Home క్రైమ్ Tiger Shroff Attack: టైగర్ ష్రాఫ్ పై దాడులు.. టాలీవుడ్ లోనూ – Andhra Waves

Tiger Shroff Attack: టైగర్ ష్రాఫ్ పై దాడులు.. టాలీవుడ్ లోనూ – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


టైగర్ ష్రాఫ్ అటాక్: బాలీవుడ్‌లో మరోసారి అండర్ వరల్డ్ భయాలు తెరపైకి వచ్చాయి. నటుడు టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటనతో సినీ పరిశ్రమలో కలకలం చెలరేగింది. ఈ ఘటన వెనుక లారెన్స్ గ్యాంగ్ హస్తం ఉందని ప్రచారం. బాలీవుడ్‌లో భద్రతపై చర్చ కూడా మొదలైంది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న సినీ ప్రముఖులలో ఆందోళన పెరుగుతోంది. బాలీవుడ్.. అండర్ వరల్డ్ మధ్య గతంలో అనేక సంబంధాలు ఉండేవి. విభేదాలు కూడా ఉండేవి. […]

టైగర్ ష్రాఫ్ దాడి: బాలీవుడ్‌లో మరోసారి అండర్ వరల్డ్ భయాలు తెరపైకి వచ్చాయి. నటుడు టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటనతో సినీ పరిశ్రమలో కలకలం చెలరేగింది. ఈ ఘటన వెనుక లారెన్స్ గ్యాంగ్ హస్తం ఉందని ప్రచారం. బాలీవుడ్‌లో భద్రతపై చర్చ కూడా మొదలైంది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న సినీ ప్రముఖులలో ఆందోళన పెరుగుతోంది.

బాలీవుడ్.. అండర్ వరల్డ్ మధ్య గతంలో అనేక సంబంధాలు ఉండేవి. విభేదాలు కూడా ఉండేవి. అయితే ఇది కొత్త విషయం కాదు. అనేక సినీ ప్రముఖులకు బెదిరింపులు రావడం.. భద్రతను పెంచుకోవాల్సిన పరిస్థితులు గతంలో చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు టైగర్ మీద కాల్పుల ఘటన మరోసారి తెరపైకి వచ్చింది.

సల్మాన్ ఖాన్ ను లక్ష్యంగా చేసుకుని గతంలో పలుమార్లు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో.. ఆయనతో దగ్గరగా ఉండే ప్రముఖులకు కూడా ఈ పరిణామాలు ఆందోళన కలిగించే అంశాలుగా మారిపోయాయి. అయితే టైగర్ పై జరిగిన ఘటన కేవలం బాలీవుడ్ కాకుండా.. అన్ని పరిశ్రమల నటుల మీద ప్రభావం చూపుతోంది. సల్మాన్ ఖాన్ కు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా స్నేహితులు ఉన్నారు. టాలీవుడ్ సినిమాల షూటింగ్ ఎక్కువగా ముంబైలో జరుగుతోంది. చాలామంది తెలుగు హీరోలు.. దర్శకులు.. నిర్మాతలు.. వివిధ ప్రాజెక్టుల కోసం ముంబై వెళ్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులతో చర్చలు జరుపుతున్నారు. సినిమా ప్రమోషన్ కోసం బాలీవుడ్ నటులను కూడా వాడుకుంటున్నారు. ఈ నేపద్యంలో ముంబైలో చోటు చేసుకునే భద్రతాపరమైన పరిణామాలు తెలుగు సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. టైగర్ ఘటన నేపథ్యంలో ముంబైలో షూటింగ్‌లు నిర్వహించే తెలుగు చిత్ర బృందాలు తమ బదర్గా ఏర్పాట్‌ను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది. సినీ ప్రముఖులకు బెదిరింపులు రావడం.. కాల్పుల ఘటనలు చోటు చేసుకోవడం.. పరిశ్రమలో భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖుల వ్యక్తిగత భద్రత.. షూటింగ్ ప్రాంతాలలో రక్షణ.. ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరోసారి చర్చకు దారితీస్తున్నాయి.

టైగర్ పై కాల్పుల ఘటనకు సంబంధించి దర్యాప్తులో బయటికి వచ్చే వివరాలు.. దీని వెనుక ఉన్న అసలు కారణాలను స్పష్టం చేయబోతున్నారు. అయితే దీని వెనక ఎవరున్నారు.. వారి టార్గెట్ ఏమిటి.. ఇతర ప్రముఖులకు ఏదైనా ముప్పు ఉందా.. అనే ప్రశ్నలకు దర్యాప్తు ద్వారా లభించే సమాధానాలు సమాధానం ఇస్తాయి. బాలీవుడ్ లో మొదలైన ఈ భద్రతా చర్చ టాలీవుడ్ వరకు విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ గతంలో టాలీవుడ్ లో అనేక సినిమాలకు ప్రమోషన్ చేశారు. కొన్ని సినిమాలలో గెస్ట్ రోల్ లో కూడా కనిపించారు. ముఖ్యంగా పెద్ద హీరోలలో చాలామంది సల్మాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితులు. ఇప్పటికే లారెన్స్ గ్యాంగ్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో.. వీరు సల్మాన్ ఖాన్ తో స్నేహం కొనసాగిస్తారా.. లేదా అనేది.. చూడాల్సి ఉంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird