నాని ది ప్యారడైజ్: సినిమా నచ్చితే స్టార్లు.. సింగల్ స్టార్.. సినిమా రివ్యూల విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు మహేష్ కుమారుడు తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడిస్తున్నాడు. తాజాగా నాచురల్ స్టార్ నాని నటించిన సినిమాకు ఆయన ఇచ్చిన రేటింగ్ చర్చకు దారి తీస్తోంది. ఒకే ఒక స్టార్ రేటింగ్ రివ్యూ ప్లాట్ ఫామ్ లెటర్ బాక్స్ లో గౌతమ్ కేవలం ఒకే ఒక స్టార్ రేటింగ్ ఇచ్చినట్టు. సినిమాటోగ్రఫీ బాగుందని.. […]
నాని ది పారడైజ్: సినిమా చేస్తే ఐదు స్టార్లు.. నచ్చకపోతే సింగల్ స్టార్.. సినిమా రివ్యూల విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు మహేష్ కొడుకు తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడిస్తున్నాడు. తాజాగా నాచురల్ స్టార్ నాని నటించిన సినిమాకు ఆయన ఇచ్చిన రేటింగ్ చర్చకు దారి తీస్తోంది.
ఒకే ఒక స్టార్ రేటింగ్
రివ్యూ ప్లాట్ ఫామ్ లెటర్ బాక్స్డ్ లో గౌతమ్ కేవలం ఒకే ఒక్క స్టార్ రేటింగ్ ఇచ్చినట్టు. సినిమాటోగ్రఫీ బాగుందని.. ఎమోషనల్ సీన్స్ లో నటినటుల అభినయం ఆకట్టుకుందని గౌతమ్ పేర్కొన్నారు. మిగిలిన అంశాలు తనను తీవ్రంగా నిరాశపరిచాయని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సినిమా కూర్పు పై సూపర్ స్టార్ మహేష్ తనయుడు గౌతమ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అది అత్యంత భయానకంగా ఉందని వివరించాడు.
గౌతమ్ గతంలో పలు సినిమాలకు ఇచ్చిన రేటింగ్స్ ను ఒకసారి పరిశీలిస్తే.. ఆయన అభిరుచి కనిపించింది. రన్వీర్ నటించిన దురంధర్ సినిమాకు నాలుగు స్టార్లు ఇచ్చాడు. టాక్సిక్ కు 0.5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 నుండి 5 స్టార్లు, రాజమౌళి రూపొందించిన RRR కు నాలుగు స్టార్ల రేటింగ్ ఇచ్చాడు. ఇక నాని నటించిన జెర్సీ విషయంలో మాత్రం గౌతమ్ పూర్తి మార్కులు ఇచ్చాడు. ఆ సినిమాకు ఐదు స్టార్ల రేటింగ్ కేటాయించాడు. అలాగే ప్రభాస్ నటించిన బాహుబలి 2 సినిమాకు ఐదు స్టార్ల రేటింగ్ ఇచ్చారు.
తండ్రి సినిమాలకు ఫుల్ మార్కులు
గౌతమ్ రేటింగ్స్ విషయంలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. మహేష్ బాబు సినిమాలకు ఫుల్ మార్కులు ఇచ్చాడు. తన తండ్రి నటించిన పోకిరి, 1 నేనొక్కడినే సినిమాలకు ఆయన ఐదు స్టార్ల రేటింగ్ ఇచ్చాడు. దీంతో గౌతమ్ ఏ సినిమాను ఎలా అంచనా వేస్తారు.. ఆయనకు నచ్చే అంశాలు ఏంటి.. అనే ఆసక్తి అభిమానుల్లో ప్రదర్శించారు. అయితే ఒక సినిమాకు తక్కువ రేటింగ్ ఇవ్వడం అనేది పూర్తిగా వ్యక్తిగత అభిరుచికి సంబంధించిన విషయం. ఒకరికి నచ్చిన సినిమా మరొకరికి నచ్చకపోవచ్చు. అదేవిధంగా గౌతం ది ప్యారడైజ్ కు సింగిల్ స్టార్ ఇవ్వడం పర్సనల్ ఒపినియన్ గా చూడాలి. మొత్తానికి నాని సినిమాకు గౌతం ఇచ్చిన రేటింగ్ తో పాటు ఎడిటింగ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ అభిమానుల చర్చకు దారితీస్తున్నాయి. తెరపై సినిమా ఎలా ఉందన్న దానిపై ప్రేక్షకుల అభిప్రాయాలు ఉండటం సహజం. మరి ది ప్యారడైజ్ విషయంలో గౌతమ్ అభిప్రాయంతో ఎంతమంది ఏకీభవిస్తారో చూడాలి.
