. బంధంలో ఉన్న అనవసర గొడవలు, ఇబ్బందులు, అపార్థాలు అన్నీ మంత్రమేసినట్టు మాయమవుతాయి. ఏం చేయాలో తెలుసుకుంటే..

భాగస్వామిని బాధపెట్టకుండా బంధాన్ని డిటాక్స్ చేసుకోవాలంటే..

భాగస్వామితో మాట్లాడాలి..

రిలేషన్ షిప్ డిటాక్స్ చేయించుకోవాలనుకుంటే, ముందుగా భాగస్వామితో మాట్లాడాలి. ఎందుకు రిలేషన్షిప్ డిటాక్స్ చేయించుకోవాలని అనుకుంటున్నారో వివరించాలి.ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని వివరించాలి. సమస్యలకు కారణమేమిటో ప్రయత్నించాలి. భాగస్వామి పైవన్నీ అర్థం చేసుకుంటే.. రిలేషన్‌షిప్ డిటాక్స్ చేయించుకోవడం సులువు అవుతుంది.

దృష్టి..

ప్రతి ఒక్కరు తమపై తాము దృష్టి పెట్టాలి. ఇది మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తమపై తాము దృష్టి పెట్టినప్పుడు, తమ బలాలు, బలహీనతలను బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఇవి భవిష్యత్తులో సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో సహాయపడతాయి.

సమయం..

నేటికాలంలో ప్రతి ఒక్కరు నిరంతరం ఏదో ఒక పనిలో ఉంటారు. ముఖ్యంగా ఎప్పుడూ’లో ఉండడం వల్ల తమకు తాము సమయం ఫోన్ చేసుకోలేకపోతారు. వారికి సమయం కేటాయించుకోనప్పుడు అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. బంధాన్ని డిటాక్స్ చేసుకోవాలంటే.. సమయం కేటాయించాలి. ఫోన్‌కు దూరంగా ఉండాలి. బంధం గురించి ఆలోచించాలి. అలాంటప్పుడు ఆలోచనలు కూడా సరిగ్గా పనిచేస్తాయి.

దూరం..

రిలేషన్షిప్ డిటాక్స్ అంటే.. బంధం నుండి విడిపోవడానికి ప్రయత్నించడం కాదు.. బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం. బంధంలో గొడవలు, అపార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు.. భాగస్వామికి కొన్నాళ్లు దూరంగా ఉండి అన్నీ ఆలోచించుకోవడం వల్ల అన్ని విషయాలు క్షుణ్ణంగా అర్థం చేసుకుంటాయి. అప్పుడు బంధాన్ని నిలబెట్టుకోవడానికి మార్గాలు కనిపిస్తాయి. బంధం ఎంత ముఖ్యమైనదో కూడా అర్థమవుతుంది.

*రూపశ్రీ.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird