Home Latest News బ్యాలెట్ లోనూ కాంగ్రెస్ జీరోయే: గ్రాండ్ ఓల్డ్ పార్టీ రాజకీయ దైన్యానికి దర్పణం.! | ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్కోరు సున్నా | నాలుగు రాష్ట్రాలు | బీజేపీ గెలుపు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు | బ్యాలెట్ పేపర్ ఎన్నికలు – Andhra Waves

బ్యాలెట్ లోనూ కాంగ్రెస్ జీరోయే: గ్రాండ్ ఓల్డ్ పార్టీ రాజకీయ దైన్యానికి దర్పణం.! | ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్కోరు సున్నా | నాలుగు రాష్ట్రాలు | బీజేపీ గెలుపు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు | బ్యాలెట్ పేపర్ ఎన్నికలు – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


దేశంలో కాంగ్రెస్ పరిస్థితి అగాధం నుంచి పాతాళంలోకి జారిపోతున్నట్లుగా తయారైంది. తాజాగా కీలక రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆ పార్టీ స్కోరు జీరో కావడమే ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నాలుగు రాష్ట్రాల పరిధిలో 28 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు రాజకీయంగా కాంగ్రెస్ దయనీయ స్థితికి అద్దం పట్టాయి. అధికారంలో ఉన్న కర్ణాటక ఉత్తరప్రదేశ్, బీహార్ మహారాష్ట్రలో జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పోరులో కాంగ్రెస్ చతికిల పడి.. బీజేపీ, మిత్రపక్షాలు విజయదుందుభి మోగించి తమ రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి.

కాంగ్రెస్ గత పదిహేనేళ్లుగా తన ఓటమికి ఈవీఎంలను సాకుగా చూపుతోంది. కానీ తాజాగా నాలుగు రాష్ట్రాల్లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు (ఈవీఎం) ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ పద్ధతిలో జరిగాయి. అయినా కాంగ్రెస్ జీరో రిజల్ట్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ సోషల్ మీడియా వేదికగా బ్యాలెట్ పేపర్లతో నిర్వహించిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుందో చెప్పాలంటూ ఎద్దేవా చేశారు. ఈ ఫలితాలు దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ తిరోగమనం ఎంత వేగంగా జరుగుతోందని చెప్పకనే చెప్పారు.

ఈ ఎన్నికల విషయంలో ప్రధానంగా చెప్పుకోవలసింది విషయమేంటంటే ఇవన్నీ కూడా గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ నియోజకవర్గాల పరిధిలోనే జరగడం మరో విశేషం. ఈ స్థానాల్లో ఓటర్లంతావంతులు, మేధావంతులు, సమాజంలో చైతన్యవంతమైన వర్గానికి చెందిన విద్యావంతులు. అలాంటి గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ కు శూన్య హస్తమే దక్కింది. అంటే ఆ వర్గం కూడా కాంగ్రెస్ కు దూరమయ్యాయని అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి స్వయంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో సైతం కాంగ్రెస్ విజయాన్ని నమోదు చేసుకోలేకపోయింది ఆ పార్టీ రాజకీయ దయనీయతకు అద్దంపడుతోంది.

కర్ణాటకలో మొత్తం 4 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా, వాటిలో 3 స్థానాలను బీజేపీ, 1 జేడీఎస్ గెలుచుకున్నాయి. ఇక యూపీలో 11 స్థానాలకు జరిగిన ఎన్నికలలో బీజేపీ 5, సమాజవాదీ పార్టీ 3, ఇతరులు 3 స్థానాలను గెలుచుకున్నారు. బీహార్‌లో 8 స్థానాల్లో బీజేపీ 2, జేడీయూ 1, ఆర్జేడీ 1, ప్రశాంత్ కిషోర్ స్థానంలో జన సురాజ్ పార్టీ 1, ఇండిపెండెంట్లు 2 స్థానాలను దక్కించుకున్నారు. మహారాష్ట్రలో జరిగిన 5 స్థానాలకు బీజేపీ 2, శరద్ పవార్ బ్లాక్‌ని ఎన్‌సీపీ 2, శివసేన (షిండే వర్గం) 1 గెలుచుకున్నాయి. ఈ ఓటములు కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విద్యావంతులు మరియు పట్టభద్రుల వర్గాలలో కాంగ్రెస్ కోల్పోతున్న ఈ ఫలితాలు నిదర్శనంగా చూపిస్తున్నాయి.

[Congress Score Zero In MLC Elections,  Four States, BJP Victory Graduate MLC Constituencies, Ballot Paper Elections, Telugu One]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird