Home Latest News టెలిగ్రామ్ ద్వారా సినిమాల కొనుగోలు.. ఐబొమ్మ రవి కేసులో విస్తుపోయే వాస్తవాలు! | నేను బొమ్మ రవి టెలిగ్రామ్ ద్వారా సినిమాలను కొన్నాను| సంచలన వాస్తవాలు – Andhra Waves

టెలిగ్రామ్ ద్వారా సినిమాల కొనుగోలు.. ఐబొమ్మ రవి కేసులో విస్తుపోయే వాస్తవాలు! | నేను బొమ్మ రవి టెలిగ్రామ్ ద్వారా సినిమాలను కొన్నాను| సంచలన వాస్తవాలు – Andhra Waves

by andhra andhrawave
0 comments
టెలిగ్రామ్ ద్వారా సినిమాల కొనుగోలు.. ఐబొమ్మ రవి కేసులో విస్తుపోయే వాస్తవాలు! | నేను బొమ్మ రవి టెలిగ్రామ్ ద్వారా సినిమాలను కొన్నాను| సంచలన వాస్తవాలు


జనవరి 2, 2026 8:38AMన పోస్ట్ చేయబడింది


ఆన్‌లైన్ సినిమా పైరసీ కేసులో అరెస్టయిన ఐ బొమ్మ రవి విచారణలో ఒక్కొక్కటిగా సంచలన వాస్తవాలు వెల్లడౌతున్నాయి. పోలీసుల విచారణలో.. రవి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధంగా మార్చుకొని అనేక సంవత్సరాల్లో వ్యవస్థీకృత నేర సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు తేలింది. ముఖ్యంగా బొమ్మ రవి టెలిగ్రామ్ యాప్‌ను వేదికగా చేసుకొని సినిమాలను అక్రమంగా కొనుగోలు చేసి.. వాటిని ఆన్‌లైన్‌లో ప్రసారం చేయడం ద్వారా కోట్లాది రూపాయలను అక్రమంగా ఆర్జించిన పోలీసులు గుర్తించారు.

ఐబొమ్మ రవిని మూడ దఫాలుగా కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు రవి టెలిగ్రామ్ యాప్ ద్వారా నేరుగా సినిమా కంటెంట్‌ను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. సాధారణ సినిమాలకు ఒక్కో సగటున 2 డాలర్లు చెల్లించినట్లు, పెద్ద హీరోల సినిమాల విషయంలో మాత్రం భారీగా 500 డాలర్లు చెల్లించినట్లు నిర్ధారించారు. చిన్న బడ్జెట్ సినిమాల కోసం 100 నుంచి 200 డాలర్ల మధ్య చెల్లింపులు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ విధంగా ముందుగానే సినిమాలను సేకరించి, విడుదలైన వెంటనే అక్రమంగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఐ బొమ్మ రవి నేర జీవితం తాజాగా ప్రారంభమైనది కాదని, 2007 నుంచే ఈ అక్రమ కార్యకలాపాలను మొదలెట్టాడనీ పోలీసులు తమ విచారణలో తేలినట్లు చెప్పారు. విద్యార్థిగా ఉన్న దశలోనే విలాసవం తమ జీవితాన్ని గడపాలనే ఆశతో చిన్నచిన్న నేరాలకు అలవాటు పడిన రవి.. ఆ తరువాత సైబర్ నేరాల వైపు అడు గులు వేసినట్లు చెబుతున్నారు.

సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించిన రవి, ఆ పరిజ్ఞా నాన్ని చట్టవిరుద్ధ కార్యకలపాలకు వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విధంగా ఐబొమ్మ ద్వారా సంపాదించిన అక్రమ ఆదాయాన్ని దాచిపెట్టేందుకు రవి అనేక మార్గాలను ఆశ్రయించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆరు కోసం పేమెంట్ గేట్‌వేల ద్వారా డబ్బుల లావాదేవీలు జరిపినట్లు తేలింది. అంతేకాకుండా.. అనేక బ్యాంకు ఖాతాలను తెరిచి, వాటి ద్వారా లావాదేవీలు నిర్వహించిన రవి, కొన్ని ఖాతాలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లు కూడా మర్చిపోయినట్లు విచారణలో చెప్పడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అంశం ద్వారా రవి ఎంత విస్తృతంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించాడో అర్థమవుతోందని పోలీసులు చెబుతున్నారు.రంగారెడ్డి జిల్లా అడ్రస్ పేరుతో రవి మూడు కంపెనీలను ఏర్పాటు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కంపెనీలు వాస్తవ వ్యాపార లావాదేవీలకు కాకుండా, అక్రమ ఆదాయాన్ని చట్టబద్ధంగా చూపించేందుకు మాత్రమే ఉపయోగించిన కంపెనీల కంపెనీలను పోలీసులు గుర్తించారు. ఈ కంపెనీల పేరుతో టాక్స్ ఎగ్గొట్టేందుకు అక్రమ మార్గాలను వెతికినట్లు, నకిలీ ఖాతాలు, తప్పుడు లెక్కలు చూపినట్లుగా పోలీసులు గుర్తించారు.

ఈ కేసులో ఐ బొమ్మ రవికి సహకరించిన వ్యక్తులు, కంటెంట్ సరఫరా చేసిన సంస్థలు, అంతర్జాతీయ లింకులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణను మరింత విస్తృతం చేస్తున్నారు. రవి కార్యకలాపాలతో సినిమా పరిశ్రమకు జరిగిన నష్టంపై కూడా అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird