ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో క్వాడ్ (QUAD) దేశాల నేతల సమావేశానికి ముందు ఆసక్తికర ఘటన జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన దేశ జెండాపై చూపిన గౌరవం అందరి దృష్టిని ఆకర్షించింది. సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్న లాజిస్టిక్స్ బృందం భారత జాతీయ జెండాను కాళ్ల కింద మోడీ నిలబడే చోట ఉంచగా ఈ ప్రదర్శనను గమనించిన ప్రధాని మోదీ స్వయంగా ముందుకు వచ్చి జెండాను చేతిలోకి తీసుకున్నారు. సాధారణంగా అంతర్జాతీయ ఇలాంటి సమావేశాల్లో జెండాల […]
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో క్వాడ్ (QUAD) దేశాల నేతల సమావేశానికి ముందు ఆసక్తికర ఘటన జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన దేశ జెండాపై చూపిన గౌరవం అందరి దృష్టిని ఆకర్షించింది. సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్న లాజిస్టిక్స్ బృందం భారత జాతీయ జెండాను కాళ్ల కింద మోడీ నిలబడే చోట ఉంచగా ఈ ప్రదర్శనను గమనించిన ప్రధాని మోదీ స్వయంగా ముందుకు వచ్చి జెండాను చేతిలోకి తీసుకున్నారు.
సాధారణంగా అంతర్జాతీయ ఇలాంటి సమావేశాల్లో జెండాల ఏర్పాటు ఇతర ఏర్పాట్లను సిబ్బంది పర్యవేక్షిస్తుంటారు. అయితే ఇక్కడ నిలబడాలని కాళ్ల కిందవేసిన భారత జాతీయ జెండాను చూసిన మోదీ.. సిబ్బంది కోసం ఎదురుచూడకుండా స్వయంగా దానిని తీసుకెళ్లారు. అనంతరం జెండాను జాగ్రత్తగా తీసుకొని తన జేబులో పెట్టుకున్నారు.. ఈ ఘటనకు సంబంధించిన అంశాలు ప్రస్తుతం ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
జాతీయ జెండా పట్ల ప్రధాని మోదీ చూపిన గౌరవాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. దేశ ప్రతిష్ఠ, జాతీయ చిహ్నాల గౌరవం విషయంలో ఆయన వ్యవహరించిన తీరు అందరినీ ఫిదా చేసింది. చిన్న సంఘటన కూడా.. జాతీయ జెండాపై గౌరవాన్ని చాటిచెప్పేలా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
క్వాడ్‌లో భారత్, అమెరికా, జపాన్ కూటమి ఆస్ట్రేలియా దేశాలు సభ్యులుగా ఉన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, ఆర్థిక సహకారం, సముద్ర మార్గాల రక్షణ వంటి కీలకమైన ఈ దేశాలు పరస్పర చర్చలు జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మనీల ఈ ఘటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మనీలాలో క్వాడ్ లీడర్ల సమావేశానికి ముందు లాజిస్టిక్స్ టీమ్ ద్వారా పొజిషన్ హోల్డర్‌గా ఉంచబడిన భారత జెండాను ఎత్తుకున్న ప్రధాని మోదీ https://t.co/n5foD2q41g
— సిధాంత్ సిబల్ (@sidhant) నవంబర్ 17, 2026
