హైదరాబాద్ నగరం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో హై అలర్ట్‌లోకి వెళ్లింది. భారీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ప్రజాసభకు లక్ష మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా వేయడంతో పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సభ ప్రాంగణం చుట్టూ మూడంచెల భద్రత ఏర్పాటు చేసి, నగరవ్యా ప్తంగా భారీగా పోలీసు బందోబస్తు మోహరించారు.
సుమారు 2,000 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు విధుల్లో ఉండగా, వివిధ ప్రత్యేక బలగాలు, కమాండోలు, ర్యాపిడ్ యాక్షన్ టీంలు కూడా భద్రతలో భాగమయ్యాయి. ట్రాఫిక్ నియంత్రణ కోసం 550 మంది ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా నియమించబడ్డారు. మొత్తం భద్రతా వ్యవస్ధను ముగ్గురు డీసీపీలు, అయిదుగురు అదనపు డీసీపీలు పర్యవేక్షిస్తుండగా, 21 మంది వైసీపీలు, 57 మంది ఇన్‌స్పెక్టర్లు మరియు పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. సభ ప్రాంగణం చుట్టూ వందలాది సీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.
సభకు ముందు నుంచే బాంబ్ స్క్వాడ్‌లు, స్నిఫర్ డాగ్స్‌తో విస్తృత తనిఖీలు జరిగాయి. ఆక్టోపస్, SOT వంటి ప్రత్యేక బలగాలు ప్రాంగణాన్ని పూర్తిగా స్కాన్ చేసి అనుమానాస్పద వస్తువులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాయి. సభకు వచ్చే ప్రతి వ్యక్తికి అన్ని ప్రవేశ ద్వారాల వద్ద కఠినమైన సెక్యూరిటీ స్క్రీనింగ్ ఉన్నారు. సభ సమయంలో డ్రోన్లు, యూఏవీలు, కెమెరాలు, బ్యాగులు, బ్యానర్లు తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించారు.
ముఖ్యంగా బేగంపేట, బోయిన్‌పల్లి, మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్‌ల వినియోగంపై ప్రత్యేక ఆంక్షలు అమలులో ఉన్నాయి. ప్రజాసభ కార ణంగా పోలీసులు పలు ప్రధాన నగరంలో ట్రాఫిక్ మార్పులు చేస్తు న్నట్టు తెలిపారు. సభకు హాజరయ్యే ప్రజల ప్రజా రవాణాను వినియో గించి ముందుగానే బయలు దేరాలని సూచించారు. మొత్తం మీద ప్రధాని పర్యటనను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పూర్తి భద్రతా కవచంలోకి వెళ్లింది.
