Home సినిమా నిన్న వెబ్ సిరీస్ రిలీజ్: ఈ రోజు ఆ వెబ్ సిరీస్ తెరకెక్కించిన దర్శకుడు మృతి! – Andhra Waves

నిన్న వెబ్ సిరీస్ రిలీజ్: ఈ రోజు ఆ వెబ్ సిరీస్ తెరకెక్కించిన దర్శకుడు మృతి! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎంతో ప్రతిభావంతుడైన యువ దర్శకుడు బెల్రాజ్ కళ్లారికల్ (27) అకస్మాత్తుగా కన్నుమూశారు. కేవలం 27 సంవత్సరాల వయస్సులోనే కొచ్చిలోని ఒక హోటల్ గదిలో విగతజీవిగా పడి సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రాథమిక నివేదిక ప్రకారం గుండెపోటు (హార్ట్ ఎటాక్) కారణంగా మరణించి ఉంటారని.

తన మొట్టమొదటి భారీ ప్రాజెక్ట్ సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించకముందే ఈ విషాదకర సంఘటన జరగడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు తోట సినీ ప్రముఖులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి వెబ్ సిరీస్ ‘కప్పీ స్క్వాడ్’ (కప్పి స్క్వాడ్) ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌లో (JioHotstar) నిన్న స్ట్రీమింగ్ కి రాగా, ఇంత అర్ధాంతరంగా తనువు చాలించడం అందరినీ కలచివేస్తోంది.

మరో అత్యంత హృదయ విదారకమైన విషయం ఏంటంటే బెల్రాజ్ కి కొద్ది రోజుల క్రితమే వివాహం జరిగింది. గత ఆరేళ్లుగా ఒకరినొకరు ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నారు, సరిగ్గా సెప్టెంబర్ నెలలోనే అడుగుపెట్టాల్సిన వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. కెరీర్ ఊపందుకుంటున్న తరుణంలో, పెళ్లయిన నెల రోజుల వ్యవధిలోనే ఈ ప్రమాదం జరగడంతో భార్య, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయన వయసు కేవలం 27 సంవత్సరాలు.

[kappi Squad Director Belraj Kalarickal Passes Away, Belraj Kalarickal, Kappi Squad director, Belraj Kalarickal passes away, Telugu Cinema News, Telugu Cinema, Tollywood, Tollywood News]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird