Home Latest News జగన్ సీఎం పదవి కోసం కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారు..సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.! | విజయసాయి రెడ్డి | వైఎస్ జగన్ | YSRCP | పరివర్తన రజనీతి పార్టీ | PRP | సోనియా గాంధీ | కాంగ్రెస్ పార్టీ – Andhra Waves

జగన్ సీఎం పదవి కోసం కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారు..సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.! | విజయసాయి రెడ్డి | వైఎస్ జగన్ | YSRCP | పరివర్తన రజనీతి పార్టీ | PRP | సోనియా గాంధీ | కాంగ్రెస్ పార్టీ – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్‌పీ) అధ్యక్షుడు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జగన్‌కు, వైసీపీకి వెన్నుపోటు పొడిచానంటూ జరుగుతున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. గత రాజకీయ పరిణామాలను గుర్తుచేస్తూ.. అసలు వెన్నుపోటు ఎవరు పొడిచారో వైసీపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

జగన్ సీఎం పదవి కోసం కాంగ్రెస్‌ను వీడారు.!

వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జగన్ ముఖ్యమంత్రి పదవిని ఆశించారని విజయసాయిరెడ్డి. అయితే అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అందుకు అంగీకరించలేదని చెప్పారు. ముఖ్యమంత్రి పదవి దక్కనే జగన్ కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వైఎస్ఆర్ రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా పనిచేశారని, అదే పార్టీ జగన్‌కు ఎంపీగా అవకాశం కల్పించిందని గుర్తుచేశారు. అలాంటి పార్టీని ముఖ్యమంత్రి పదవి కోసం వీడటం అసలైన ద్రోహమని విజయసాయిరెడ్డి.

వైసీపీలో నంబర్-2 స్థానం ఊరికే రాలేదు.!

వైసీపీలో తనకు రెండో స్థానం ఎలా వచ్చిందన్న అంశంపైనా విజయసాయిరెడ్డి స్పందించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మెరుగుపరిచేందుకు తాను ఎంతో కష్టపడ్డానని, ఎన్నో పోరాటాలు చేశానని చెప్పారు. ఆ శ్రమను గుర్తించిన తర్వాత పార్టీలో తనకు నంబర్-2 స్థానం దక్కిందని వివరించారు. ఎవరూ ఉచితంగా తనకు గుర్తింపు ఇవ్వలేదని చెప్పారు.

వైసీపీ కోసం అహర్నిశలు పనిచేసినప్పటికీ, పార్టీ నాయకత్వం తనను పలుమార్లు అవమానించిందని. తనకు కొన్ని సిద్ధాంతాలు, ఆత్మగౌరవం ఉన్నాయని, వాటిని తాకట్టు పెట్టి రాజకీయాల్లో కొనసాగలేనని అన్నారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికే వైసీపీని వీడానని, ఎవరికీ వెన్నుపోటు పొడవలేదని స్పష్టం చేశారు.

నేను సీఎం అభ్యర్థిని కాదు.. ఎన్నికల్లో పోటీ చేయను.!

తన రాజకీయ భవిష్యత్తుపై కూడా విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. పీఆర్పీ అధ్యక్షుడిగా పార్టీని నిర్మించడం, బలోపేతం చేయడం, మార్గనిర్దేశం చేయడమే తన బాధ్యత అని అన్నారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండబోనని, రాబోయే ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని స్పష్టం చేశారు.

బాలాసాహెబ్ ఠాక్రే శివసేన, కాన్షీరాం బీఎస్పీని నిర్మించిన పీఆర్‌పీని పటిష్ట చేస్తానని చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక ఏర్పాటు.

పార్టీలో పదవులు కుటుంబ నేపథ్యం ఆధారంగా కాకుండా ప్రతిభ, కష్టపడే తత్వం, ప్రజాసేవ పట్ల నిబద్ధత ఆధారంగా లభిస్తాయని పేర్కొన్నారు. ఇతర పార్టీల్లోని ప్రజాసేవ దృక్పథం కలిగిన నాయకులు, కార్యకర్తలు కూడా పీఆర్‌పీలో చేరేందుకు ఆహ్వానించారు.

1983 టీడీపీ విధానాలే మా పార్టీ సిద్ధాంతాలు.!

తమ పార్టీ విధివిధానాల గురించి వివరిస్తూ.. 1983లో తెలుగుదేశం పార్టీ అనుసరించిన ప్రజా విధానాలనే పీఆర్‌పీ కూడా కొనసాగిందని విజయసాయిరెడ్డి తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, సంక్షేమమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఉగాది తర్వాత ఏపీ అంతటా పాదయాత్ర.!

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు వచ్చే ఉగాది తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపడతానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, వివిధ సామాజిక వర్గాల ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుంటానని చెప్పారు. ప్రజల నుంచి వచ్చే సూచనలు, అభిప్రాయాల ఆధారంగానే పార్టీ విధానాలు, భవిష్యత్తు ఎన్నికల ప్రణాళిక రూపొందించబడింది.

మొత్తంగా జగన్‌పై నేరుగా విమర్శలు చేయడంతో పాటు, తన రాజకీయ నిష్క్రమణకు గల కారణాలను వివరించిన విజయసాయిరెడ్డి.. పీఆర్‌పీ భవిష్యత్తును కూడా ప్రకటించారు. ఉగాది తర్వాత చేపట్టనున్న పాదయాత్ర ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

మీకు నచ్చవచ్చు: మనిషి 1400 ఏళ్లు బతకగలడా..వృద్ధాప్యానికి ఏఐ చెక్ పెట్టనుందా.!

మీకు నచ్చవచ్చు: కాంగ్రెస్‌లో అసలే జరుగుతోంది.. మంత్రులు ఎమ్మెల్యేల సమన్వయంపై టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు.!


[ Vijayasai Reddy, YS Jagan, YSRCP, Parivarthana Rajaneethi Party, PRP, Sonia Gandhi, Congress Party, Andhra Pradesh Politics ]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird