Home సినిమా కొమ్మూరి సాంబశివరావు శత జయంతి: ఇందిరా గాంధీ హత్యను ముందే ఊహించిన రచయిత.! – Andhra Waves

కొమ్మూరి సాంబశివరావు శత జయంతి: ఇందిరా గాంధీ హత్యను ముందే ఊహించిన రచయిత.! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


తెలుగు సినిమా గురించి ఇప్పుడు ఎన్నో వెబ్‌సైట్‌లు, యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా వేదికలు ఉన్నాయి. కానీ దశాబ్దాల క్రితమే సినిమా రంగంలో కొత్త ఒరవడికి నాంది పలికిన పత్రికలు ఉన్నాయి. అలాంటి సమయంలోనే సినిమా జర్నలిజంలో తనదైన ముద్ర వేసి, ఆ తర్వాత తెలుగు డిటెక్టివ్ నవలా ప్రపంచంలో ప్రత్యేక సంపాదించుకున్న వ్యక్తి కొమ్మూరి సాంబశివరావు. ఆయన జన్మించిన వందేళ్లు వేడుక.. రచయితగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా, నిర్మాతగా సాగిన ఆయన ప్రయాణం మరోసారి చర్చకు వస్తోంది.

1926 అక్టోబర్ 26న తెనాలిలో జన్మించిన కొమ్మూరి సాంబశివరావుకు చిన్నప్పటి నుంచే సాహిత్య వాతావరణంతో అనుబంధం ఉంది. ఆయన తండ్రి వెంకట్రామయ్య ప్రింటింగ్ ప్రెస్ నిర్వహించేవారు. ఆ కుటుంబానికి రచయితలతో, సాహిత్యంతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ప్రముఖ రచయిత చలం ఆయనకు పెదనాన్న కాగా, కొడవటిగంటి కుటుంబరావు బావ.

సాంబశివరావు ప్రస్తుతం ‘ఆంధ్రప్రభ’లో పొలిటికల్ కరస్పాండెంట్‌గా పనిచేశారు. అదే సమయంలో తండ్రి ‘తెలుగు సినిమా’ మాసపత్రికకు వ్యాసాలు రాసేవారు. 1947లో పత్రిక బాధ్యతలను పూర్తిగా స్వీకరించిన ఆయన.. సినిమా జర్నలిజంలో కొత్త మార్గదర్శకాలను పరిచయం చేశారు. రంగుల ఇంటర్వ్యూలు, స్టూడియో విశేషాలు, నటినటుల ప్రత్యేకతలు, అరుదైన ఛాయాచిత్రాలతో పత్రికలను పాఠకులకు మరింత చేరువ చేశారు.

అప్పట్లో సినిమా గురించి పత్రికగా ‘తెలుగు సినిమా’ మంచి ఆదరణ పొందింది. అయితే కొత్త సినిమా పత్రికలు రావడంతో 1953 ప్రాంతంలో దాన్ని మూసివేశారు. ఆ తర్వాత సాంబశివరావు తన దృష్టిని నవల రచనపై కేంద్రీకరించారు.

కొమ్మూరి సాంబశివరావు పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది డిటెక్టివ్ నవలలు, యుగంధర్ పాత్ర. నేర పరిశోధన, రహస్యాలు, ఊహించని మలుపులతో పాఠకులను చివరి పేజీ వరకు ఉత్కంఠకు గురిచేసే కథన శైలి ఆయన రచనలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.

1956లో వెలువడిన ‘లక్షాధికారి హత్య’ ఆయన డిటెక్టివ్ రచన ప్రయాణంలో కీలకమైన నవలగా నిలిచింది. ఆ తర్వాత డిటెక్టివ్, హారర్, సాంఘిక కథాంశాలతో దాదాపు వంద నవలలు రాశారు. ‘అర్ధరాత్రి పిలుపు’, ‘నెం.888’, ‘చీకటికి వెయ్యి కళ్లు’, ‘దొంగుతున్నారు జాగ్రత్త’, ‘ప్రాక్టికల్ జోకర్’ వంటి రచనలు పాఠకుల్లో విశేష ఆదరణ పొందాయి.

ముఖ్యంగా 1984 ప్రాంతంలో పంజాబ్ తీవ్రవాదం నేపథ్యంలో అర్ధరాత్రి పిలుపు అనే నవల రాశారు. ఇందులో భారత ప్రధాన మంత్రిని అతని అంగరక్షకుడే(బాడీగార్డ్) చంపబోతే డిటెక్టివ్ యుగంధర్ అడ్డుపడి రక్షిస్తాడు. ఇది రాసిన కొద్ది నెలలకే అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె సొంత అంగరక్షకులే కాల్చి చంపడం కాకతాళీయం.

1960లో వచ్చిన ‘చావు తప్పితే చాలు’ తెలుగు తొలి హారర్ నవలలో విశేష గుర్తింపు పొందింది. కథలో ఉత్కంఠను పెంచడం మాత్రమే కాదు.. పుస్తకం నుండి ప్రచురణ, మార్కెటింగ్ వరకు ప్రతి అంశంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. తన రచనలను సొంత ప్రచురణ సంస్థ ద్వారా పాఠకులకు అందించడం కూడా ఆయన ప్రత్యేకత.

కొమ్మూరి సాంబశివరావు రచనలు పుస్తకాలకే పరిమితం కాలేదు. ఆయన నవలలు వెండితెరపైనా చోటు సంపాదించుకున్నాయి. ‘పట్టుకుంటే లక్ష’ నవల అదే పేరుతో సినిమాగా తెరకెక్కింది. ఈ చిత్రంలో కృష్ణ నటించగా, డిటెక్టివ్ యుగంధర్ పాత్రను నాగభూషణం పోషించారు.

అలాగే ఆయన రాసిన ‘నేను చావను’ నవల ఆధారంగా చిరంజీవి ప్రధాన పాత్రలో ‘నకిలీ మనిషి’ సినిమా రూపొందించబడింది. ‘ఒక చల్లని రాత్రి’ అంటే ఆయన సాంఘిక నవల అదే పేరుతో సినిమాగా తెరకెక్కించారు, చంద్రమోహన్ నటించారు.

అయితే నిర్మాతగా ఆయన చేసిన ప్రయత్నం మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. 1975లో జయంతి ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో ‘మళ్లీ ఎప్పుడో ఎక్కడో’ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చారు. పెండ్యాల సంగీతం, శ్రీశ్రీ సాహిత్యం అందించిన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాలేదు. అలా ఆయన సినీ ప్రయాణంలో విడుదల కాని చిత్రంగా అది మిగిలిపోయింది.

1994 మే 17న కొమ్మూరి సాంబశివరావు కన్నుమూశారు. కానీ ఆయన సృష్టించిన యుగంధర్ వంటి పాత్రలు, ఉత్కంఠతో సాగిపోయే నవలలు, తెలుగు సినిమా పత్రికా రంగానికి చేసిన సేవలు ఇప్పటికీ ఆయనను గుర్తుచేస్తూనే ఉన్నాయి. ఒక రచయితకు నిజమైన గుర్తింపు ఆయన జీవించిన కాలంతో ముగిసిపోదు.. ఆయన సృష్టించిన పాత్రలు, కథలు తరతరాల పాఠకులను చేరినప్పుడే ఆ గుర్తింపు మరింత బలపడుతుంది. కొమ్మూరి సాంబశివరావు సాహితీ ప్రయాణం అందుకు ఓ నిదర్శనం.

ఇది కూడా చదవండి: 175 డేస్ రికార్డు.. టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించిన టాప్10 సినిమాలు ఇవే.!

[Kommuri Sambasiva Rao Birth Centenary, Kommuri Sambasiva Rao Novels, Artha Raatri Pilupu Novel, Indira Gandhi Death, Kommuri Sambasiva Rao Books, Telugu Detective Novels, Detective Yugandhar, Lakshadhikari Hatya, Telugu Books]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird