Home Latest News కప్పు నీదే బిగిలూ.. | తలపతి విజయ్ | TVK పార్టీ | తమిళనాడు ఎన్నికల ఫలితాలు 2026 | తెలుగు వార్తలు | విజయ్‌ని అభినందించిన నారా లోకేష్ | తమిళనాడు ఎన్నికలు | తమిళనాడు రాజకీయాలు | అసెంబ్లీ ఎన్నికలు 2024 | MK స్టాలిన్ | TVK అభ్యర్థి VS బాబు | కొలత్తూరు నియోజకవర్గం – Andhra Waves

కప్పు నీదే బిగిలూ.. | తలపతి విజయ్ | TVK పార్టీ | తమిళనాడు ఎన్నికల ఫలితాలు 2026 | తెలుగు వార్తలు | విజయ్‌ని అభినందించిన నారా లోకేష్ | తమిళనాడు ఎన్నికలు | తమిళనాడు రాజకీయాలు | అసెంబ్లీ ఎన్నికలు 2024 | MK స్టాలిన్ | TVK అభ్యర్థి VS బాబు | కొలత్తూరు నియోజకవర్గం – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


విజయం నీదే..సరిలేరు నీకెవ్వరు..

అవి 202 తమిళనాడు శాసన సభ ఎన్నికలు… పోలింగ్ రోజున హీరో విజయ్ చెన్నైలోని తన ఇంటి నుంచి సైకిల్ తొక్కుకుంటూ బయటకు వచ్చారు… సైకిల్ తొక్కుతూ పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేసి వచ్చారు… ఆయన రాజకీయాల్లోకి వస్తారని తొలిసారిగా సంకేతం ఇచ్చారు.. అంతకు ముందు కొన్నేళ్ల నుంచి ఆయన రాజకీయాల్లోకి వస్తారు.

అప్పుడు సైకిల్ తొక్కుతూ బయటకు వచ్చిన విజయ్

ఐదేళ్ల తర్వాత రాజకీయ తొలి ఇన్నింగ్స్ లోనే అధికార డీఎంకే ప్రభుత్వాన్ని తొక్కేస్తారని ఎవరూ ఊహించనే లేదు…50 ఏళ్లుగా తమిళనాడులో రెండు మర్రి చెట్లలా బలంగా పాతుకు పోయిన డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల కూకటి వేళ్లను ఓ కుదుపు కుదుపుతాడని అంచనా వేయనే లేదు..

ఎందుకంటే… తమిళుల తిరుగులేని తలైవా రజినీకాంత్ 20 ఏళ్లు రాజకీయాల్లోకి అదిగో వస్తాను… ఇదిగో వస్తాను అని ఊరించి… ఊరించి… ఎట్టకేలకు పార్టీ పెడుతున్నా అని 2020లో ప్రకటించి… అంతలోనే తోకముడిచేసిన తీరు చూశారు. రాజకీయ పార్టీకి క్లాప్ కొట్టక ముందే ప్యాకప్ చెప్పి… మళ్ళీ సినిమా షూటింగ్ లకు …షాట్ రెడీ… యాక్షన్…అని అన్నారు.. అభిమానులకు షాక్ ఇచ్చారు. రజినీకాంత్ అసాధ్యం అనుకున్నది విజయ్ సుసాధ్యం చేసి చూపించారు.

అలాగనీ విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీఎంకే) గెలుపేమీ నల్లేరు మీద నడక ఏమీ కాలేదు.
విజయ్ పార్టీ ప్రకటించిన నుంచీ… అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే ఇటు కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీకి ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్నీ పెట్టాయి… విజయ్ మొదటి ఎన్నికల సభలో తొక్కిసలాటతో కొందరు చనిపోయారు..అదే అవకాశంగా ఆయనపై కేసులు పెట్టారు.. తర్వాత పార్టీ సభలకు అనుమతులు ఇవ్వలేదు..

ఆ తరువాతే విజయ్ భార్య ( ఎన్నో ఏళ్ళుగా విడిపోయి ఉంటున్నారు) ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు దేశం లో సంచలనం సృష్టించాయి. కానీ తమిళనాడులో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు అన్నది వాస్తవం.. ఎందుకంటే విజయ్ తన భార్య తో ఎన్నో ఏళ్ల క్రితమే విడిపోయారన్నది ఆ రాష్ట్రం లో అందరికీ తెలిసిన విషయమే.. ఎన్నికల ముందు ఆయన భార్య ఆరోపణలు చేయడం వెనుక ఏ పార్టీ పాత్ర ఉందన్నది కూడా ఇట్టే ఊహించారు.. అందుకే ఆ ఆరోపణలు టీవీకే పార్టీపై ప్రతికూల ప్రభావం చూపలేదు.

మరో వైపు విజయ్ తన ఎన్నికల ప్లానింగ్ తో చాప కింద నీరులా దూసుకుపోయారు.. ఇతర రాజకీయ పార్టీల అధినేతలకు భిన్నమైన శైలిలో ఆయన ఎన్నికల ప్రచారం సాగించారు.. మీడియాతో పెద్దగా మాట్లాడలేదు. అసలు ప్రధాన మీడియా లో కావరేజీ గురించి పెద్దగా పట్టించు కోలేదు. తాను ఏం చెప్పాలి అనుకున్నారో తన పార్టీ ఎన్నికల సభలోనే బహిరంగంగానే చెప్పారు. కానీ సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలను టీవీకే పార్టీ చాలా ప్రభావవంతంగా సద్వినియోగం చేసుకుంది. పక్కా ప్లానింగ్ తో ప్రజల్లోకి ప్రధానంగా జెన్ జీ తరం లోకి దూసుకుపోయింది.

డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలపై మితిమీరిన విమర్శలు చేయడం లేదు.. వివాదస్పదంగా వ్యవహరించడం లేదు.. విజయ్ తాను చెప్పాల్సింది సూటిగా చెప్పారు…తమిళ రాజకీయాలకు మూలమైన ద్రవిడ వాదానికి కట్టుబడి ఉంటాం..డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలతో విసుగెత్తి. కానీ తమిళనాట పాట, కొత్త తరాల మద్దతు సాధించేందుకు సరైన ప్రణాళికతో దూసుకుపోయారు..ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం అన్న స్పష్టమైన విధానం టీవీకే పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపింది.. పార్టీని గెలిపించుకోవాలి అనే కసి రగిలించింది.

వెరసి…

రాజకీయ తెర మీద నిబ్బరంగా… స్థిరంగా పోరాడినవాడే సూపర్ స్టార్ అని విజయ్ మరోసారి నిరూపించారు.
విజయ్ పాపులారిటీని కొంత వరకు అయినా సరే చెక్ పెట్టేందుకు ఆయన నటించిన “జన నాయకన్” సినిమా రిలీజ్ ను అధికార పార్టీ అడ్డుకుంది. ఆ సినిమా ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసిన వాళ్లు కూడా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు..కానీ ఆ సినిమాలో కొన్ని సీన్లు లీక్ అయ్యాయి..సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..వాటిలో ఒక సీనులో “ఉంగ విజయ్… నాను వారరెన్ (మీ విజయ్ ను… నేను వస్తున్నా)

అనే డైలాగ్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..

ఎన్నికల ప్రచారంలో విజయ్ డైలాగ్ నే తన పొలిటికల్ పంచ్ లైన్ గా చేసుకున్నారు. తన ఎన్నికల ప్రచార రథం మీద నుంచి మాట్లాడుతూ…” ఉంగ విజయ్.. నాను వారెరెన్… విజిల్ ఆడిక్కా … రెడీ నా”( మీ విజయ్ ను… నేను వస్తున్నా… విజిల్ మోగించడానికి మీరు రెడీ నా) అని తన క్యాడర్ ను ఉర్రూతలూగించారు… “ఉంగ… ఉంగ ” అనే టీవీకే పార్టీ ప్రచార గీతం తమిళనాట విజయ్. ఆ విజిల్ మోత తమిళనాడు విజయ దుందుభి మోగించింది.

‘నాను వారెరన్.. నాను వారెరన్ ( నేను వస్తున్నా… నేను వస్తున్నా) అన్న విజయ్… తన తొలి పొలిటికల్ ఇన్‌స్టరింగ్ లోనే సెంచరీ కొట్టి తన టీవీకే పార్టీ కి తమిళనాట ఛాంపియన్ గా నిలిచారు..

2026 ఎన్నికల్లో తమిళనాడులో

Player Ot The Match గానే కాదు…మినీ జనరల్ ఎన్నికలు అన్నట్టుగా…2029 జనరల్ ఎన్నికలకు సెమీ ఫైనల్ అనిపించేలా అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో The Most Emerging Player in Indian Politics అవార్డు కూడా సాధించారు. ఇక జనరల్ ఎన్నికల ఐపీఎల్ -2029 కోసం అన్ని ప్రధాన పార్టీలు విజయ్ ను తమ జట్టులో చేర్చుకోవడానికి ఇప్పటి నుంచే పావులు కదపడం ఖాయం..

వడ్డాది శ్రీనివాస్.. ఫేస్ బుక్ వాల్ నుంచి సేకరణ.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird