Home Latest News డెమొక్రాట్ల వైపే ఇండియన్ అమెరికన్ ఓటర్లు: ఐఏఎస్ సర్వేలో వెల్లడి.! | భారతీయ అమెరికన్ ఓటర్లు | అమెరికా ఎన్నికలు | కార్నెగీసర్వే | డెమోక్రటిక్ పార్టీ | ఇండియన్డియాస్పోరా – Andhra Waves

డెమొక్రాట్ల వైపే ఇండియన్ అమెరికన్ ఓటర్లు: ఐఏఎస్ సర్వేలో వెల్లడి.! | భారతీయ అమెరికన్ ఓటర్లు | అమెరికా ఎన్నికలు | కార్నెగీసర్వే | డెమోక్రటిక్ పార్టీ | ఇండియన్డియాస్పోరా – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


అమెరికాలో ఇటీవల ముగిసిన మధ్యంతర ఎన్నికల వేళ ప్రవాస భారతీయ ఓటర్ల రాజకీయ ధోరణులకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ సంస్థ కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్, యూగావ్‌తో కలిసి నిర్వహించిన తాజా ఇండియన్ అమెరికన్ అటిట్యూడ్స్ సర్వే (ఐఏఎస్) ప్రకారం, అమెరికా పౌరసత్వం ఇండియన్ అమెరికన్లలో రమారమి 62 శాతం మంది డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థులకే తమ ఓటు వేయాలని డిసైడైనట్లు స్పష్టమైంది. గతంతో రిపబ్లికన్ పార్టీ వైపు మద్దతు తగ్గడం, అదే సమయంలో డెమొక్రాట్ల వైపు మళ్లడం ఈ సర్వే స్పష్టంగా కనిపించినప్పటికీ, ఇది శాశ్వత పార్టీ మార్పు కాదని పరిశీలకులువిశ్లేషిస్తున్నారు. ఈ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం, కాంగ్రెషనల్ నియోజకవర్గాల్లో డెమొక్రాటిక్ అభ్యర్థులకు 62 శాతం మద్దతు లభించగా, రిపబ్లికన్ అభ్యర్థులకు 19 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు.

సెనెట్ ఎన్నికలు జరిగిన ప్రాంతాలలో కూడా డెమొక్రాట్ల వైపు 63 శాతం, రిపబ్లికన్ల వైపు 21 శాతం ఓటర్లు మొగ్గు చూపారు. అయితే.. ఓటర్ల పార్టీ అంతర్గత గుర్తింపులో మాత్రం పెద్దగా మార్పులేదని ఈ సర్వేద్వారా తేలింది. తమను తాము డెమొక్రాట్లుగా ప్రకటించుకున్న వారు 46 శాతం ఉండగా, రిపబ్లికన్లు 19 శాతం, స్వతంత్రులు 26 శాతం మంది ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేకించి, డెమొక్రాట్లకు ఓటు వేస్తామన్న వారిలో మూడో వంతు మంది కేవలం ప్రత్యర్థి పార్టీపై వ్యతిరేకతతోనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది. ఈ రాజకీయ పరిణామాలు వెనుక చారిత్రక నేపథ్యం, ​​వలసదారుల ప్రయాణం ఎంతో కీలకమైనది.

గత కొన్ని దశాబ్దాలుగా అమెరికాలో భారతీయ అమెరికన్ల జనాభా వేగంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఐదు మిలియన్లకు పైగా ఉన్న ఈ కమ్యూనిటీలో, ఓటు హక్కు కలిగిన పౌరుల సంఖ్య పెరిగింది. ఆరంభం నుంచి ఈ సమాజం సాధారణంగా డెమొక్రాటిక్ పార్టీ వైపు ఎక్కువగా ఆకర్షితులైనప్పటికీ, కాలక్రమేణా యువత, వ్యాపార వర్గాల నుంచి రిపబ్లికన్ పార్టీకి కూడా కొంత మద్దతు లభిస్తుంది. అయితే, హెచ్ 1బి వీసా నిబంధనలను కఠినతరం చేయడం, ఇమ్మిగ్రేషన్ విధానాలు, వివిధ సామాజిక అంశాల నేపథ్యంలో ప్రవాస భారతీయుల ఆలోచనా విధానంలో మళ్లీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయమేమిటంటే, వయస్సు , వర్గాల వారిగా ఓటర్ల ధోరణులలో స్పష్టమైన వ్యత్యాసాలు కనిపించాయి. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన పురుషులలో గతంతో పోలిస్తే రిపబ్లికన్ల మద్దతు తగ్గిపోగా, డెమొక్రాట్ల వైపు మొగ్గు భారీగా పెరిగింది. మరోవైపు, సామాజిక వైరుధ్యాలను పరిశీలిస్తే, ఓటర్ల స్థాయిలో డెమొక్రాట్లకు మద్దతు పెరుగుతున్నప్పటికీ.. ప్రముఖ ఇండియన్ అమెరికన్ డోనర్లు, వ్యాపారవేత్తలు మాత్రం రిపబ్లికన్ అనుబంధ కమిటీలకే భారీగా విరాళాలు అందజేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేస్తోంది. ఆదాయ వనరులు, వ్యాపార ప్రయోజనాలను బట్టి ఈ వర్గంలో ఆర్థికపరమైన ఆలోచనలు భిన్నంగా ఉంటాయి.

ఇది కూడా చదవండి: అమెరికా మధ్యంతర ఎన్నికలు: డెమొక్రట్ల హవా.. ట్రంప్ పాలనపై ప్రజాగ్రహం.!

గతంలో అధ్యక్ష ఎన్నికల సమయంలో రిపబ్లికన్ అభ్యర్థుల పట్ల కొంత సానుకూలత చూపిన ప్రవాస భారతీయులు, మధ్యంతర ఎన్నికలు వచ్చేసరికి డెమొక్రాటిక్ అభ్యర్థుల వైపు మొగ్గు చూపడం దేశ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా వ్యాప్తంగా కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఈ ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉంటారు, జాతీయ స్థాయిలో వీరి జనాభా శాతం తక్కువగా ఉంది.

అయినప్పటికీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడంలో ప్రవాస భారతీయుల పాత్ర ఎప్పుడూ కీలకమైనదేనని పలు నివేదికలు అవసరం. భవిష్యత్తులో ఈ ఓటింగ్ సరళి ఎంత నిలకడగా ఉంటుందనేది ప్రశ్నార్థకమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మద్దతు పార్టీపై ఉన్న అచంచలమైన విశ్వాసం కంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పట్ల వ్యక్తమైన ప్రతిస్పందనే ఎక్కువగా ఉందని సర్వే విశ్లేషిస్తోంది. రాబోయే రోజుల్లో అమెరికా అనుసరించే ఆర్థిక విధానాలు, వలసల చట్టాలు మరియు ద్వైపాక్షిక సంబంధాలు ప్రవాస భారతీయ ఓటర్ల రాజకీయ భవిష్యత్తును మరింత స్పష్టంగా నిర్దేశించే అవకాశం ఉంది.

మీకు నచ్చవచ్చు: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ట్రంప్: వలసదారులపై కఠిన వైఖరి తప్పని ఒప్పుకోలు.!

వలసదారుల విషయంలో తప్పు చేశాము..ఓటమిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.!

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చింది, దయచేసి మా https://TeluguOne.com పోర్టల్‌ను అనుసరించండి, మీతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.

[IndianAmericanVoters, Americaidtermelections, Carnegiesurvey,  Democratic Party, Indian diaspora, TeluguOne]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird