ఈ మధ్య కాలంలో మొబైల్ ఫోన్ ప్రతీ ఒక్కరి జీవితంలో ఓ భాగం అయిపోయింది. ఫోన్ లేకపోతే ఒక గంట కూడా గడపలేని స్థితికి మనుషులు వచ్చేశారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ రైళ్లలో ఛార్జింగ్ బోర్డులను ఏర్పాటు చేసింది. ప్రతీ బోగిలో ఛార్జింగ్ బోర్డులు ఉంటున్నాయి. అయితే, కొంతమంది ఇతరుల నిర్లక్ష్యం కారణంగా వారి ప్రాణాలతో పాటు ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది.
కొంతమంది ఫోన్లతో పాటు పవర్ బ్యాంకులను కూడా గంటలు, గంటలు ఛార్జింగ్ పెట్టి వదిలేస్తున్నారు. తాజాగా, ముంబై లోకల్ ట్రైన్లో రాత్రి వేళ ఓ పవర్ బ్యాంక్ పేలింది. రైలులో రాత్రి వేళల్లో ఛార్జింగ్ పెట్టడం వల్ల కలిగే నష్టాలు దృష్టిలో పెట్టుకుని రైలు ప్రయాణికులకు రైల్వే బోర్డు కీలక హెచ్చరిక జారీ చేసింది. రైళ్లలో నడిచే సమయంలో రాత్రి వేళల్లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చార్జింగ్ పెట్టుకోవడంపై నిషేధాన్ని మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.
దాదర్ నుంచి బద్లాపూర్ వైపు వెళ్తున్న ఒక లోకల్ రైలులో మధ్యాహ్నం సమయంలో ప్రయాణికుడికి పవర్ బ్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది. ఛార్జింగ్ అవుతున్న సమయంలో ఈ పేలుడు కారణంగా కోచ్ మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అయితే, ఇలాంటి ప్రమాదాలు రాత్రి వేళల్లో జరిగితే ప్రయాణికులు నిద్రలో ఉంటారు. కాబట్టి, భారీ నష్టం జరిగే ప్రమాదం ఉందని రైల్వే బోర్డు అప్రమత్తమైంది.
ఈ భద్రతా చర్యల్లో భాగంగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రైలు కోచ్‌లలోని అన్ని మొబైల్ ఛార్జింగ్ పాయింట్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని రైల్వే బోర్డు అన్ని జోన్లను ఆదేశించింది. రాత్రి వేళల్లో ఛార్జింగ్ పాయింట్లను ఆఫ్ చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇకపై ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండబోవని తేల్చి చెప్పింది.
ఈ మేరకు అక్టోబర్ 26వ తేదీన పంపిన లేఖలో బోర్డు స్పష్టం చేసింది. ఈ ఆరు గంటల భద్రతా సమయంలో ఛార్జింగ్ పాయింట్లు ఖచ్చితంగా ఆఫ్‌లో ఉన్నాయో లేదో అధికారులు నిర్ధారించారు, సూపర్వైజర్లు రైళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రైల్వే ఆదేశాలు జారీ చేసింది. ఈ నియమాన్ని అమలు చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించింది.
The post రైల్లో రాత్రిళ్లు ఛార్జింగ్ పెట్టడంపై బ్యాన్! iDreamPostలో మొదట కనిపించారు.
