Home ఆంధ్రప్రదేశ్ TV5 Murthy: టీవీ 5 మూర్తి వ్యాఖ్యలకు బిజెపి కౌంటర్.. ఇది ఎక్కడికి దారితీస్తుందో.. – Andhra Waves

TV5 Murthy: టీవీ 5 మూర్తి వ్యాఖ్యలకు బిజెపి కౌంటర్.. ఇది ఎక్కడికి దారితీస్తుందో.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


TV5 Murthy: పాత్రికేయులు పాత్రికేయుల మాదిరిగా ఉండాలి. సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఒకవేళ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ సమస్యను మరో కోణంలో చూపించాలి. ప్రభుత్వానికి.. ప్రజలకు మధ్య పాత్రికేయులు వారధి లాగా ఉండాలి. ఎప్పుడు కూడా సొంత భాష్యాలను చెప్పకూడదు. ప్రజల కోణంలో లేదా ప్రభుత్వ కోణంలో మాత్రమే మీడియా సంస్థలు పని చేయాలి. అలా కాకుండా సొంత వ్యవహారాలను చెప్పుకోవడానికి.. సొంత ఆవేశాలను ప్రదర్శించడానికి మీడియాను ఉపయోగిస్తే అంతకుమించిన వ్యవస్థ విధ్వంసం మరొకటి […]

TV5 మూర్తి: పాత్రికేయులు పాత్రికేయుల మాదిరిగా ఉండాలి. సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఒకవేళ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ సమస్యను మరో కోణంలో చూపించాలి. ప్రభుత్వానికి.. ప్రజలకు మధ్య పాత్రికేయులు వారధి లాగా ఉండాలి. ఎప్పుడు కూడా సొంత భాష్యాలను చెప్పకూడదు. ప్రజల కోణంలో లేదా ప్రభుత్వ కోణంలో మాత్రమే మీడియా సంస్థలు పని చేయాలి. అలా కాకుండా సొంత వ్యవహారాలను చెప్పుకోవడానికి.. సొంత ఆవేశాలను ప్రదర్శించడానికి మీడియాను ఉపయోగిస్తే అంతకుమించిన వ్యవస్థ విధ్వంసం మరొకటి ఉండదు.

ఇటీవల సర్ ప్రయోగంపై నిర్వహించిన డిబేట్ కార్యక్రమంలో టీవీ5లో పనిచేసే జర్నలిస్టు మూర్తి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన అటు వ్యాఖ్యలు మీడియాలో.. ఇటు పొలిటికల్ సర్కిల్‌లో చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో బిజెపి నాయకులు స్పందించారు. మూర్తి చేసిన వ్యాఖ్యలను ఒక్కొక్కటి వివరిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఆధారాలు లేకుండా మాట్లాడటం సరికాదని.. వ్యవస్థలను తప్పు పట్టే విధంగా వ్యవహరించడం దారణమని సూచిస్తోంది.

ఒకవేళ సర్ ప్రైజ్‌పై అనుమానాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలని.. అంతేగాని వ్యవస్థలను నిందించడం ఏంటని బిజెపి నాయకులు ప్రశ్నిస్తున్నారు..’ఫామ్ 6 ద్వారా మీ అస్తిత్వం ఏంటి అని కాదు. మీకు 18 ఏళ్లకు వచ్చే ఓటు హక్కు ఇవ్వడానికి కావలసిన కొంత ప్రాథమిక సమాచారం. మూర్తి అంటున్నట్టుగా 2001 కాదు అది 2002. 2002 ఎందుకు అంటే ఇది 2026 అంటే 18 ఏళ్లు ఓటు వేసే పెద్దరికం వచ్చిందని రుజువు చేసే ఒక విషయం.. మీ పేరెంట్స్ 2002లో ఓటు వేసి ఉంటే మీ ఓటు అనుసంధానం జరుగుతుంది. ఇది భవిష్యత్ కాలంలో భార్య పిల్లలు గల గృహస్తులకు చాలా ఉపయోగం.. ఇకపై ఎస్ఐఆర్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అంటే ఇప్పుడు మ్యాపైన ఓటర్ కు పుట్టే సంతానం.. అతనికి పుట్టే సంతానం అంటే మనవళ్లకు ఆటోమేటిగ్ గా అనుసంధానం జరుగుతుంది. అతనికి ఓటు అనేది సహజంగా వస్తుందని” బిజెపి నాయకులు చెబుతున్నారు.

టీవీ5 ఛానల్ కూటమికి అనుకూలంగా ఉంటుంది. కూటమిలో బిజెపి కూడా ఉంది. కానీ మూర్తి మాత్రం ఎస్ఐఆర్ విషయంలో ఇష్టానుసారంగా మాట్లాడారని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. వాస్తవాలను పక్కనపెట్టి.. తనకు తోచిన సంఖ్య చెప్పుకొచ్చారని.. దీని ద్వారా ప్రజల్లో లేని అపోహలు మొదలయ్యాయని.. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకూలంగా టీవీ5 మూర్తి మాట్లాడారని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. టీవీ5 మూర్తి ఆ స్థాయిలో ఆవేశంగా మాట్లాడిన తర్వాత.. బిజెపి నాయకులు విలేకరులకు ముందుకు వచ్చి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అయితే బిజెపి నాయకుల విలేకరుల సమావేశాన్ని సాక్షి టీవీ ప్రధానంగా హైలెట్ చేయడం విశేషం.

ఏర్పడిన తర్వాత ఏపీలో సాక్షి టీవీ కూటమి బీజేపీ నాయకులకు అంతగా ప్రయారిటీ ఇచ్చినట్టు కనిపించడం లేదు. కానీ, టీవీ 5 మూర్తి అగ్రహంగా మాట్లాడిన నేపథ్యంలో సాక్షి టీవీ బిజెపి నాయకులకు ప్రయారిటీ ఇవ్వడం ప్రారంభించింది. ఈ లెక్కన వచ్చే రోజులలో కూడా ఇదే జరుగుతుందా.. ఇలాగే జరిగితే కూటమిలో ఏమైనా అవుతుందా.. టీవీ5 మూర్తి వల్ల ఇది రాజకీయ ప్రకంపనలకు దారితీస్తుందా.. ఇలాంటి సందేహాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మూర్తి ఆధారాలతో సహా మాట్లాడితే బాగుండేదని.. అలా కాకుండా ఆవేశంతో మాట్లాడటం వల్లే ఇన్ని ఇబ్బందులు వచ్చాయని.. రాజకీయంగా చర్చ జరుగుతున్నదని విశ్లేషకులు అంటున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird