Home సినిమా విదేశీ పిచ్‌లపై ఆడలేరా.. ఇప్పుడేమంటారు – iDreamPost – Andhra Waves

విదేశీ పిచ్‌లపై ఆడలేరా.. ఇప్పుడేమంటారు – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
విదేశీ పిచ్‌లపై ఆడలేరా.. ఇప్పుడేమంటారు - iDreamPost


“ఇండియాలో ఫ్లాట్ ట్రాక్స్ ఎవరైనా కొడతారు. విదేశాల్లో ఆడితేనే అసలైన బ్యాటర్” న్యూజిలాండ్ తో టీ20 సిరీస్‌కు ముందు సంపూర్ణ చిచ్చర పిడుగులు వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మలపై వచ్చిన విమర్శలు ఇవి. అయితే విదేశీ పిచ్‌లపై భారత యువ ఓపెనర్లు ఎలా ఆడతారనే చర్చకు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ తమ బ్యాటింగ్‌తో సమాధానం ఇచ్చారు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో ఈ ఇద్దరూ ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగడంతో కివీస్ బౌలర్లు ఒత్తిడిలో పడిపోయారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీతో అదరగొట్టగా, వైభవ్ సూర్యవంశీ కూడా తన దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

అభిషేక్ శర్మ విధ్వంసం

అభిషేక్ శర్మ తనదైన అగ్రెసివ్ బ్యాటింగ్ తో న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 199 పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం 38 బంతుల్లోనే 113 పరుగులు సాధించాడు. అభిషేక్‌లో తొమ్మిది ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే భారీ షాట్లతో విరుచుకుపడిన అభిషేక్.. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ సెంచరీతో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో తన నాలుగో శతకాన్ని నమోదు చేశాడు. అభిషేక్ బ్యాటింగ్ పై గతంలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా బంతి స్వింగ్ అయ్యే సమయంలో అతిగా దూకుడుగా ఆడుతూ వికెట్ కోల్పోతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే న్యూజిలాండ్ గడ్డపై ఆడిన ఈ ఇన్నింగ్స్ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది.

వైభవ్ సూర్యవంశీ మెరుపులు

మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా అద్భుతంగా ఆడాడు. కేవలం 19 బంతుల్లోనే 45 పరుగులు చేసి భారత జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందించాడు. అభిషేక్‌తో కలిసి తొలి వికెట్‌కు కేవలం 7.1 ఓవర్లలోనే 133 పరుగులు జోడించారు. వీరిద్దరి దూకుడుతో భారత్ పవర్ ప్లేలోనే 118 పరుగులు సాధించి రికార్డు సృష్టించింది. వైభవ్ తో జరిగిన సిరీస్ లో విఫలమయ్యాడు.
విదేశీ పిచ్ లపై ఆడలేదంటూ తన టాలెంట్ ను కొందరు తక్కువ చేసి మాట్లాడారు. కానీ వైభవ్ మాత్రం తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు.

రచయిత అవతార్

బాబు.పొలిచర్ల

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird