Home Latest News రాజస్థాన్ లో కాంగ్రెస్ జోష్: స్థానిక పోరులో తిరుగులేని అధికారం.. బీజేపీ కుదేలు.! | రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికలు | కాంగ్రెస్ | బీజేపీ ఓటమి | ZP ఫలితాలు | పంచాయతీ పోకడలు – Andhra Waves

రాజస్థాన్ లో కాంగ్రెస్ జోష్: స్థానిక పోరులో తిరుగులేని అధికారం.. బీజేపీ కుదేలు.! | రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికలు | కాంగ్రెస్ | బీజేపీ ఓటమి | ZP ఫలితాలు | పంచాయతీ పోకడలు – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


రాజస్థాన్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. సాధారణంగా స్థానిక ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీకి సానుకూల ఫలితాలు. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో అదే జరిగింది. జరుగుతోంది. అయితే అందుకు భిన్నంగా రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలు సాధిస్తోంది.. పరిశీలకులను విస్మయపరుస్తోంది. జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.

ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న ట్రెండ్ పంచాయతీ సమితి వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 3,351 వార్డుల్లో అధికార నిలవగా, బీజేపీ 1,995 వార్డులతో సరిపెట్టుకుంది. ఆర్ఎల్పీ 459 వార్డుల్లో అధిక్యత ఉంది. జిల్లా పరిషత్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు జడ్పీ వార్డుల్లో కాంగ్రెస్ 222 చోట్ల అధికారంలో ఉండగా, బీజేపీ 127వార్డుల్లో మాత్రమే అధికారం కనబరిచింది. నిస్సందేహంగా ఈ ఫలితాలు అధికార బీజేపీకి షాక్ అనే చెప్పాలి.

రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు పూర్తవుతున్న తరుణంలో ఈ ఫలితాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉన్న పార్టీకి స్థానిక ఎన్నికల్లో సానుకూలత ఉంటుందనే భావనకు విరుద్ధంగా ఫలితాలు ఉన్నాయి. ఈ ఫలితాలతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటోంది.

కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు కీలకమైన ఉత్తరాది రాష్ట్రమైన రాజస్థాన్‌లోనూ పుంజుకోవడం.. పార్టీ హైకమాండ్‌లోనూ, శ్రేణుల్లోనూ కొత్త జోష్ నింపుతుందనడంలో సందేహం లేదు. స్థానిక సంస్థల స్థాయిలో ఓటర్ల నాడి కాంగ్రెస్ వేగంగా పుంజుకుంటోందని నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇది కూడా చదవండి: రాజస్థాన్ కాంగ్రెస్ ఇక గాడిన పడినట్లేనా?

ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్‌బలంగా పుంజుకున్నందుకు సంకేతంగా చెబుతున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని తార్కాణంగా చెబుతున్నారు.

పూర్తిస్థాయి ఫలితాలు వెలువడిన తర్వాత జిల్లా పరిషత్‌లు, పంచాయతీ సమితుల పాలకమండళ్లపై స్పష్టత రానుంది. కాగా ఈ అధికారంతో కాంగ్రెస్ తదుపరి వ్యూహాలపై దృష్టి సారించింది. ఈ ఫలితాలు రాజస్థాన్ లో బీజేపీ ప్రతిష్ఠ మసకబారిందని తేటతెల్లం చేస్తున్నామని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.

మీకు నచ్చవచ్చు: జడ్పీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభంజనం: 26 జిల్లా పరిషత్ కు కైవసం.!

ఒకే కుటుంబం: ముగ్గురు ప్రజా ప్రతినిథులు.. ఎమ్మెల్యే, జడ్పీటీసీ, ఎంపీపీ.!

[Rajasthan local body elections, Congress,   BJP Defeat,   ZP results, Panchayat trends, TeluguOne]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird