Home సినిమా భారీగా తగ్గిన చికెన్ ధర – iDreamPost – Andhra Waves

భారీగా తగ్గిన చికెన్ ధర – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
భారీగా తగ్గిన చికెన్ ధర - iDreamPost


రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తిక మాస శోభ మొదలైంది. శివాలయాలు, విష్ణువు ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇక కార్తీక మాసంలో చాలా మంది మాంసాహారం తినరు. ఫలితంగా చికెన్ ధరలు భారీగా తగ్గాయి. దసరా పండగ ముందు వరకు చుక్కలను తాకిన చికెన్ రేట్లు ఇప్పుడు కార్తీక మాసం ప్రభావంతో నేల మీదకు దిగి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలోని ప్రధానాలు, పట్టణాల్లో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. గత ఆదివారం నుంచి ఈ వారాంతంలో ధరలు దిగిరావడంతో మాంసాహార ప్రియులకు భారీ ఊరట లభించింది. ముఖ్యంగా ఆదివారం పూట చికెన్ కొనుగోళ్లు ఎక్కువగా ఉండే సమయంలో ధరలు తగ్గడం వినియోగానికి కలిసొచ్చింది.

ప్రధాన నగరాల్లో తాజా చికెన్ ధరలు (కిలో స్కిన్‌లెస్)

  • హైదరాబాద్: రూ. 260 నుంచి రూ. 270
  • వరంగల్: రూ. 250 నుంచి రూ. 260
  • కామారెడ్డి: రూ. 260
  • నిజామాబాద్: ప్రాంతాన్ని బట్టి రూ. 200 నుంచి రూ. 260 వరకు విక్రయిస్తున్నారు.

కార్తీకమాసం ప్రభావం..

పవిత్ర కార్తీకమాసం కావడంతో చాలామంది భక్తులు ఉపవాస దీక్షలు, ప్రత్యేక వ్రతాలు ఆచరిస్తూ మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జోరుగా సాగుతుండటంతో మార్కెట్‌లో చికెన్‌ వినియోగం తగ్గింది. కార్తీకమాసం ముగిసే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పౌల్ట్రీ వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు, ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, అమ్మకాలు పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కోళ్ల పెంపకం, దాణా, రవాణా ఖర్చులు ఏమాత్రం తగ్గకుండా యథాతథంగా, విక్రయ ధరలు తగ్గడం తమపై భారం మోపుతోందని వారు ఆర్థికంగా అంచనా వేస్తున్నారు.

మటన్, చేపల ధరలు యథాతథం

చికెన్ ధరలు తగ్గుదల ఇతర మాంసాహార ఉత్పత్తుల ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు కనిపించడం లేదు. మార్కెట్‌లో మటన్, చేపల ధరలు పాత రేట్ల వద్దే స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో కేవలం చికెన్ కొనుగోలుదారులకు మాత్రమే ధరల తగ్గుదల ప్రయోజనం కలుగుతోంది. మార్కెట్ డిమాండ్‌ను బట్టి రానున్న చికెన్ ధరల్లో మరింత మార్పు ఉండే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird