Home Latest News టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా…ఎందుకంటే? | టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా| జంగా కృష్ణమూర్తి| TTD| తిరుమల| టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు| బాలాజీనగర్| సీఎం చంద్రబాబు| నారాలోకేష్ – Andhra Waves

టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా…ఎందుకంటే? | టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా| జంగా కృష్ణమూర్తి| TTD| తిరుమల| టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు| బాలాజీనగర్| సీఎం చంద్రబాబు| నారాలోకేష్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా...ఎందుకంటే? | టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా| జంగా కృష్ణమూర్తి| TTD| తిరుమల| టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు| బాలాజీనగర్| సీఎం చంద్రబాబు| నారాలోకేష్


పోస్ట్ చేయబడింది జనవరి 9, 2026 4:32PM


టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బీఆర్ నాయుడుకు పంపారు. తనపై ఓ ప్రముఖ పత్రికలో తనపై వచ్చిన తప్పుడు కథనాల వల్ల మనస్తాపంతో రిజైన్ చేస్తున్నానని లేఖలో జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. అయితే జంగాకు టీటీడీ కేటాయించిన భూమిని కేబినెట్ రద్దు చేయడమే కారణమని తెలుస్తోంది. ఈ కారణంతోనే ఆయన మనస్థాపం చెందారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ప్రస్తుతం జంగా రాజీనామా చర్చనీయాంశంగా మారింది.

అయితే గతంలో తిరుమల బాలాజీనగర్‌లో ప్లాట్ నంబర్ 2ను జంగాకు కేటాయించారు. ఇప్పటికీ ఆ స్థలం ఖాళీగా ఉండటంతో మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. జంగాకు కేటాయించిన భూమిని రద్దు చేయాలని నిర్ణయించారు. గతంలో తనకు కేటాయించి.. రద్దు చేసిన భూమిని తాను చైర్మన్‌గా ఉన్న ఓం శ్రీ నమో వెంకటేశ్వర గ్లోబల్ ట్రస్ట్‌కు మళ్లీ కేటాయించాలని టీటీడీని కోరాన జంగా కృష్ణమూర్తి ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. ఇది ఎలా తప్పు అవుతుందంటూ జంగా ప్రశ్నించారు . తాను ఈ నిర్ణయం తీసుకోకుంటే ప్రభుత్వానికి, టీటీడీ బోర్డుకు ఇబ్బంది వస్తుందనే ఈ పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. ముచ్చటగా మూడోసారి తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు తనకు అవకాశం కల్పించారని కృష్ణమూర్తి తెలిపారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird