Home అంతర్జాతీయం BRICS సమ్మిట్: బ్రిక్స్ కు వచ్చే హోటల్ కోసం హోటల్ ఖర్చు -Andhra Waves

BRICS సమ్మిట్: బ్రిక్స్ కు వచ్చే హోటల్ కోసం హోటల్ ఖర్చు -Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


BRICS సమ్మిట్: చైనా దేశస్తులు సూప్ లు ఎక్కువగా తాగుతూ ఉంటారు. నూడిల్స్ హాయిగా ఆస్వాదిస్తూ తింటారు. రష్యా దేశస్తులు మాంసాన్ని ఎక్కువగా తింటారు. పిజ్జాలు, బర్గర్లను దంచేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్క దేశంలో ఒక్కో రకంగా ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఆ దేశ ప్రజలు ఏమో గాని.. దానిని పరిపాలించే నేతలు కచ్చితంగా భారతీయ వంటకాలను తినాల్సిందే. మన కారం ఘాటును.. మసాలా హీటును భరించాల్సిందే. ఇదంతా ఎందుకంటే రేపాటి నుంచి మనదేశ […]

BRICS సమ్మిట్: చైనా దేశస్తులు సూప్ లు ఎక్కువగా తాగుతూ ఉంటారు. నూడిల్స్ హాయిగా ఆస్వాదిస్తూ తింటారు. రష్యా దేశస్తులు మాంసాన్ని ఎక్కువగా తింటారు. పిజ్జాలు, బర్గర్లను దంచేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్క దేశంలో ఒక్కో రకంగా ఆహారపు అలవాట్లు ఉంటాయి.

ఆ దేశ ప్రజలు ఏమో గాని.. దానిని పరిపాలించే నేతలు కచ్చితంగా భారతీయ వంటకాలను తినాల్సిందే. మన కారం ఘాటును.. మసాలా హీటును భరించాల్సిందే. ఇదంతా ఎందుకంటే రేపాటి నుంచి మనదేశ రాజధాని ఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. ఈసారి ఈ సదస్సుకు భారతదేశం ఆతిథ్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాట్లను అద్భుతంగా చేశారు.

బ్రిక్స్ సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.. సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్.. ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్.. ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ వంటి వారు హాజరు కాబోతున్నారు. వీరిలో పుట్టింది ఇప్పటికే ఢిల్లీ వచ్చారు. ప్రపంచ దేశాల నుంచి అతిరథ మహారధులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ప్రత్యేకమైన భారతీయ వంటకాలను పరిచయం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖమైన హోటళ్ల చెఫ్‌లు విభిన్నమైన వంటకాలను సిద్ధం చేశారు. జాతీయ మీడియాలో వార్తల ప్రకారం కాశ్మీర్ మసాలా వాల్నట్స్.. గలవుటి కబాబ్.. ఇంకా అనేక రకాల వంటకాలను సిద్ధం చేసి చూపిస్తున్నాయి. ఢిల్లీలోని ప్రముఖమైన తాజ్ మహల్.. ది లీలా ప్యాలెస్.. ది లలిత్ వంటి హోటళ్లు ఇండియన్ వంటకాలను.. ఆధునిక.. అంతర్జాతీయ స్థాయిలో బండి అతిధులకు వడ్డించబోతున్నాయి.

తాజ్ మహల్ హోటల్‌లో విఐపి అతిధులకు ట్రెడిషన్ టు టేబుల్ పేరుతో ప్రత్యేకమైన ఆహారపు వంటకాలను సర్వ్ చేయబోతున్నారు. తాజ్మహల్ హోటల్లో పనిచేసే చెఫ్ లు తమ తల్లుల నుంచి నేర్చుకున్న వంటకాలను ఈ మెనులో రూపొందించారు. ఇందులో భాగంగా పురాని ఢిల్లీ మైదా కాజు.. మహారాష్ట్ర బాకర వడి.. రాజస్థాన్ మినీ కచోరి.. బెంగాల్ కూర్చో నిముకి.. తమిళనాడులోని మురుక్కు వంటకాలు ఇందులో ఉన్నాయి..

ప్రపంచ దేశాల అధినేతల కోసం ఢిల్లీ వ్యాప్తంగా మూడు వేలకు పైగా హోటల్ గదులను బుక్ చేశారు. ఇందులో కొన్ని లగ్జరీ హోటల్స్ లో ఒక్క రాత్రి దాదాపు 2 లక్షలకు పైగా ఉన్నట్టు సమాచారం. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీలోని ఐటిసి మౌర్య హోటల్‌లో ఉండబోతున్నారు. బ్రిక్స్ సదస్సులో ఇక్కడ హోటల్ గదులకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఒక రోజు గది అద్దె దాదాపు 2 లక్షలకు పైగా ఉంది. చైనా అధ్యక్షుడు షిన్ పింగ్ తాజ్ ప్యాలెస్ లో ఉంటారు.. బ్రెజిల్.. కజకిస్తాన్.. ఇతర దేశాల అధినేతలు ఒబెరాయ్ హోటల్‌లో ఉంటారు… బ్రిక్స్ జి దేశాలు.. ఇతర.. ఐక్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో వారు మెరీడియన్ హోటల్‌లో ఉంటారు.. శాంగ్రి హోటల్‌లో పశ్చిమ ఆసియా దేశాలకు చెందిన ప్రతినిధులు అందులో బస చేయబోతున్నారు. ఇక్కడ ఒక గది అద్దె దాదాపు 60 వేల వరకు ఉన్నటువంటి సమాచారం. బ్రిక్స్ సదస్సు ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird