Home Latest News శృతిమించిన జగన్ విమర్శలు.. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు | జగన్ మితిమీరిన విమర్శలు | తగని | వ్యాఖ్యలు | వ్యతిరేకంగా | చంద్రబాబు | మావిగన్ | రాజధాని – Andhra Waves

శృతిమించిన జగన్ విమర్శలు.. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు | జగన్ మితిమీరిన విమర్శలు | తగని | వ్యాఖ్యలు | వ్యతిరేకంగా | చంద్రబాబు | మావిగన్ | రాజధాని – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


ప్రత్యర్థి పార్టీల రాజకీయాల్లో నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే. రాజకీయ విమర్శల వరకూ ఎవరికీ ఎటువంటి అభ్యంతరం ఉండదు. కానీ అవి వ్యక్తిగత స్థాయికి దిగజారడం ఎంత మాత్రం సరికాదు. అయితే ఏపీలో వైసీపీ అధినేత జగన్ మాత్రం తన రాజకీయ ప్రత్యర్థులను విమర్శించే విషయంలో మాత్రం పదే పదే గీత దాటుతున్నారు. వ్యక్తిగత విమర్శలు, దూషణలు, శాపనార్ధాలతో శ్రుతి మించుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు పని చేసిన మాజీ సీఎం జగన్ మాత్రం తన అనుచిత వ్యాఖ్యలతో నిత్యం విమర్శలను ఎదుర్కొనే పరిస్థితిని చేజేతులా కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా గురువారం (మే 21) ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మరో సారి చంద్రబాబుపై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు గుండె ఆగి చనిపోతారు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. చంద్రబాబు ఆరోగ్యం, మరణం గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం పట్ల సర్వత్రా అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

ఇటీవల వైఎస్ జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) రాజధాని అంశంపై సోషల్ మీడియాలో జగన్ పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం మీడియాతో మాట్లాడిన జగన్.. మావిగన్ మళ్లీ మళ్లీ ప్రస్తావించారు. అయితే ఈ సారి మాత్రం ఆయన చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి, ఆయన మరణం గురించి మాట్లాడడానికి కూడా ఇసుమంతైనా వెనుకాడలేదు. ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిద్రపోతున్న సమ యంలో ఎవరైనా పొరపాటున ఆయన చెవిలో ‘మవిగన్’ అని పలికితే, ఆయనకు గుండె ఆగిపోయి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనితో ఈ పేరు వింటేనే చంద్రబాబుకు రక్తపోటు (బీపీ) పెరిగిపోతుందని జగన్ ఏమైనా. ఒక రాష్ట్రానికి ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి.. తోటి సీనియర్ నాయకుడి పట్ల ఇలాంటి భాషను ఉపయోగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సాధారణంగా దక్షిణ భారత రాజకీయాల్లో మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు, విమర్శలు సహజమే అయినప్పటికీ, జగన్ మాత్రం చంద్రబాబు వయసును, ఆరోగ్యాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దూషణలకు దిగడం పట్ల పొలిటికల్ సర్కిల్స్‌లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ఈ వ్యాఖ్యల ద్వారా తన నైతిక దిగజారుడుతనాన్ని చాటుకుంటున్నారని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఇటువంటి వ్యక్తిగత విమర్శలు, కక్షసాధింపు ధోరణిని రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird