Home Latest News డీలిమిటేషన్ బిల్లు: ఆమోదం కోసం కేంద్రం వ్యూహాలు.! | డీలిమిటేషన్ బిల్లు | లోక్‌సభ సీట్లు | పెరుగుదల | 25 సంవత్సరాల ఫ్రీజ్ | దక్షిణ రాష్ట్రాలు | డిమాండ్ – Andhra Waves

డీలిమిటేషన్ బిల్లు: ఆమోదం కోసం కేంద్రం వ్యూహాలు.! | డీలిమిటేషన్ బిల్లు | లోక్‌సభ సీట్లు | పెరుగుదల | 25 సంవత్సరాల ఫ్రీజ్ | దక్షిణ రాష్ట్రాలు | డిమాండ్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


డీలిమిటేషన్‌పై నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు దాదాపు తెరపడింది. దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని కేంద్రం లోక్‌సభ స్థానాల సంఖ్యను అన్ని రాష్ట్రాల్లో దామాషా ప్రకారం 50 శాతం పెంచేందుకు నిర్ణయించింది. దీనితో దేశంలో లోక్ సభ స్థానాలు 850కి చేరతాయి. వచ్చే పాతికేళ్ల వరకూ అంటే 2051 వరకు రాష్ట్రాల వారీగా సీట్ల కేటాయింపును స్థిరంగా ఉంచే ప్రతిపాదనకు కూడా కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీనివల్ల దక్షిణాది రాష్ట్ర అభ్యంతరాలు దాదాపుగా పరిష్కారం అయిపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సోమవారం (నవంబర్ 30) ప్రారంభమయ్యే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టడానికి కేంద్రం సిద్ధంగా ఉంది.

కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏ రాష్ట్రంలోనూ వాటా తగ్గుతుంది, ప్రస్తుత సీట్లను కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి. అదనంగా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది.

దీనితో పాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు కూడా ఉంటుంది. గతంలో జరిగిన పరిణామాలు అవలకిస్తే.. లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య చివరిసారిగా 1970వ దశకంలో, 1971 జనాభా లెక్కల ఆధారంగా 543 స్థానాలకు పరిమితమైంది ఆ తర్వాత జనాభా ప్రాతిపదికన సీట్లవిభజనను పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఈ ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలో 131వ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు, జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే ఉత్తరాదిలో సీట్లు భారీగా పెరిగి దక్షిణాది రాష్ట్రాలు అధికారంలో తగ్గిపోతాయని ప్రతిపక్షాలు వ్యతిరేకించడంతో ఆ బిల్లు ఆమోదం పొందలేకపోయింది.

మరోవైపు, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ లోక్‌సభలో తమ రాష్ట్రానికి ఉన్న 7.18 శాతం సీట్ల వాటాను ఏ మాత్రం తగ్గించరాదని డిమాండ్ చేశారు. 1971 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల మధ్య ఉన్న సీట్లను మరో పాతికేళ్ల పాటు యథాతథంగా కొనసాగించాలని, ఈ అంశంలో రాజీ పడే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. తాజాగా కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన సీట్ల ఏకరీతి పెంపు, పాతికేళ్ల స్తంభన ప్రతిపాదనలు దక్షిణాది ముఖ్యంగా స్టాలిన్ లేవనెత్తిన అభ్యంతరాలకు అనుగుణంగా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: డీలిమిటేషన్ ఎందుకు అవసరం: దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగేదెలా.?

ఇకపోతే.. ఈ ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి పెను సవాలేనడంలో సందేహం లేదు. రాజ్యాంగ సవరణకు ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం కాగా, లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందాలంటే.. ప్రస్తుత సంఖ్యలను బట్టి 358 మంది సభ్యులు బిల్లుకు ఆమోదం తెలిపాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితిని తీసుకుంటే ఎన్డీఏ కూటమికి 319 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంటుందని అంచనా. అయితే లెక్కల్లో శరద్ పవార్ ఎన్సీపీ (ఎస్పీ)కి చెందిన 8 మంది ఎంపీలు, డీఎంకేకు చెందిన 22 మంది ఎంపీల వైఖరి కీలకంగా మారింది. రాష్ట్రాలను ఏకరీతిగా 50 శాతం పెంచాలని ఈ రెండు పార్టీలు గతంలో డిమాండ్ చేయగా, ఇప్పుడు కేంద్రం ఆ ప్రతిపాదనకు అంగీకరించిన నేపథ్యంలో వాటి ఓటింగ్ నిర్ణయంపై ఉత్కంఠ. ఈ రెండు పార్టీల ఎంపీలు మద్దతు ఇస్తే ఎన్డీఏ మెజారిటీకి దగ్గరయ్యే అవకాశం ఉన్నా, మూడింట రెండొంతుల మంది మద్దతుకు ఇంకా దూరంగానే నిలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొందరు సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉంటే రాజ్యాంగ సవరణ అవసరమయ్యే డీలిమిటేషన్ బిల్లు ఆమోదం సులభతరం కావచ్చని పరిశీలకులు అంటున్నారు.

రానున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చర్చలు, సవరణల ప్రతిపాదనలు, వివిధ పార్టీల వైఖరులు స్పష్టమయ్యేలా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్ర వాటా పరిరక్షణ, 25 ఏళ్ల స్థిరత్వ హామీ, మహిళా ప్రాతినిధ్య సభలు పార్లమెంట్ లోపల, వెలుపల విస్తృత చర్చలు సాగుతాయనడంలో సందేహం లేదు. మొత్తంగా చూస్తే, 50 శాతం సీట్ల పెంపు మరియు 25 ఏళ్ల స్తంభన ద్వారా దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను చల్లార్చుతూనే రాజ్యాంగ సవరణకు అవసరమైన మద్దతు కూడగట్టే వ్యూహాన్ని కేంద్రం ముందుకు తీసుకెళ్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మీకు నచ్చవచ్చు: డీలిమిటేషన్‌ ముసుగులో రాజ్యాంగాన్ని మార్చే యత్నం.. కేంద్రంపై గౌరవ్‌ గొగోయ్‌ విమర్శలు

డీలిమిటేషన్‌పై కేంద్రం మాస్టర్ ప్లాన్.. 2051 వరకు రాష్ట్రాల ప్రారంభం స్థిరం.!

[Delimitation Bill,   LokSabha seats, ncrease,   25year freeze, Southstates, demand, TrluguOne]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird