Home సినిమా ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చిన వెట్రిమారన్ – iDreamPost – Andhra Waves

ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చిన వెట్రిమారన్ – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చిన వెట్రిమారన్ - iDreamPost


తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. తెలుగులో ఆయన నేరుగా సినిమా చేయకపోయినా.. డబ్బింగ్ సినిమాలతో తరచుగా ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నారు. ఆయన సినిమా తెలుగులో కొన్ని రీమేక్‌లు కూడా అయ్యాయి. వెట్రిమారన్ సినిమాల్లోని కంటెంట్ ఎంత సహజంగా, అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఆయన సినిమాలపై విమర్శకులు, ప్రేక్షకులు సుదీర్ఘకాలంగా ఒకే లోపాన్ని ఎత్తిచూపుతున్నారు. అదే ‘లిప్ సింక్’ (డబ్బింగ్ డైలాగులు, నటినటుల పెదవుల కదలికలు సరిపోకపోవడం) లోపం. తాజాగా, ఐఎఫ్‌పీ ఫెస్టివల్ ఈవెంట్‌లో పాల్గొన్న వెట్రిమారన్ ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఆయన మాట్లాడుతూ.. ”ప్రతి ఒక్కరూ నన్ను ఈ లిప్ సింక్ గురించి అడుగుతుంటారు. దానికి నా దగ్గర ఒకే ఒక్క సమాధానం ఉంది. ఈ మాట బయటవారికే కాదు, నా టీమ్‌కు కూడా స్పష్టంగా చెప్తాను. షూటింగ్ మరియు డబ్బింగ్ సమయంలో నా టీమ్‌ను నేను ఒక్కటే అడుగుతాను.. ‘మీకు పర్ఫెక్ట్ సింక్ కావాలా లేక బలమైన కథ కావాలా?’ అని. నేను ఎప్పుడూ కథకే మొదటి ప్రాధాన్యత ఇస్తాను. మీకు ఖచ్చితంగా లిప్ సింక్ కావాలనుకుంటే, దాన్ని మీరే ఉంచుకోవచ్చు. కానీ నాకు మాత్రం కథే ముఖ్యం” అని ఆయన తేల్చి చెప్పారు.

తన వర్కింగ్ స్టైల్, మేకింగ్ ప్రాసెస్ గురించి కూడా ఆయన మాట్లాడారు.. ”నాకు ఎలాంటి ఫిక్స్‌డ్ రూల్స్ ఉండవు. నేను పూర్తిగా సెట్స్‌లో నా నేచురల్ థాట్స్, ఇన్‌స్టింక్ట్ మీదే పనిచేస్తాను. నాకు ఎడిటింగ్ టేబుల్ అంటే ఎంతగానో ఇష్టం. ఆ ప్రక్రియపై నాకు ఒక రకమైన పిచ్చి ఉంది. కొన్నిసార్లు సినిమా అధికారికంగా థియేటర్లలో విడుదలైన తర్వాత కూడా డిటింగ్ రూమ్‌లో నేను మార్పులు చేస్తున్నాను” అని చెప్పారు.

రచయిత అవతార్

వెంకటేశ్వర్లు

నా పేరు వెంకటేశ్వర్లు. iDreamPost.comలో సీనియర్ సబ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. 2023 నుంచి ఐడ్రీమ్‌తో నా ప్రయాణం మొదలైంది. ఇక్కడ సినిమా, జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్, రాజకీయాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటాను. 2016లో జర్నలిజం వైపు వచ్చాను. జర్నలిజంలో పీజీ డిప్లొమా చేశాను. నాకు జర్నలిజంలో 9 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. 2017లో సాక్షి వెబ్ డెస్క్ నుంచి వృత్తిపర జర్నీ మొదలైంది. ఆ తర్వాత సుమన్ టీవీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్‌లో సేవలను అందించాను.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird