Home సినిమా Drishyam 3 Movie Review: ‘దృశ్యం 3’ మూవీ రివ్యూ – Andhra Waves

Drishyam 3 Movie Review: ‘దృశ్యం 3’ మూవీ రివ్యూ – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


ఇండియన్ సినీ లవర్స్‌లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘దృశ్యం’కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి రెండు భాగాలు ఘన విజయం సాధించడమే కాకుండా, తెలుగుతో పాటు పలు భాషల్లో రీమేక్ అయి సంచలనం సృష్టించాయి. భారీ అంచనాల మధ్య మూడో భాగం ‘దృశ్యం 3’ (దృశ్యం 3) నేడు (మే 21) థియేటర్లలోకి వచ్చింది. ఈసారి తెలుగులో కాకుండా నేరుగా డబ్బింగ్ వెర్షన్‌గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులకు ఏ మేరకు మెప్పించింది? జార్జ్‌కుట్టి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆడిన చివరి మైండ్ గేమ్ వర్కవుట్ అయిందా? (దృశ్యం 3 తెలుగు రివ్యూ)

కథ:
‘దృశ్యం 2’ ఎక్కడ ముగిసిందో, అక్కడ నుంచే ఈ మూడో భాగం కథ వచ్చింది. జార్జ్‌కుట్టి (మోహన్‌లాల్) సినిమా ప్రొడ్యూసర్‌గా మారి, మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంటాడు. తన పెద్ద కుమార్తె అంజు (అన్సిబా హాసన్)కు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే ఏదో ఒక కారణంతో ప్రతి సంబంధం క్యాన్సిల్ అవుతూ ఉంటుంది. ఫైనల్‌గా దుబాయ్‌లో ఉండే ఎన్నారై (ఎన్‌ఆర్‌ఐ) సంబంధం కుదరడంతో, త్వరగా పెళ్లి చేసి కూతురిని దుబాయ్ పంపాలనుకుంటాడు జార్జ్‌కుట్టి. కానీ, జార్జ్‌కుట్టి కుటుంబంపై పగతో ఉన్న వరుణ్ తండ్రి ప్రభాకర్ (సిద్ధిఖ్).. అంజు పెళ్లిని ఎలాగైనా చెడగొట్టాలని ప్రయత్నిస్తాడు. మరో పాత కేసును మళ్లీ రీఓపెన్ ఎక్కడో జార్జ్‌కుట్టికి పోలీసులు తెలుస్తుంది. తన కూతురి పెళ్లిని కాపాడుకుంటూ, కుటుంబాన్ని రక్షించడానికి జార్జ్‌కుట్టి ఈసారి ఎలాంటి మైండ్ గేమ్ ఆడాడనేదే ‘దృశ్యం 3’ కథ.

ఎనాలిసిస్:
‘దృశ్యం’ సిరీస్ సినిమాలకు ప్రధాన బలం.. ఊహకందని ట్విస్ట్‌లు, మైండ్ బ్లోయింగ్ స్క్రీన్‌ప్లే. కానీ, ‘దృశ్యం 3’ లో ఆ మ్యాజిక్ మిస్ అయింది. జార్జ్‌కుట్టి రేంజ్ తెలివిని చూపించే సీన్స్ ఈసారి చాలా తక్కువ. ఫస్ట్ హాఫ్ అంతా కథ చాలా నెమ్మదిగా, ఫ్లాట్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కొంత ఆసక్తిని రేకెత్తించినప్పటికీ.. సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్ట్‌లు అంతగా ఇంపాక్ట్ చూపించవు. చివరి 15-20 నిమిషాలు పాత ‘దృశ్యం’ టెన్షన్‌ను గుర్తుచేస్తూ గ్రిప్పింగ్‌గా సాగుతుంది. అయినప్పటికీ, ముగింపు సీన్ మినహా మిగిలిన సినిమా అంతా చాలా బేసిక్‌గా ఉండటంతో ఈ ఫ్రాంచైజీలోనే ఇది అత్యంత బలహీనమైన చిత్రంగా మిగిలిపోతుంది.

ఈ మూడవ భాగం కథను నడిపించడంలో దర్శకుడు జీతూ జోసెఫ్ తడబడినట్లు కనిపిస్తుంది. మొదటి రెండు భాగాలలో ఉన్నంత బిగువైన కథనం, ఊహించని ట్విస్టులు ఈ సినిమాలో లోపించాయి. సినిమా ప్రారంభ కథ చాలా నెమ్మదిగా సాగుతుంది, దాదాపు మొదటి గంట పాత్రల పరిచయానికి, పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికే సరిపోయింది. మొదటి భాగంలో ఉన్న ఇంటెన్సిటీ గానీ, రెండవ భాగంలో క్లైమాక్స్ ముందు వచ్చే మైండ్ బ్లోయింగ్ కోర్టు రూమ్ డ్రామా ఎలివేషన్స్ లేదా ఇందులో ఆశించిన స్థాయిలో పండలేదు. సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజ్ కదా అని కేవలం మూడో భాగంగా సాగదీసినట్లు అనిపిస్తుంది తప్ప, బ్రాండ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా బలమైన కథనాన్ని రాసుకునే ప్రయత్నం దర్శకుడు చేయలేదు.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
జార్జ్‌కుట్టి పాత్రలో మోహన్‌లాల్ మరోసారి జీవించేశారు. తన కుటుంబాన్ని కాపాడాలంటే తపన పడే తండ్రిగా, లోపల తీవ్రమైన మానసిక ఆందోళన బయటకు ప్రశాంతంగా కనిపించే ఒక క్రిమినల్ మైండ్‌గా ఆయన నటన అద్భుతం. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఆయన నటనకు పెద్ద ప్లస్. ఇక భార్య పాత్రలో మీనా, కుమార్తెలుగా అన్సిబా హసన్ ఈస్టర్ అనిల్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. పోలీస్ ఆఫీసర్లుగా మురళీ గోపి, ఆశా శరత్, సిద్ధిఖ్ తమ పాత పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

దర్శకుడు జీతూ జోసెఫ్ ఈసారి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కంటే ఫ్యామిలీ ఎమోషన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఒక థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన మూడ్‌ను బిల్డ్ చేయడంలో, కొన్ని చోట్ల టెన్షన్ క్రియేట్ చేయడంలో జీతూ జోసెఫ్ సక్సెస్ అయ్యారు. అయితే, మొదటి రెండు భాగాలతో ఈసారి రైటింగ్ చాలా బలహీనంగా అనిపిస్తుంది. అనిల్ జాన్సన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించినా.. సతీష్ కురూప్ కెమెరా వర్క్, వి.ఎస్. వినాయక్ ఎడిటింగ్ సాదాసీదాగా ఉన్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఆశించిన స్థాయిలో లేవు.

ప్లస్ పాయింట్స్:
మోహన్ లాల్ పర్ఫార్మెన్స్
ఇంటర్వెల్ బ్లాక్
క్లైమాక్స్

మైనస్ పాయింట్లు:
ఫ్లాట్ నరేషన్
ఊహకు అందే ట్విస్ట్‌లు
మొదటి రెండు భాగాల రేంజ్ థ్రిల్ మిస్ అవ్వడం

ఫైనల్ గా…
మొదటి రెండు భాగాలను రేంజ్ మైండ్ గేమ్స్, షాకింగ్ ట్విస్ట్ ఆశించి వెళ్తే ‘దృశ్యం 3’ తీవ్రంగా నిరాశపరుస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం మోహన్ లాల్ నటన కోసం, ఫ్యామిలీ ఎమోషన్స్ కోసం ఒకసారి చూడవచ్చు.

రేటింగ్: 2.25/5

నిరాకరణ: ఈ సమీక్షలో వ్యక్తీకరించబడిన అభిప్రాయాలు/అభిప్రాయాలు రచయిత పంచుకున్న వ్యక్తిగత అభిప్రాయాలు/అభిప్రాయాలు మరియు సంస్థ వాటికి బాధ్యత వహించదు. వీక్షకుల విచక్షణతో వారికి ప్రతిస్పందించే ముందు సలహా ఇవ్వబడుతుంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird