Home సినిమా ట్రోల్స్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్ ! – Andhra Waves

ట్రోల్స్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్ ! – Andhra Waves

by andhra andhrawave
0 comments
ట్రోల్స్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్ !


రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా డైరెక్టర్ నితేశ్ తివారీ తీస్తున్న భారీ పౌరాణిక సినిమా ‘రామాయణ’. ఇండియా లెవల్లోనే కాకుండా వరల్డ్ వైడ్‌గా ఈ ప్రాజెక్ట్‌పై మంచి హైప్ ఉంది. అయితే రీసెంట్‌గా ఈ మూవీ నుంచి బయటికొచ్చిన ‘రావణ తాండవ్’, ‘రంగులు రంగులే’ పాటలపై సోషల్ మీడియాలో మిక్సిడ్ రియాక్షన్స్ వచ్చాయి. రెహమాన్ మ్యూజిక్ ఏంటో ఇలా ఉందంటూ కొందరు నెటిజన్లు పెదవి విరుస్తూ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా ఈ కామెంట్లపై ఆయన తనదైన స్టైల్‌లో స్పందిస్తూ సమాధానం ఇచ్చారు.

”మేము ఒక పాటను రెడీ చేసేటప్పుడు ఎంత కష్టపడతామో బయటకి తెలీదు. పదేపదే ట్యూన్లు మార్చి, మాకు పూర్తిగా నచ్చాకే బయటకు వదులుతాం. ఇంత కష్టపడ్డాక సోషల్ మీడియాలో ఎవరేం కామెంట్లు పెడుతున్నారో చూసేంత ఓపిక, టైం మాకు అస్సలు ఉండవు. ‘మొదట్లో తిట్టినవాళ్లే.. కొద్దిరోజుల తర్వాత ఆ పాటలను విని సారీలు చెబుతారు డాడీ’ అని మా అబ్బాయి నాతో అంటుంటాడు. నేను నా పనిని నిజాయతీగా చేసుకుంటూ పోతాను, జనాలు కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం నాకుంది’’ అంటూ రెహమాన్ తేల్చేశారు.

అంతేకాదు, ఇప్పటికీ కొందరు తన కెరీర్ స్టార్టింగ్‌లో వచ్చిన పాత పాటల స్టైల్‌నే కోరుకుంటున్నారని, కానీ ఎప్పుడూ ఒకే తరహా పాటలు చేసుకుంటూ పోవడం తనకు ఇష్టం ఉండదని స్పష్టం చేశారు. మారుతున్న ట్రెండ్‌కి తగ్గట్టు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటానని అన్నారు. నితేశ్ తివారీ డైరెక్షన్‌లో వస్తున్న ‘రామాయణ’ పార్ట్-1 నవంబరు 5న థియేటర్లలోకి రాబోతోంది. పాటలపై నెత్తింట ఎలాంటి చర్చలు నడుస్తున్నా.. బిగ్ స్క్రీన్‌పై విజువల్స్‌తో కలిపి చూసినప్పుడు రెహమాన్ మార్క్ బీజీఎం గూస్‌బంప్స్ తెప్పిస్తుందని టీమ్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రచయిత అవతార్

గణేష్

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird