Home Latest News ఉప్పల్ స్టేడియంలో యువకుడిపై దాడి చేసిన లేడీ బౌన్సర్ | ఉప్పల్ స్టేడియంలో యువకుడిపై లేడీ బౌన్సర్ దాడి | గౌతమ్ కపర్తి | హైదరాబాద్– పంజాబ్ మ్యాచ్ | ఉప్పల్ పోలీస్ | IPL 2026 | SRH | సన్‌రైజర్స్ హైదరాబాద్ | పంజాబ్ కింగ్స్ | హైదరాబాద్ vs పంజాబ్ | ఉప్పల్ స్టేడియం | సీఎం రేవంత్ రెడ్డి | డీజీపీ సీవీ ఆనంద్ | తెలంగాణ పోలీసులు – Andhra Waves

ఉప్పల్ స్టేడియంలో యువకుడిపై దాడి చేసిన లేడీ బౌన్సర్ | ఉప్పల్ స్టేడియంలో యువకుడిపై లేడీ బౌన్సర్ దాడి | గౌతమ్ కపర్తి | హైదరాబాద్– పంజాబ్ మ్యాచ్ | ఉప్పల్ పోలీస్ | IPL 2026 | SRH | సన్‌రైజర్స్ హైదరాబాద్ | పంజాబ్ కింగ్స్ | హైదరాబాద్ vs పంజాబ్ | ఉప్పల్ స్టేడియం | సీఎం రేవంత్ రెడ్డి | డీజీపీ సీవీ ఆనంద్ | తెలంగాణ పోలీసులు – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది… ఒక యువకుడిపై దాడి చేయడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రచ్చ రచ్చ సృష్టించింది. దీంతో బాధితుడు ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన హైదరాబాద్-జరిగిన మ్యాచ్ సందర్భంగా గౌతమ్ కాపర్తి (22) అనే నేను ఎల్.ఎల్.బి చదువుతున్నాను… నిన్న క్రికెట్ చూడడానికి ఉప్పల్ స్టేడియం వెళ్ళాను.

సుమారు రాత్రి 8: 45 గంటల స్టేడియం లోపల బార్ కౌంటర్ వద్ద కూర్చొని ఉన్న సమయంలో ఓ మహిళా బౌన్సర్ తన వద్దకు వచ్చి హల్ చల్ సృష్టించింది. దీంతో నేను (గౌతమ్) మొదటగా ఆశ్చర్యపోయాను. అనంతరం మొబైల్ ఫోన్ తీసుకొని ఆమె ప్రవర్తనను వీడియో చిత్రీకరించేందుకు ప్రయత్నించాను. అది గమనించిన లేడీ బౌన్సర్ వీడియో ఎందుకు తీస్తున్నావ్ అంటూ ఆగ్రహంతో తనపై దాడి చేసి అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా తన చేతిలో ఉన్న ఫోన్‌ను బలవంతంగా లాక్కొని అక్కడి నుంచి వెళ్లిపోయిందని గౌతమ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

తన మొబైల్ ఫోన్‌లో వ్యక్తిగత సమాచారం, కార్యాలయానికి సంబంధించిన ముఖ్యమైన ఫైల్‌లు ఉన్నాయని, ఫోన్ పోగొట్టుకోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురి అవుతున్నట్లు గౌతం తెలిపాడు. ఈ ఘటనపై దొంగతనం కేసు నమోదు చేయడం పూర్తి స్థాయిలో విచారణ అనంతరం సంబంధిత మహిళ బౌన్‌పై చట్టపరమైన చర్యలు పోలీసులు కోరుతూ గౌతమ్ ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా పంపించాడు. ఈ ఘటనపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా సమాచారం.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird