
2020 నుండి 2070 వరకు 201 దేశాలు, భూభాగాల జనాభా మార్పులకు సంబంధించి ప్యూ రీసెర్చ్ సెంటర్ కొత్త జనాభా అంచనాలను విడుదల చేసింది. కొత్తగా వెలువడే ఇలాంటి గణాంకాలు కేవలం సంఖ్యలుగానే కాకుండా ప్రజా చర్చల్లో, సామాజిక మాధ్యమాలలో, రాజకీయ వాదనల్లో వివిధ కోణాల్లో ప్రస్తావనకు వస్తాయి. అయితే ఇవి ఖచ్చితమైన భవిష్యత్ నిర్ధారణలు కావనీ, నిర్దిష్ట అంచనాలు, పోకడల ఆధారంగా రూపొందించిన ప్రస్తుత జనాభా లెక్కల నమూనాలు మాత్రమేనని అర్థం చేసుకోవాలి. నివేదికలోని ప్రకారం, 2020, 2070 మధ్య కాలంలో అంటే అర్ధ శతాబ్దంలో.. ప్రపంచ జనాభా మొత్తం 29 శాతం మేర పెరుగుతుందని ప్యూ రిసెచ్ అంచనా. ఇదే కాలంలో ప్రపంచ ముస్లిం జనాభా సుమారు 2.02 బిలియన్ల నుంచి 3.6 బిలియన్లకు మించి, దాదాపు 80 శాతం పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో క్రైస్తవ జనాభా 30 శాతం, హిందూ జనాభా 17 శాతం పెరుగుతుందని ఆ రీసెర్చ్ అంచనా. ప్రపంచ జనాభాలో వాటాలను పరిగణనలోకి తీసుకుంటే, ముస్లింల వాటా 26 శాతం నుంచి 36 శాతం , క్రైస్తవుల వాటా 29 శాతంగా , హిందువుల వాటా 15 శాతం నుంచి 14 శాతం మారుతుందని అంచనా.
2035 ప్రపంచంలోనే అతిపెద్ద మత సమూహంగా ముస్లింలు క్రైస్తవులను అధిగమిస్తారని ప్యూ అంచనా వేసింది. 2070 నాటికి అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశాల్లో పాకిస్తాన్ సుమారు 46.1 కోట్లతో తొలి స్థానంలో, భారత్ 33.4 కోట్లతో రెండో స్థానంలో ఉంటాయని పేర్కొన్నారు. భారతదేశానికి సంబంధించిన అంచనాల్లో సంపూర్ణ సంఖ్య పెరుగుదల, శాతం వాటా అనే రెండు అంశాలు కలిసి కనిపిస్తాయి. 2020 నుంచి 2070 మధ్య భారత్‌లో మిలియన్ల హిందువుల సంఖ్య సుమారు 176 మేర అంచనా వేసినప్పటికీ, 2070 నాటికి దేశ మొత్తం జనాభాలో హిందువుల వాటా 76 శాతంగా, ముస్లింల వాటా సుమారు 20 శాతంగా ఉంటుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా హిందూ జనాభా సుమారు 199 మిలియన్లు పెరిగి దాదాపు 1.4 బిలియన్లకు చేరుకుంటుందని, 2020లో సుమారు 110 కోట్లు ఉన్న భారత్‌లోని హిందూ జనాభాలో దాదాపు 95 శాతం మంది ఉన్నట్లు వివరించారు. అలాగే 2070 నాటికి పాకిస్తాన్లో హిందూ జనాభా సుమారు 5 మిలియన్ల 10 మిలియన్లు, అమెరికాలో సుమారు 4 మిలియన్ల నుండి 9 మిలియన్లు, ఆస్ట్రేలియాలో సుమారు 3 మిలియన్లకు చేరే అంచనా నుంచి అంచనా వేసింది. ఈ మార్పుల వెనుక ఉన్న ప్రధాన అంశాలు సంతానోత్పత్తి రేటు, వయస్సు అని నివేదించింది.
2020–2025 కాలానికి ప్రపంచ సంతానోత్పత్తి రేట్లు ముస్లిం మహిళల్లో సగటున 3.1 పిల్లలు, క్రైస్తవ మహిళల్లో 2.5, ఇతర సమూహాలలో 1.6గా అంచనా వేసింది. భారత్‌లోనూ ముస్లిం మహిళల్లో సంతానోత్పత్తి ఎక్కువగా ఉంది, ముస్లిం జనాభాలో యువత, సంతానోత్పత్తి వయస్సులో ఉన్నవారి నిష్పత్తి ఎక్కువగా ఉండటం వృద్ధికి దోహదపడుతుందని సూచిస్తుంది. అదే సమయంలో మత మార్పిడుల ప్రభావం చాలా పరిమితమని, దాదాపు 99 శాతం హిందువులు, ముస్లింలు తమ మత గుర్తింపును కొనసాగిస్తారని నివేదించింది.

గణాంకాల ప్రకారం 1951 జనాభా లెక్కల ప్రకారం భారత్ హిందువులు సుమారు 84 శాతం, ముస్లింలు సుమారు 9.8 శాతం ఉండగా, 201 నాటికి హిందువులు సుమారు 79.8 శాతం, ముస్లింలు సుమారు 14.2 శాతంగా నమోదయ్యారు. సుదీర్ఘ కాలానికి సంబంధించిన గత అధ్యయనాలు 2050 వరకు మాత్రమే పరిమితం కాగా, ఈ కొత్త నివేదిక పరిధిని 2070 వరకు పొడిగించింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం భారత్ మొత్తం సంతానోత్పత్తి రేటు సుమారు 2.0కి చేరగా, ముస్లిం సంతానోత్పత్తి సుమారు 2.36 వద్ద, హిందూ సంతానోత్పత్తి సుమారు 1.94 వద్ద ఉంటూ వర్గాల మధ్య అంతరం తగ్గుతున్నట్లు కనిపించింది.
ఇది కూడా చదవండి: 2023 నాటికి చైనాను మించనున్న భారత్ జనాభా.. యు.ఎన్
ప్రజా చర్చల్లో, రాజకీయ వాదనల్లో ఈ సందర్భాన్ని ఒక్కో కోణంలో ఉదహరిస్తున్న సందర్భాలు. సంపూర్ణ సంఖ్య పెరుగుదలను ఒక రకంగా, శాతం వాటాలో మార్పును మరో రకంగా చూపిస్తూ వాదనలు వినిపిస్తున్నాయి. విద్య, పట్టణీకరణ, ఆదాయ స్థాయిలు పెరుగుతున్న కొద్దీ సంతానోత్పత్తి రేట్లలో అంతరం తగ్గుతోందని, ప్రస్తుత పోకడలు మారితే భవిష్యత్ అంచనాల్లో మార్పులు వస్తాయని నివేదిక తెలియజేస్తోంది. ఈ నివేదిక బౌద్ధుల సంఖ్య, వాటా తగ్గుదల, చైనా, జపాన్, దక్షిణ కొరియా జనాభా క్షీణత, కాంగో, అమెరికా జనాభా మార్పులు వంటి అంతర్జాతీయ పరిణామాలను కూడా ప్రస్తావించింది. ప్రభుత్వ విధానాలు, ప్రణాళికల రూపకల్పనలో జనాభా మార్పులకు ప్రాధాన్యత ఉంటుంది. పెరుగుతున్న జనాభాతో పాటు వృద్ధాప్య జనాభా కూడా పెరుగుతున్న నేపథ్యంలో విద్య, ఆరోగ్యం, వృద్ధుల సంరక్షణ రంగాలకు అవసరమైన వనరుల కేటాయింపుపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

లోక్‌సభ నియోజకవర్గాల సీట్ల కేటాయింపు వంటి సమాఖ్య అంశాలు చర్చకు వచ్చినప్పుడు, జనాభా నియంత్రణలో మెరుగైన పనితీరు కనబరిచిన రాష్ట్రాల ఆందోళనలు, సామాజిక సున్నితత్వాలు వంటి వాటికి సంబంధించిన దృక్పథం అవసరం. భవిష్యత్తులో జనాభా లెక్కలు, కొత్త సర్వేలు వెలువడినప్పుడు ఈ అంచనాలను వాస్తవ అవకాశంతో సరిపోల్చి చూస్తే ఉంటుంది. పేర్కొన్నను కేవలం ఒకే కోణానికి పరిమితం చేయకుండా, పూర్తి డేటా, కాలావధి, షరతులతో కూడిన అంచనాల స్వభావాన్ని అర్థం చేసుకుని చర్చించడం అవసరం. జనాభా డేటాను బాధ్యతాయుతంగా, వాస్తవాల ఆధారంగా అంచనా నివేదిక విశ్లేషణలో ప్రముఖంగా కనిపిస్తుంది.
మీకు నచ్చవచ్చు: క్రైస్తవాన్ని అధిగమించనుందన్న ఇస్లాం: ప్యూ రిసెర్చ్ అంచనా వెల్లడి.!
తగ్గిపోతున్న జనాభా… చైనాపై తీవ్ర ప్రభావం
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చింది, దయచేసి మా https://TeluguOne.com పోర్టల్‌ను అనుసరించండి, మీతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
[Pew Research, Population Projections Hindu Muslim Population, Changes, Fertility Rate, TeluguOne]
