RK kotta paluku: ఆంధ్రజ్యోతి పత్రిక ఎండి వేమూరి రాధాకృష్ణ స్టైల్ వేరే విధంగా ఉంటుంది. చాలామంది ఆయన విమర్శిస్తారు కానీ. కొన్ని సందర్భాల్లో ఆయన ఇన్సైడ్ లేకుండా ఎటువంటి మొహమాటం చెబుతారు. తన పత్రికలో ఎటువంటి ఫిల్టర్లు లేకుండా రాసుకుంటూ వస్తారు. చంద్రబాబు ప్రస్తావన లేకుంటే.. రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని రాయాల్సిన అవసరం లేకుంటే.. స్వేచ్ఛగా రాసుకుంటూ వెళ్తారు. తాజాగా పలువురిలో రాధాకృష్ణ సంచలన విషయాలు బయటపడ్డారు. ఇందులో నరేంద్ర మోడీ పదవికి […]
ఆర్కే కొత్త పలుకు: ఆంధ్రజ్యోతి పత్రిక ఎండి వేమూరి రాధాకృష్ణ స్టైల్ వేరే విధంగా ఉంటుంది. చాలామంది ఆయన విమర్శిస్తారు కానీ. కొన్ని సందర్భాల్లో ఆయన ఇన్సైడ్ లేకుండా ఎటువంటి మొహమాటం చెబుతారు. తన పత్రికలో ఎటువంటి ఫిల్టర్లు లేకుండా రాసుకుంటూ వస్తారు. చంద్రబాబు ప్రస్తావన లేకుంటే.. రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని రాయాల్సిన అవసరం లేకుంటే.. స్వేచ్ఛగా రాసుకుంటూ వెళ్తారు.
తాజాగా పలువురిలో రాధాకృష్ణ సంచలన విషయాలు బయటపడ్డారు. ఇందులో నరేంద్ర మోడీ పదవికి వచ్చిన ముప్పును.. జగన్ కొనసాగించిన డబుల్ పాలిటిక్స్ ను రాధాకృష్ణ బయటపెట్టారు.. రాధాకృష్ణ రాసుకొచ్చిన కొత్త పలుకుల్లో అనేక సంచలన విషయాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా మన దేశ అభివృద్ధిని అడ్డుకోవడంతోపాటు.. మనలో అత్యంత బలంగా ఉన్న రాజకీయ నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు విదేశీ శక్తులు కుట్రలు పన్నాయి. ముఖ్యంగా అమెరికాలో కొన్ని శక్తులు ప్రయత్నాలు చేశాయి.. ఇదే పర్యాయక ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే కూడా బయటపెట్టారు. ఈ కుట్రకు సరిగా కొద్ది రోజుల క్రితమే అంకురార్పణ జరిగింది. నాడు ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్ ఖడ్ విదేశీ శక్తులతో చేతులు కలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అస్థిరపరచడానికి కుట్రలు చేశారు. పైగా అమెరికా శక్తులు అనిల్ అంబానీ కూడా తమకు అనుకూలమైన వ్యక్తిగా ఎంపికయ్యారు. అటు జగదీప్.. ఇటు అనిల్ అంబానీ కార్యాచరణ మొదలుపెట్టారు. నాడు టిడిపి.. జెడియు.. చిరాగ్ పాశ్వాన్.. అరవింద్ కేజ్రీవాల్ వంటి వారు సహకరిస్తే మోడీ ప్రభుత్వం పతనమవుతుందని ఒక అంచనా వేశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని అనుకున్నారు. ఈ దశలో జగదీప్ కొని రాజకీయ పార్టీలతో ప్రాథమికంగా చర్చలు జరిపారట. అనిల్ అంబానీ కూడా దీనికి సహకరించారట.
ఒక దశలో చంద్రబాబు నాయుడు ను కలవడానికి అనిల్ అంబానీ అనేక సార్లు ప్రయత్నాలు చేశారట. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదట. అయితే జెడ్ యు అధినేత నితీష్..ఆప్ అధినేత కేజ్రీవాల్ మాత్రమే అనిల్ అంబానీని కలుసుకున్నారట. మోడీకి వ్యతిరేకంగా ఏదో జరుగుతుందని చంద్రబాబు తెలుసుకొని.. ఈ పరిశీలన నితీష్.. చిరాగ్ పాశ్వాన్ అలాంటి వారికి చెప్పారట. కేంద్ర పెద్దలు రంగంలోకి దిగి రాజీనామా చేయాలని కోరితే జగదీప్ చేయవలసి వచ్చింది అట.
మరోవైపు ఇప్పటికి ఇప్పుడు జగన్ బొద్దింకలను ముద్దుగా పెట్టుకోవడానికి ప్రధాన కారణం.. అక్రమాస్తుల కేసులు ఆయనను కేంద్ర దర్యాప్తు సంస్థ రోజువారీ విచారణ చేయాలని నిర్ణయించింది. సీబీఐ కేసులతోపాటు ఈ కేసులతో కూడా రోజువారీగా విచారణ జరిగితే జగన్ ఇబ్బంది పడక తప్పదు. అవినీతి కేసుల నుంచి ఇప్పటికిప్పుడు తనకు రక్షణ లభించదు అనే అభిప్రాయానికి జగన్ వచ్చారు. అందుకే ఆయన రాజకీయంగా సపోర్ట్ కోసం బొద్దింకగా మారారు. కాంగ్రెస్ పార్టీతో జట్టుకు కట్ట ప్రయోజనం లభించే అవకాశం లేకపోవడంతో, కాక్రోచ్ జనతా పార్టీకి జగన్ సపోర్ట్ చేసినట్టు తెలుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ కూడా జగన్ చేసిన ట్వీట్ కు సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ వెనుక విదేశీ శక్తులు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. వారు చేసే ఫండింగ్ ద్వారానే ఉద్యమాలు జరుగుతున్నాయని కూడా విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో జగన్ లాంటి అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్న నాయకులకు సిజెపి సపోర్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యకరం..
వ్యాసాలలో ఇన్ని రకాల సంచలన విషయాలు తాజా రాధాకృష్ణ వెల్లడించారంటే మామూలు విషయం కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత మంది బిజెపి ఎంపీలు ఎక్కువగా కనిపిస్తున్నారు.. ఈ విషయం తెలియదా.. ఒకవేళ తెలిసిన వారు నిశ్శబ్దంగా ఉండిపోయారా.. రాధాకృష్ణ లాంటివారు ఆ స్థాయిలో సంబంధాలు కొనసాగిస్తున్నారా.. ఈ ప్రశ్నలకు సమాధానం పక్కన పెడితే.. రాధాకృష్ణ రాసిన వ్యాసం బిజెపికి బూస్ట్ లాగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు.. రాహుల్ గాంధీని పదేపదే ప్రధానమంత్రిని చేస్తానని చెబుతున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడానికి విదేశీ శక్తుల సహాయం తీసుకున్నారని స్వయంగా రాధాకృష్ణ రాసుకొచ్చారు. మరి దీనిని రేవంత్ రెడ్డి ఎలా టాకిల్ చేస్తారు.. రాధాకృష్ణ దానికి కౌంటర్ ఎలా ఇస్తారు.. చూడాల్సి ఉంది.
