
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి సంబంధించిన తాజా,క్రేజీ న్యూస్ వస్తే, సోషల్ మీడియా అభిమానుల స్పర్శ, సందర్శనతో ఎంతగా పులకరించిపోతుందో తెలిసిన విషయమే. తాజాగా ఎన్టీఆర్ చేసిన ట్వీట్ తో అదేపనిలో ఉంది.
ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం గీసిన అరుదైన ఒరిజినల్ పెయింటింగ్‌ని ఎన్టీఆర్ తన ఇంటికి తీసుకొచ్చాడు. అయితే ఇది సాధారణంగా కొనుగోలు చేసిన పెయింటింగ్ కాదు.. తన అభిరుచికి తగ్గట్టుగా ప్రత్యేకంగా వేయించుకున్న కళాఖండం కావడం విశేషం.
తెలంగాణకు చెందిన తోట వైకుంఠం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పల్లెటూరి జీవనశైలి, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, గ్రామీణ మహిళల రూపాలను తనదైన ప్రత్యేక శైలిలో కాన్వాస్‌పై అద్భుతంగా ఆవిష్కరిస్తారు. ఆయన చిత్రాలకు దేశవిదేశాల్లో మంచి గుర్తింపు ఉంది.

అలాంటి దిగ్గజ చిత్రకారుడితో ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఓ పెయింటింగ్ వేయించుకున్నాడు. తను కొత్తగా పునరుద్ధరించుకున్న ఇంటి కోసం ఈ ఒరిజినల్ కళాఖండాన్ని రూపొందించాలని. దీనితో తోట వైకుంఠం ప్రత్యేకంగా ఈ తయారు చేసి స్వయంగా ఎన్టీఆర్ నివాసానికి వెళ్లి పెయింటింగ్ అందచేసాడు.
ఇది కూడా చదవండి: Nanna Kutty Movie Review Telugu: నాన్న కుట్టి మూవీ రివ్యూ
ఈ పెయింటింగ్‌లో శ్రీరాముడు, సీతమ్మ, ఆంజనేయ స్వామి గ్రామీణ ప్రాంతాల్లో కొలువై ఉన్నట్లుగా చిత్రీకరించారు. వారిని భక్తుల సంప్రదాయ దుస్తుల్లో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తున్న దృశ్యాలు. కిందివైపు సంప్రదాయ ముగ్గు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తోట వైకుంఠం ఎప్పటిలాగానే తనదైన గ్రామీణ కళాశైలిని అద్భుతంగా ఆవిష్కరించింది.
ఈ అరుదైన క్షణాలని ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తోట వైకుంఠంతో కలిసి దిగిన ఫొటోలని,ప్రత్యేకంగా రూపొందించిన పెయింటింగ్‌ని షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దిగ్గజ చిత్రకారుడి చేతుల మీదుగా రూపొందించిన ఒరిజినల్ కళాఖండాన్ని ఇంటికి తీసుకురావడం ఎంతో సంతోషంగా, కృతజ్ఞతగా ఉండటంతో ఎన్టీఆర్ పోస్ట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
.webp)
సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం డ్రాగన్ తో ఉన్నాడు. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడమే లక్ష్యంగా ప్రశాంత్ నీల్ తో కలిసి ముస్తాబు చేస్తున్నాడు. మొత్తానికి స్టార్ హీరోగా ఎంత ఎక్కువగా కనిపిస్తున్నారు.. మన తెలుగు కళాకారులను ప్రోత్సహిస్తూ, సంప్రదాయ కళలపై తనకున్న ఆసక్తిని చాటుకుంటున్న ఎన్టీఆర్‌పై అభిమానులను వెనక్కి నెట్టి మరి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
మీకు నచ్చవచ్చు
వరుస ప్లాప్స్ అప్పుడు డైరెక్టర్ ఆవేశంగా మాట్లాడాడు: హిట్ అయితేనేనా!
పవన్ కళ్యాణ్ పై భోగి డైరెక్టర్ వ్యాఖ్యలు వైరల్!
ఎన్టీఆర్, తోట వైకుంటం, పెయింటింగ్, డ్రాగన్, టాలీవుడ్
