Table of Contents
మరికొద్ది రోజుల్లో నిశ్చితార్థపు వేడుకలో బంధుమిత్రుల రాకతో సందడిగా ఉండాల్సిన ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. మరి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి శవమై కనిపించడంతో.. ఆ ఇంట తీవ్ర విషాదం అలుముకుంది. అయితే ఇక్కడ దారుణం ఏంటంటే.. ఆ యువతి ప్రేమ వ్యవహారం నచ్చని కన్నతండ్రే, పరువు పోతుందన్న ఆగ్రహంతో మరో యువతి గొంతు నులిమి హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఉరివేసి ఆత్మహత్యగా నమ్మించడమే కాకుండా, నాలుగు గంటల్లోపే హడావిడిగా అంత్యక్రియలు కూడా పూర్తి చేశాడు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి గ్రామంలో ఈ అమానవీయ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
నిశ్చితార్థానికి 2 రోజుల ముందు ఘాతుకం
నార్నూర్ సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం, ఉమ్రి గ్రామానికి చెందిన అడే కైలాస్, సమిత్ర దంపతుల కుమార్తె కళ్యాణి (18)కి నవంబర్ 25న నూర్‌కు చెందిన ఒక యువకుడితో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఈ తేదీ నవంబర్ 23వ తేదీ ఉదయం కళ్యాణి తన తల్లిదండ్రులు, మరో బాలుడితో కలిసి పత్తి ఏరేందుకు పొలానికి వెళ్లింది. అయితే, కొద్దిసేపటికే కడుపునొప్పిగా ఉందని చెప్పి ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. సాయంత్రం పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు, కుమార్తె దిగులుగా ఉండటాన్ని గమనించారు. నిశ్చితార్థం దగ్గరపడుతుంటే ఎందుకు బాధపడుతున్నావని తండ్రి కైలాస్ గట్టిగా నిలదీయడంతో, తాను మేనత్త కుమారుడిని ప్రేమిస్తున్నట్లు కళ్యాణి ప్రదర్శించింది.
గొంతు నులిమి చంపి.. ఆత్మహత్యగా నాటకం
కూతురి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న కైలాస్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. కుటుంబ సభ్యులంతా నిద్రించిన తర్వాత మంగళవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో కళ్యాణి నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. నేరం బయటపడకుండా మృతదేహాన్ని మరో గదిలోకి తీసుకెళ్లి, చున్నీతో ఉరేసుకున్నట్లు చిత్రీకరించాడు. అనంతరం ఏమీ తెలియనట్లు తన గదిలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటించాడు. ఉదయం 5 గంటలకు నిద్రలేచిన తల్లి సమిత్ర, కుమార్తెను లేపేందుకు వెళ్లగా మంచంపై కనిపించలేదు. పక్క గదిలో చూడగా ఊరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించడంతో ఆమె పెద్దగా కేకలు వేసింది.
సంప్రదాయానికి విరుద్ధంగా అంత్యక్రియలు..
మొదట పెళ్లి ఇష్టం లేక కళ్యాణి ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భావించారు. అయితే, మరణించిన నాలుగు గంటల్లోపే ఆగమేఘాల మీద అంత్యక్రియలు పూర్తి చేయడం స్థానికుల్లో అనుమానాలకు దారితీసింది. ముఖ్యంగా లంబాడ సంప్రదాయం ప్రకారం కానీ యువతి మరణిస్తే ఖననం (పూడ్చిపెట్టడం) చేయడం ఆనవాయితీ కాగా, కళ్యాణి మృతదేహాన్ని దహనం చేయడం గ్రామంలో చర్చనీయాంశమైంది.
ఈ పరిణామాలపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తండ్రి కైలాస్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. కుటుంబ పరువు పోతుందనే ఉద్దేశంతో తాను కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు కైలాస్ నేరం అంగీకరించాడని సీఐ గురుస్వామి తెలిపారు.
The post మేనబావతో ప్రేమ.. కన్న కూతురిపై appeared first on iDreamPost.
